సాఫీగా ఉన్న రోడ్డు మీద గంటకు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్న మీ కారుకు సడెన్‌గా బ్రేకులు పడితే.. ఆ ఉహ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఆ ఊహల్ని నిజం చేసేలా గత కొన్ని ఏళ్లుగా దిగ్గజ టెక్ కంపెనీలు మానవ రహిత కార్ల తయారీపై దృష్టి సారించాయి. వాటిని తయారు చేసి పరిమితంగా వాహనదారులకు క్యాబ్ సర్వీసులు అందిస్తున్నాయి.
తాజాగా, అమెరికాలో గూగుల్‌కు చెందిన వేమో సంస్థ అందుబాటులోకి తెచ్చిన డ్రైవర్ లెస్ క‍్యాబ్‌లో భారత్‌కు చెందిన ఓ మహిళా, ఆమె కుమారుడు ఇద్దరు ప్రయాణించారు. ఈ సందర్భంగా సెల్ఫ్ డ్రైవింగ్ కారు ప్రయాణం గురించి ఆశ్చర్య పోయారు. డ్రైవర్ లేకుండా వారు చేరాలనుకున్న గమ్యస్థానానికి సురక్షితంగా వెళ్లామని చెబుతూ ఓ వీడియో తీశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇన్ని రోజులు స్తబ్ధుగా ఉన్న ఆయా సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో డ్రైవర్ లెస్ కార్ల తయారీపై మరింత దృష్టిసారిస్తున్నాయి. ప్రయాణాల్లో జరిగే ఆకస్మిక ప్రమాదాల నుంచి ప్రాణనష్టాన్ని నివారించేందుకు గత కొన్ని ఏళ్లుగా టెస్లా, గూగుల్ వేమో వంటి సంస్థ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను తయారు చేస్తున్నాయి.
2015 నుంచి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లపై గూగుల్‌కు చెందిన వేమో ఇప్పటికే వేల కొద్ది మానవ రహిత కార్లను వినియోగంలోకి తెచ్చింది. పరిమిత సంఖ్యలో సేవలందిస్తున్నాయి. తాజాగా, అమెరికాలోని ఓ ప్రాంతంలో తమిళనాడుకు చెందిన తల్లి కొడుకులైన ఇద్దరు భారతీయులు వేమో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లపై ప్రయాణించారు. ఈ సందర్భంగా డ్రైవర్ లేని కారులో ప్రయాణించి ఆశ్చర్యపోయారు. అమ్మ కారులో కూర్చొని ఆ కారును ఎలా నడుపుతుందో తెలుపుతుంటే.. ఆమె కుమారుడు అమ్మా.. ఇందులో డ్రైవర్ లేడమ్మా అంటూ వీడియో తీస్తూ సంతోషం చెబుతున్న వీడియో నెట్టింట్లో చక్కెర్లు కొడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఆ వీడియో ఎలా ఉందో మీరూ చేసేయండి.
Comments
Please login to add a commentAdd a comment