- కారును తగలబెట్టడం దారుణం
- = జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి
రాపూరు : జిల్లాలో ఎన్నడూ లేనివిధంగా టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్‌సీపీ నాయకులపై దౌర్జన్యాలకు దిగుతున్నారని, దీనిని సహించేది లేదని జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి హెచ్చరించారు. మాజీ సర్పంచ్, వైఎస్సార్‌సీపీ నాయకుడు బొడ్డు మధుసూదనరెడ్డికి చెందిన కారును దహనం చేయడం దారుణమైన చర్య అని పేర్కొన్నారు. తెగచర్లలో మధుసూదనరెడ్డి కారును తగలబెట్టిన తీరును గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బొమ్మిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ గ్రామ నడిబొడ్డులో ఉంచిన కారును దహనం చేయడం, తోట కంచెను తగలబెట్టడం మంచి సంస్కృతికాదని హితవు పలికారు.
గత నెల లో గ్రామంలోని 7 పశువుల కొట్టాలను తగలబెట్టినా శాంతి కోరుకునే తమ పార్టీ నాయకులు ఎటువంటి కేసులు పెట్టలేదన్నారు. దీనిని అలుసుగా తీసుకొని తోట కంచెను, కారును తగలబెట్టడం హేయమైనచర్య అన్నారు. సమయానికి గిరిజనులు స్పందించకపోతే తోట కంచెతో పాటు వారి గృహాలు కూడా దగ్ధమై ఆస్తి, ప్రాణనష్టం జరిగేదన్నారు. పోలీ సులు సమగ్ర విచారణ జరిపి నిందితులను అరెస్టు చేయాలన్నారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీ నాయకులపై నాన్‌బెయిల్‌బుల్ కేసులపెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు.
ఎస్పీ దీనిపై దృష్టి సారించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. లేకుంటే పార్టీ కార్యకర్తలకు అండగా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని తెలిపారు. ఆయన వెంట కలువాయి జెట్పీటీసీ సభ్యుడు అనిల్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాపూరు మండల కన్వీనర్ బత్తిన పట్టాభిరామిరెడ్డి, పెంచలకోన దేవస్థానం మాజీ పాలకమండలి అధ్యక్షుడు నెల్లూరు రవీంద్రరెడ్డి, బొడ్డు మధుసూదనరెడ్డి ఉన్నారు.