Burning car
-
డ్రైవర్ లెస్ కారులో మంటలు.. వీడియో వైరల్
జైపూర్: రాజస్థాన్‌లో ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది. జైపూర్‌లో డ్రైవర్ లెస్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రోడ్డుపై పార్క్ చసిన బైక్‌లను ఢీకొడుతూ మంటలతోనే కారు ముందుకు వెళ్లింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కారు ఓనర్ అల్వార్‌కు చెందిన ముఖేష్ గోస్వామిగా పోలీసులు గుర్తించారు. కదులుతున్న కారులో మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కారును ముఖేష్ గోస్వామి అతని స్నేహితుడు జితేంద్ర జంగిద్ నడిపారు. అయితే కారు బానెట్ నుంచి ఒక్కసారిగా పొగలు రావటాన్ని ఆయన గమనించారు. మంటలు చెలరేగడంతో కారు హ్యాండ్‌బ్రేక్ ఫెయిల్ అయింది. దీంతో డ్రైవర్ జితేంద్ర.. అందులో నుంచి బయటకు దూకేశారు. ఎలివేటెడ్ రోడ్డులో కారు మంటలతో అక్కడ పార్క్ చేసిన పలు బైక్‌లను ఢీకొడుతూ కిందికి కదిలింది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్ని ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైనట్లు అగ్నిమాపక అధికారి దినేష్ కుమార్ ధృవీకరించారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు. Watch Burning Car on #Jaipur Road Causes Panic Among Commuters | #Burningcar pic.twitter.com/mzEKAGCyU6— KINGSNEWS (@KINGSNEWS7) October 13, 2024చదవండి: డెంగ్యూకు టీకా.. బీహార్‌లో తుది ట్రయల్స్ -
కారులో చెలరేగిన మంటలు.. యువకుడు అప్రమత్తమవ్వడంతో
సాక్షి, రాజేంద్రనగర్: ఓ కారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఓ యువకుడు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో కారులో ప్రయాణిస్తున్న ఓ కుటుంబం సురక్షితంగా బయటపడింది. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పహాడిషరీఫ్ మామిడిపల్లి ప్రాంతానికి చెందిన శైలజ తన మూడు నెలల చిన్నారిని బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చూపించేందుకు మరో కుమారుడు శ్రీహాన్స్ (6), తన సోదరి కుమారుడు విజయ్ (12)తో కలసి కారులో బయలుదేరింది. వాహనం ఆరాంఘర్ పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా మెహదీపట్నం వైపు వెళుతోంది. మార్గమధ్యలోని అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 132 వద్దకు రాగానే కారు వెనుక నుంచి పొగలు వస్తుండటాన్ని శైలజ కుమారుడు గమనించాడు. విషయం చెప్పగానే వాహనాన్ని పక్కకు ఆపి చూసే సరికి మంటలు ఎగిసి పడుతున్నాయి. డోర్ లాక్ తీసి తన మూడు నెలల చిన్నారిని బయటకు తీసింది. అప్పటికే వెనుక డోర్ లాక్ పడటంతో ఇద్దరు చిన్నారులు లోపలే చిక్కుకుపోయారు. ఈ దారి గుండా వెళ్తున్న రవి అనే యువకుడు వెంటనే స్పందించాడు. కారు అద్దాలను పగులగొట్టి ఇద్దరు చిన్నారులను సురక్షితంగా బయటకు తీశాడు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలాన్ని రాజేంద్రనగర్ ఏసీపీ సంజయ్‌కుమార్, ఇన్స్పెక్టర్ కనకయ్య, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్యామ్‌సుందర్ సందర్శించారు. శైలజతో పాటు ముగ్గురు చిన్నారులను సురక్షితంగా మరో వాహనంలో ఇంటికి చేర్చారు. ఆరా తీసిన గవర్నర్.