కడిగేసుకొనే కారు వచ్చింది! | clean got the car! | Sakshi
Sakshi News home page

కడిగేసుకొనే కారు వచ్చింది!

Published Sat, Apr 26 2014 12:59 AM | Last Updated on Sat, Sep 2 2017 6:31 AM

కడిగేసుకొనే కారు వచ్చింది!

కడిగేసుకొనే కారు వచ్చింది!

లండన్: లక్షలు పోసి కొన్న కారును లక్షణంగా చూసుకోవాలంటే ఎన్నో పాట్లు పడాలి... రోడ్డు మీద తిరిగి ఇంటికొచ్చిన మీ కారు తనతో పాటు బురద కూడా అంటించుకొని వస్తుంది...అప్పుడు కారును  శుభ్రం చేయడానికి మీరు ఒక రోజంతా కేటాయించాల్సిందే. కానీ, నిస్సాన్ కంపెనీకి చెందిన ఈ కారు కొంటే ఇకపై ఇలాంటి ఇబ్బందులు ఉండవు...ఎందుకంటే  ఈ కారు తనంతట తానుగా శుభ్రం చేసుకుంటుంది.

దుమ్ము, ధూళి కణాలు కారుపై పడకుండా వికర్షణకు గురిచేసేలా నానో పెయింట్ (అల్ట్రా ఎవిర్‌డే )టెక్నాలజీతో ఈ కారును రూపొందించారు. కారు పైభాగం సూపర్ హైడ్రోఫోబిక్, అయిలోఫోబిక్ పెయింట్స్‌తో ఉండడం వల్ల చమురు, బురదను కూడా తనపై చేరనీయదు. కాకపోతే ఈ అల్ట్రా ఎవిర్‌డే టెక్నాలజీని మీ కారుకు ఉపయోగించాలంటే రూ. 45వేలు అవుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement