ఫొటో కర్టసీ: దేవాంగ బోరా
ఒక పెద్దగోళానికి నాలుగు చక్రాలు తగిలించి ఉన్నట్లు కనిపిస్తున్న ఈ విచిత్రవాహనం ఆటబొమ్మ కాదు, అచ్చంగా ప్రయాణాలకు పనికొచ్చే కారు. కంప్యూటర్లు, మొబైల్‌ఫోన్లు తయారుచేసే యాపిల్ కంపెనీ తాజాగా రూపొందించిన కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కారు ఇది. యాపిల్ కంపెనీ కోసం భారత సంతతికి చెందిన మెకానికల్ డిజైనర్ దేవాంగ బోరా ‘యాపిల్ ఆటోనమస్’ పేరిట ఈ గోళాకార శకటానికి రూపకల్పన చేశారు.
ఇందులోని మరో విశేషం ఏమిటంటే, దీనికి డ్రైవర్ అవసరం లేదు. ఇది పూర్తిగా డ్రైవర్‌లెస్ వాహనం. ఇద్దరు మనుషులు ఇందులో సౌకర్యవంతంగా ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ప్రయాణించేవారిని కోరుకున్న చోట దించేశాక ఈ కారు నిర్దేశిత పార్కింగ్ స్థలానికి తనంటత తానే వెళ్లిపోతుంది. ఈ వాహనాన్ని మరో రెండేళ్లలో మార్కెట్‌లోకి తేవడానికి యాపిల్ సంస్థ సన్నాహాలు చేసుకుంటోంది. (క్లిక్: గూగుల్ కు దిమ్మ తిరిగే షాక్, రూ.65కోట్ల జాక్ పాట్ కొట్టేశాడు!)
Comments
Please login to add a commentAdd a comment