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మహేశ్వరంనియోజకవర్గ పరిధిలోని కేసీ తండాలో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి హాజరై వెళ్తున్న క్రమంలో ఈ ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. కారు ప్రమాదం జరిగిన దృశ్యాన్ని చూస్తూ ముందుకు వెళ్లారు. విషయాన్ని తన అధికారుల బృందాన్ని అడిగి తెలుసుకున్నట్లు రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు. గవర్నర్ కాన్వాయ్ వెళ్లిన అనంతరం ట్రాఫిక్‌ను ఎక్స్‌ప్రెస్‌వేపైకి అనుమతి ఇచ్చారు. చిన్నారులను కాపాడిన రవిని అభినందిస్తున్న ఏసీపీ సంజయ్‌కుమార్ శభాష్ రవి నగరానికి చెందిన రవి తన కారులో ఆరాంఘర్ నుంచి మెహదీపట్నం వైపు వెళ్తున్నాడు. అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 130 వద్దకు రాగానే ముందు వెళ్తున్న కారు మంటల్లో చిక్కుకోవడంతో తన వాహనాన్ని పక్కకు ఆపి కారు వెనుక అద్దాలను పగులగొట్టాడు. మంటల్లో చిక్కుకున్న ఇద్దరు చిన్నారులను బయటకు తీసి వారి ప్రాణాలను కాపాడాడు. కాగా, సమయస్ఫూర్తితో వ్యవహరించిన రవిని రాజేంద్రనగర్ ఏసీపీ సంజయ్‌కుమార్, ఇన్స్పెక్టర్ కనకయ్య, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్యామ్‌సుందర్ అభినందించారు. శైలజ సైతం కృతజ్ఞతలు తెలిపింది. -
కారులో మంటలు.. ఫోన్స్‌తో బిజీగా జనాలు
-
కారులో మంటలు.. ఫోన్స్‌తో బిజీగా జనాలు
గురుగ్రామ్ : నడిరోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ కారులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగితే ఒక్కరు స్పందించకపోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. హర్యానా, గురుగ్రామ్‌లోని రాజీవ్ చౌక్ ఫ్లైఓవర్‌పై మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన.. జనాల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఇక ఆ కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి ఎలాగోలా ప్రాణాలతో బయటపడ్డాడు. మ్యాన్‌పవర్ సంస్థ ఉద్యోగైన రాకేశ్ చందెల్ (44) తన కారులో ఇంటికి వస్తుండగా ఆకస్మాత్తుగా కారులో మంటలు సంభవించాయి. ఇది గమనించిన రాకేశ్ ఆ కారులో నుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నాడు. అనంతరం తన కారులోని మంటలార్పేందుకు శతవిధాల ప్రయత్నించి విఫలమయ్యాడు. రాకేశ్ బయటకు వచ్చిన తరువాత కూడా ఆ కారు అలాగే కొద్దీ దూరం వెళ్లింది. ఈ కారుతో పరిగెత్తిన రాకేశ్.. ఎదురుగా వచ్చిన ఆటోను అక్కడికి వచ్చిన అధికారులు తప్పించారు. ఈ ఘటనపై రాకేశ్ మాట్లాడుతూ.. ‘కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఎదో వింత శబ్దం రావడంతో దిగి కారు టైర్లు చెక్ చేసాను. అప్పుడు ఎలాంటి మంటలు లేవు. అయినా ఆ శబ్దం ఆగలేదు. కారు ఫ్లైఓవర్ ఎక్కగానే నిమిషాల్లోనే మొత్తం మంటలు వ్యాపించాయి. బ్రేక్స్ వేసినా కారు ఆగలేదు. వెంటనే డోర్ తీసి బయటకు దూకాను. పోలీస్, ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చా. సాయం చేయాలని ఎంత అరిచినా ఒక్కరు స్పందించలేదు. వారంతా మొబైల్స్‌లో ఈ ఘటనను రికార్డు చేస్తూ బిజీగా ఉన్నారు. కనీసం మంచినీళ్లను కూడా ఎవరు ఇవ్వలేదు’ అని అవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. -
గుంటూరు జిల్లాలో రోడ్డు పైనే కారు దగ్ధం
-
డబ్బులివ్వలేదని కారుకు నిప్పు పెట్టాడు..
