బహదూర్‌పురా: అవసరానికి డబ్బులు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన ఓ వ్యక్తి మరో ముగ్గురితో కలసి స్నేహితుడి కొత్త కారును దహనం చేశాడు. ఇందుకు సంబంధించి నలుగురిని బహదూర్‌పురా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్సై రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... కిషన్‌బాగ్ ఆసద్‌బాబానగర్ ప్రాంతానికి చెందిన షకీల్, డబీర్‌పురాకు చెందిన ఎజాజ్ (25) స్నేహితులు. ఇరవై రోజుల క్రితం షకీల్ కొత్త కారును కొనుగోలు చేశాడు.
ఇదిలా ఉండగా తనకు డబ్బులు అవసరముందంటూ ఎజాజ్ షకీల్‌ను డబ్బులు అడగ్గా అతడు ఇవ్వలేదు. దీంతో కోపం పెంచుకున్న ఎజాజ్ గత నెల 29వ తేదీన రాత్రి 2.30 గంటలకు తన స్నేహితులు అజీజ్ సుల్తాన్ (26), ఫుర్కాన్ (24), ఇబ్రహీం (22)లతో కలిసి షకీల్ కొత్త కారుపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టారు. షకీల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల్లో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
డబ్బులివ్వలేదని కారుకు నిప్పు పెట్టాడు..
Published Fri, Mar 4 2016 9:58 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
Advertisement
Advertisement