Bahadurpura police
-
బహదూర్‌పురా: 18 నెలల చిన్నారి కిడ్నాప్ కేసు సుఖాంతం
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో 18 నెలల చిన్నారి కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. బహుదూర్‌పురా పీఎస్ పరిధిలోని కిషన్‌బాగ్‌లో సోమవారం ఏడాదిన్నర వయసున్న చిన్నారి కిడ్నాప్‌కు గురైంది. పాపను ఓ మహిళ అపహరించి తీసుకెళ్లుతున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. సీసీటీవీ ఆధారంగా 24 గంటల వ్యవధిలోనే పసికందు ఆచూకీని బహదూర్‌పురా పోలీసులు కనుగొన్నారు. ఫిర్యాదు ఇచ్చిన నాలుగు గంటల్లోనే కిడ్నాప్ కేసును చేధించారు. కిడ్నాప్ చేసిన మహిళను అరెస్ట్ చేశారు. చిన్నారిని తల్లిదండ్రులకు పోలీసుల అప్పగించారు. తన కొడుకుకి 8 ఏళ్లుగా పిల్లలు పుట్టకపోవడంతో మహిళ.. పాపను కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. -
కాపురంలో ఫోన్‌కాల్ చిచ్చు: వయసైన కూతుళ్లతో తల్లి అదృశ్యం
బహదూర్‌పురా (హైదరాబాద్): ముగ్గురు పిల్లలతో కలిసి బయటికి వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన హైదరాబాద్‌లోని కామాటిపురా పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం... కామాటిపురా మురళీ గుమ్మాస్ ప్రాంతానికి చెందిన కిషన్ శర్మ, పూజ ఆలియాస్ రాగిణి (34) దంపతులు. వీరికి 16 ఏళ్ల క్రితం వివాహం కాగా.. ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. మూడేళ్ల కిందట మలక్‌పేట్‌లో నివసించే సమయంలో ఇంటికి ఎదురుగా ఉన్న పవన్ (30)తో పూజ తరచుగా మాట్లాడేది. ఈ విషయమై భర్త కిషన్ శర్మ పవన్‌ను మందలించి, 8 నెలల కిందట కామాటిపురాలోని మురళీ గుమ్మాస్‌కు మకాం మార్చారు. అయితే పవన్ కూడా ఇటీవల తన నివాసాన్ని మురళీ గుమ్మాస్‌కు మార్చాడు. తరచు ఫోన్లో మాట్లాడుతుండడంతో పూజతో కిషన్ శర్మ గొడవ పడగా.. ఈ నెల 16వ తేదీన పూజ తన ముగ్గురు కూతుళ్లు కీర్తి, మోహిని ఆలియాస్ మీనా (14), గోపి (12)తో తిరుపతి వెళ్తున్నానని చెప్పి వెళ్లింది. ఇప్పటవరకు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కిషన్ శర్మ కామాటిపురా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు సెల్ నం. 9490616495లో సంప్రదించాలన్నారు. -
కొండచిలువ పట్టివేత
బహదూర్‌పురా (హైదరాబాద్‌సిటీ): మీరాలం ఫిల్టర్ ప్రాంతంలో దొరికిన కొండ చిలువను బహదూర్‌పురా పోలీసులు గురువారం జూపార్కుకు తరలించారు. బహదూర్‌పురా ఇన్స్పెక్టర్ హరీష్ కౌషిక్ ఇందుకు సంబందించిన వివరాలు వెల్లడించారు. మీరాలం ఫిల్టర్ ఏ-1 ఫంక్షన్‌కు హాల్ వద్ద కొండ చిలువ సంచరిస్తున్నట్లు స్థానికులు సమాచారం అందించడంతో అప్రమత్తమైన పోలీసులు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ సభ్యులు సర్ధార్ మహ్మద్ ఆదిల్, అరుణ్‌లతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ట్యాంక్ చుట్టు ఉన్న ఇనుప జాలీల కారణంగా కొండచిలువ బయటికి వచ్చేందుకు ప్రయత్నించి అందులో చిక్కుకుపోయింది. దీంతో మహ్మద్ ఆదిల్ జాలీలను వదులు చేసి దానిని పట్టుకున్నాడు. దానిని జూపార్కుకు తరలించారు. కొండ చిలువకు ఎలాంటి గాయాలు లేవని, పొడవు 8 అడుగులు, బరువు దాదాపు 10 కిలోలు ఉన్నట్లు జూపార్కు వెటర్నరీ అసిస్టెంట్ డెరైక్టర్ ఎం.ఎ.హకీం తెలిపారు. -
డబ్బులివ్వలేదని కారుకు నిప్పు పెట్టాడు..
బహదూర్‌పురా: అవసరానికి డబ్బులు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన ఓ వ్యక్తి మరో ముగ్గురితో కలసి స్నేహితుడి కొత్త కారును దహనం చేశాడు. ఇందుకు సంబంధించి నలుగురిని బహదూర్‌పురా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్సై రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... కిషన్‌బాగ్ ఆసద్బాబానగర్ ప్రాంతానికి చెందిన షకీల్, డబీర్‌పురాకు చెందిన ఎజాజ్ (25) స్నేహితులు. ఇరవై రోజుల క్రితం షకీల్ కొత్త కారును కొనుగోలు చేశాడు. ఇదిలా ఉండగా తనకు డబ్బులు అవసరముందంటూ ఎజాజ్ షకీల్‌ను డబ్బులు అడగ్గా అతడు ఇవ్వలేదు. దీంతో కోపం పెంచుకున్న ఎజాజ్ గత నెల 29వ తేదీన రాత్రి 2.30 గంటలకు తన స్నేహితులు అజీజ్ సుల్తాన్ (26), ఫుర్కాన్ (24), ఇబ్రహీం (22)లతో కలిసి షకీల్ కొత్త కారుపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టారు. షకీల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల్లో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.