బహదూర్‌పురా: అవసరానికి డబ్బులు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన ఓ వ్యక్తి మరో ముగ్గురితో కలసి స్నేహితుడి కొత్త కారును దహనం చేశాడు. ఇందుకు సంబంధించి నలుగురిని బహదూర్‌పురా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్సై రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... కిషన్‌బాగ్ ఆసద్బాబానగర్ ప్రాంతానికి చెందిన షకీల్, డబీర్‌పురాకు చెందిన ఎజాజ్ (25) స్నేహితులు. ఇరవై రోజుల క్రితం షకీల్ కొత్త కారును కొనుగోలు చేశాడు. ఇదిలా ఉండగా తనకు డబ్బులు అవసరముందంటూ ఎజాజ్ షకీల్‌ను డబ్బులు అడగ్గా అతడు ఇవ్వలేదు. దీంతో కోపం పెంచుకున్న ఎజాజ్ గత నెల 29వ తేదీన రాత్రి 2.30 గంటలకు తన స్నేహితులు అజీజ్ సుల్తాన్ (26), ఫుర్కాన్ (24), ఇబ్రహీం (22)లతో కలిసి షకీల్ కొత్త కారుపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టారు. షకీల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల్లో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
టీడీపీ అరాచకాలను సహించం
కారును తగలబెట్టడం దారుణం = జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాపూరు : జిల్లాలో ఎన్నడూ లేనివిధంగా టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్సీపీ నాయకులపై దౌర్జన్యాలకు దిగుతున్నారని, దీనిని సహించేది లేదని జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి హెచ్చరించారు. మాజీ సర్పంచ్, వైఎస్సార్సీపీ నాయకుడు బొడ్డు మధుసూదనరెడ్డికి చెందిన కారును దహనం చేయడం దారుణమైన చర్య అని పేర్కొన్నారు. తెగచర్లలో మధుసూదనరెడ్డి కారును తగలబెట్టిన తీరును గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బొమ్మిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ గ్రామ నడిబొడ్డులో ఉంచిన కారును దహనం చేయడం, తోట కంచెను తగలబెట్టడం మంచి సంస్కృతికాదని హితవు పలికారు. గత నెల లో గ్రామంలోని 7 పశువుల కొట్టాలను తగలబెట్టినా శాంతి కోరుకునే తమ పార్టీ నాయకులు ఎటువంటి కేసులు పెట్టలేదన్నారు. దీనిని అలుసుగా తీసుకొని తోట కంచెను, కారును తగలబెట్టడం హేయమైనచర్య అన్నారు. సమయానికి గిరిజనులు స్పందించకపోతే తోట కంచెతో పాటు వారి గృహాలు కూడా దగ్ధమై ఆస్తి, ప్రాణనష్టం జరిగేదన్నారు. పోలీ సులు సమగ్ర విచారణ జరిపి నిందితులను అరెస్టు చేయాలన్నారు. జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకులపై నాన్‌బెయిల్‌బుల్ కేసులపెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ఎస్పీ దీనిపై దృష్టి సారించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. లేకుంటే పార్టీ కార్యకర్తలకు అండగా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని తెలిపారు. ఆయన వెంట కలువాయి జెట్పీటీసీ సభ్యుడు అనిల్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాపూరు మండల కన్వీనర్ బత్తిన పట్టాభిరామిరెడ్డి, పెంచలకోన దేవస్థానం మాజీ పాలకమండలి అధ్యక్షుడు నెల్లూరు రవీంద్రరెడ్డి, బొడ్డు మధుసూదనరెడ్డి ఉన్నారు.