Nissan Company
-
హోండా, నిస్సాన్ విలీనం
టోక్యో: జపాన్ ఆటోమొబైల్ దిగ్గజాలు హోండా, నిస్సాన్ విలీనం కానున్నట్లు ప్రకటించాయి. ఇందుకు సంబంధించి ఇరు సంస్థలు ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. నిస్సాన్‌కు వాటాలున్న మిత్సుబిషి మోటార్స్ కూడా తన వ్యాపారాన్ని విలీనం చేసే చర్చల్లో భాగమయ్యేందుకు అంగీకరించినట్లు కంపెనీలు వెల్లడించాయి. ఈ డీల్‌తో విలీన సంస్థ.. అమ్మకాలపరంగా ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆటోమొబైల్ కంపెనీగా ఆవిర్భవించనుంది. ఫ్రాన్స్‌కు చెందిన రెనోతో భాగస్వామ్యం, అలాగే మిత్సుబిషి మోటార్స్ కార్ప్‌లతో కలిసి హోండా, నిస్సాన్ కూటమి.. జపాన్‌కే చెందిన ఆటోమొబైల్ దిగ్గజం టయోటా మోటర్ కార్ప్, జర్మనీకి చెందిన ఫోక్స్వ్యాగన్లతో పోటీ పడనుంది. విలీనం అమల్లోకి వస్తే మరింత పెద్ద స్థాయిలో కస్టమర్లకు చేరువయ్యేందుకు తోడ్పడగలదని నిస్సాన్ సీఈవో మకొటొ యుషిడా తెలిపారు. ఇటీవలే హోండా, నిస్సాన్ విలీన వార్తలు రావడం తెలిసిందే. ఆటోమొబైల్ పరిశ్రమ క్రమంగా శిలాజ ఇంధనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు, స్వయంచాలిత టెక్నాలజీల వైపు మళ్లుతున్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.50 బిలియన్ డాలర్ల దిగ్గజం..: మూడు కంపెనీల కలయికతో 50 బిలియన్ డాలర్ల పైగా మార్కెట్ విలువ గల దిగ్గజ సంస్థ ఏర్పాటవుతుంది. వీటి వార్షిక వాహనాల ఉత్పత్తి పరిమాణం 80 లక్షలు ఉంటుంది. 2023లో హోండా 40 లక్షలు, నిస్సాన్ 34 లక్షలు, మిత్సుబిషి మోటర్స్ దాదాపు 10 లక్షల వాహనాలను ఉత్పత్తి చేశాయి. అయితే ఈ మూడూ కలిసినా కూడా ఉత్పత్తిపరంగా టయోటానే అగ్రగామిగా కొనసాగనుంది. 2023లో టయోటా మొత్తం 1.15 కోట్ల వాహనాల తయారీతో టాప్‌లో ఉంది. ఫోక్స్‌వ్యాగన్ సుమారు 89 లక్షల వాహనాల ఉత్పత్తితో రెండో స్థానంలో నిల్చింది. ప్రస్తుతం దాదాపు 68 లక్షల వాహనాలతో (కియా, జెనెసిస్ బ్రాండ్లతో కలిసి) దక్షిణ కొరియా సంస్థ హ్యుందాయ్ మూడో స్థానంలో ఉంది. ప్రయోజనాలేమిటంటే.. ఒకవైపు వాహన కంపెనీలు శిలాజ ఇంధనాల వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లేందుకు తంటాలు పడుతుండగా మరోవైపు చైనా కంపెనీలు కొత్త టెక్నాలజీల విషయంలో దూసుకెళ్తుండటం పరిశ్రమను కుదిపేస్తోంది. చైనాకు చెందిన బీవైడీ, గ్రేట్ వాల్, నియో వంటి చౌక ప్రత్యామ్నాయ ఎలక్ట్రిక్ వాహనాలు.. జపాన్, అమెరికన్ కార్ల కంపెనీల మార్కెట్ వాటాను కొల్లగొడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పరిశ్రమలో కన్సాలిడేషన్ చోటుచేసుకుంటున్నట్లు పరిశ్రమల వర్గాలు తెలిపాయి. ఆరి్థక సమస్యలు, తగ్గుతున్న లాభదాయకతతో నిస్సాన్ సతమతమవుతోంది. చైనాలో అమ్మకాల బలహీన తతో హోండా లాభాలపైనా ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో విలీనం చోటు చేసుకుంటోంది. 