డ్రైవర్‌ లెస్‌ కారులో మంటలు.. వీడియో వైరల్‌ | driverless Burning Car On Jaipur Road video viral | Sakshi
Sakshi News home page

డ్రైవర్‌ లెస్‌ కారులో మంటలు.. వీడియో వైరల్‌

Published Sun, Oct 13 2024 4:30 PM | Last Updated on Sun, Oct 13 2024 4:51 PM

driverless Burning Car On Jaipur Road video viral

జైపూర్‌:  రాజస్థాన్‌లో ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది. జైపూర్‌లో డ్రైవర్‌ లెస్‌ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రోడ్డుపై పార్క్‌ చసిన బైక్‌లను ఢీకొడుతూ మంటలతోనే కారు ముందుకు వెళ్లింది. ప్రస్తుతం  ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కారు ఓనర్‌ అల్వార్‌కు చెందిన ముఖేష్ గోస్వామిగా పోలీసులు గుర్తించారు. కదులుతున్న కారులో మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కారును ముఖేష్ గోస్వామి అతని స్నేహితుడు జితేంద్ర జంగిద్ నడిపారు. అయితే కారు బానెట్ నుంచి ఒక్కసారిగా పొగలు రావటాన్ని ఆయన గమనించారు. మంటలు చెలరేగడంతో కారు హ్యాండ్‌బ్రేక్ ఫెయిల్ అయింది. దీంతో డ్రైవర్ జితేంద్ర.. అందులో నుంచి బయటకు దూకేశారు. ఎలివేటెడ్ రోడ్డులో కారు మంటలతో అక్కడ పార్క్‌ చేసిన పలు బైక్‌లను ఢీకొడుతూ కిందికి కదిలింది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్ని ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైనట్లు అగ్నిమాపక అధికారి దినేష్ కుమార్ ధృవీకరించారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు. 

చదవండి:  డెంగ్యూకు టీకా.. బీహార్‌లో తుది ట్రయల్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement