3.5 శాతం వరకూ పెరిగిన నిస్సాన్ కార్ల ధరలు
న్యూఢిల్లీ: కార్లపై మౌలిక సెస్ విధింపు కారణంగా పలు కార్ల కంపెనీలు కార్ల ధరలను పెంచుతున్నాయి. తాజాగా నిస్సాన్ మోటార్ ఇండియా కంపెనీ తన అన్ని రకాల మోడళ్లపై ధరలను 3.5% వరకూ పెంచింది. తాము విక్రయిస్తున్న అన్నిరకాల మోడళ్ల ధరలను 1% నుంచి 3.5 శాతం వరకూ పెంచుతున్నామని నిస్సాన్ కంపెనీ తెలిపింది. డాట్సన్ ధరలను 1% వరకూ, టెర్రానో, మిడ్ సైజ్ సెడాన్ సన్నీ ధరలను 3.25% నుంచి 3.5% వరకూ పెంచుతున్నామని పేర్కొంది. ఈ కంపెనీ రూ. 3.23 లక్షల ధర ఉన్న డాట్సన్ గో నుంచి నుంచి రూ.13.20 లక్షల ఖరీదున్న ఎస్‌యూవీ టెర్రానో వరకూ వివిధ కార్లను విక్రయిస్తోంది.