2023లో జరిగిన అమ్మకాల పరంగా టాప్ 10 అతిపెద్ద వాహన తయారీదారుల జాబితాటయోటా - 10.3 మిలియన్ వాహనాలువోక్స్ వ్యాగన్ గ్రూప్ - 9.2 మిలియన్ వాహనాలుహ్యుందాయ్ మోటార్ గ్రూప్ - 7.3 మిలియన్ వాహనాలుస్టెలాంటిస్ - 6.4 మిలియన్ వాహనాలుజనరల్ మోటార్స్ - 6.2 మిలియన్ వాహనాలుఫోర్డ్ మోటార్ కంపెనీ - 4.4 మిలియన్ వాహనాలుహోండా - 4.2 మిలియన్ వాహనాలునిస్సాన్ - 3.4 మిలియన్ వాహనాలు(నోట్: విలీన ప్రక్రియ పూర్తైతే హోండా, నిస్సాన్ కలిపి అమ్మకాల్లో టాప్ 3 కంపెనీ అవతరించినట్లువుతుంది.)బీఎండబ్ల్యూ గ్రూప్ - 2.6 మిలియన్ వాహనాలుమెర్సిడెస్ బెంజ్ - 2.5 మిలియన్ వాహనాలు -
నిస్సాన్ డాట్సన్ రెడి-గో వచ్చేసింది
♦ ధర రూ.2.38-3.34 లక్షల రేంజ్లో ♦ 25.17 కి.మీ. మైలేజీ న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన నిస్సాన్ కంపెనీ డాట్సన్ బ్రాండ్‌లో కొత్త చిన్న కారు మోడల్‌ను మంగళవారం మార్కెట్లోకి తెచ్చింది. డాట్సన్ రెడి-గో పేరుతో అందిస్తున్న ఈ పెట్రోల్ కారు ధరలు 2.38 లక్షల నుంచి రూ.3.34 లక్షల రేంజ్లో నిర్ణయించామని నిస్సాన్ ఇండియా కంపెనీ తెలిపింది. డాట్సన్ రెడి గో కారును ఐదు వేరియంట్లు-డి, ఏ, టీ, టి(ఓ), ఎస్‌ల్లో అందిస్తున్నామని నిస్సాన్ ఇండియా ఎండీ, అరుణ్ మల్హోత్ర చెప్పారు. చిన్న కారు అంటే భారత్‌లో ఉన్న అంచనాలను ఈ డాట్సన్ గో మార్చేస్తుందని పేర్కొన్నారు. మంగళవారం నుంచే విక్రయాలు ప్రారంభించామని తెలిపారు. ధరల పోరు షురూ! రెడీ గో రాకతో ఎంట్రీ-లెవల్ సెగ్మంట్లో ధరల యుద్ధానికి తెర లేవనున్నదని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఈ కారు మారుతీ ఆల్టో, హ్యుందాయ్ ఈఆన్, రెనో క్విడ్ కార్లకు గట్టి పోటీనిస్తుందని నిపుణులంటున్నారు. ఈ కార్ల ధరలు రూ.2.5 లక్షల నుంచి రూ4.42 లక్షల రేంజ్లో ఉన్నాయి. మూడో డాట్సన్ కారు: డాట్సన్ బ్రాండ్ కింద కంపెనీ అందిస్తోన్న మూడో కారు ఇది. భారత్‌లో అభివృద్ధి చేసిన కొత్త ప్లాట్‌ఫాం మీద ఈ కారును నిస్సాన్‌కంపెనీ తయారు చేస్తోంది. 800 సీసీ ఇంజిన్, ఐదు గేర్లు ఉన్న ఈ కారు 25.17 కి.మీ. మైలేజీని ఇస్తుందని, వంద కిమీ, వేగాన్ని 15.9 సెకన్లలోనే అందుకుంటుందని, గరిష్ట వేగం గంటకు 140 కి.మీ. అని అరుణ్ పేర్కొన్నారు. -
నిస్సాన్ డాట్సన్ రెడీ-గో వచ్చింది..
♦ వచ్చే నెల నుంచి బుకింగ్స్, జూన్ నుంచి డెలివరీలు... ♦ ధర రూ.2.5 లక్షలు-3.5 లక్షల రేంజ్లో (అంచనాలు) న్యూఢిల్లీ: నిస్సాన్ కంపెనీ డాట్సన్ బ్రాండ్ కింద కాంపాక్ట్ కారు రెడీ-గోను ఆవిష్కరించింది. గో, గో ప్లస్ కార్ల తర్వాత డాట్సన్ బ్రాండ్ కింద కంపెనీ అందిస్తోన్న మూడో కారు ఇది. వచ్చే నెల నుంచి బుకింగ్స్ ప్రారంభిస్తామని, జూన్ నుంచి డెలివరీలు ఇస్తామని నిస్సాన్ ఇండియా కంపెనీ పేర్కొంది. డాట్సన్ కార్ల కొనుగోళ్లకు రుణాలిచ్చే స్కీమ్‌లను త్వరలో అందుబాటులోకి తేనున్నామని, దీంతో తమ అమ్మకాలు మరింతగా పుంజుకుంటాయని నిస్సాన్ ఇండియా ప్రెసిడెంట్(ఆపరేషన్స్) గుయిల్యామ్ సికార్డ్ చెప్పారు. రూ.2.5 లక్షల నుంచి రూ.4.42 లక్షల రేంజ్లో ఉన్న మారుతీ సుజుకీ ఆల్టో, హ్యుందాయ్ ఇఆన్, రెనో క్విడ్ కార్లకు గట్టి పోటీనిచ్చే ఈ రెడీ-గో కారు ధరలను కంపెనీ వెల్లడించలేదు. అయితే ధరలు ధర రూ.2.5 లక్షల నుంచి రూ.3.5 లక్షల రేంజ్లో ఉండొచ్చని అంచనా. కారు ప్రత్యేకతలు...: 800 సీసీ 3-సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్‌తో రూపొందిన ఈ కారులో 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్, విశాలమైన వెనక సీట్లు, ఆకర్షణీయమైన హెడ్‌ల్యాంప్స్, బంపర్‌పై ఎల్ఈడీ డీఆర్ఎల్లు, వెనుక స్పోర్టింగ్ వెర్టికల్ టెయిల్ ల్యాంప్స్ వంటి ప్రత్యేకతలున్నాయని కంపెనీ పేర్కొంది. ఈ కేటగిరీలో తమ కారే అత్యుత్తమ మైలీజీనిస్తుందని తెలిపింది. రెనో క్విడ్ రూపొం దిన సీఎంఎఫ్-ఏ ప్లాట్ఫార్మ్పైనే ఈ కారును రూపొందించారు. -
3.5 శాతం వరకూ పెరిగిన నిస్సాన్ కార్ల ధరలు
న్యూఢిల్లీ: కార్లపై మౌలిక సెస్ విధింపు కారణంగా పలు కార్ల కంపెనీలు కార్ల ధరలను పెంచుతున్నాయి. తాజాగా నిస్సాన్ మోటార్ ఇండియా కంపెనీ తన అన్ని రకాల మోడళ్లపై ధరలను 3.5% వరకూ పెంచింది. తాము విక్రయిస్తున్న అన్నిరకాల మోడళ్ల ధరలను 1% నుంచి 3.5 శాతం వరకూ పెంచుతున్నామని నిస్సాన్ కంపెనీ తెలిపింది. డాట్సన్ ధరలను 1% వరకూ, టెర్రానో, మిడ్ సైజ్ సెడాన్ సన్నీ ధరలను 3.25% నుంచి 3.5% వరకూ పెంచుతున్నామని పేర్కొంది. ఈ కంపెనీ రూ. 3.23 లక్షల ధర ఉన్న డాట్సన్ గో నుంచి నుంచి రూ.13.20 లక్షల ఖరీదున్న ఎస్యూవీ టెర్రానో వరకూ వివిధ కార్లను విక్రయిస్తోంది. -
కడిగేసుకొనే కారు వచ్చింది!
లండన్: లక్షలు పోసి కొన్న కారును లక్షణంగా చూసుకోవాలంటే ఎన్నో పాట్లు పడాలి... రోడ్డు మీద తిరిగి ఇంటికొచ్చిన మీ కారు తనతో పాటు బురద కూడా అంటించుకొని వస్తుంది...అప్పుడు కారును శుభ్రం చేయడానికి మీరు ఒక రోజంతా కేటాయించాల్సిందే. కానీ, నిస్సాన్ కంపెనీకి చెందిన ఈ కారు కొంటే ఇకపై ఇలాంటి ఇబ్బందులు ఉండవు...ఎందుకంటే ఈ కారు తనంతట తానుగా శుభ్రం చేసుకుంటుంది. దుమ్ము, ధూళి కణాలు కారుపై పడకుండా వికర్షణకు గురిచేసేలా నానో పెయింట్ (అల్ట్రా ఎవిర్‌డే )టెక్నాలజీతో ఈ కారును రూపొందించారు. కారు పైభాగం సూపర్ హైడ్రోఫోబిక్, అయిలోఫోబిక్ పెయింట్స్‌తో ఉండడం వల్ల చమురు, బురదను కూడా తనపై చేరనీయదు. కాకపోతే ఈ అల్ట్రా ఎవిర్‌డే టెక్నాలజీని మీ కారుకు ఉపయోగించాలంటే రూ. 45వేలు అవుతుంది.