ses
-
వాటాదారులకే ప్రాధాన్యత ఇవ్వాలి
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ సొంత వాటాదారులకే ప్రాధాన్యత ఇవ్వాలని కార్పొరేట్ పాలన పరిశోధన, సలహాదారు సంస్థ ఎస్ఈఎస్ ఒక నివేదికలో పేర్కొంది. గ్రూప్‌పై ఆరోపణలు చేసిన హిండెన్‌బర్గ్ కంపెనీలలో వాటాదారుకాదని తెలియజేసింది. హిండెన్‌బర్గ్ ఆరోపణల తదుపరి గ్రూప్ మార్కెట్ క్యాప్(విలువ) భారీగా పతనమైన నేపథ్యంలో ఖాతాలపై థర్డ్‌పార్టీ ఆడిట్ ద్వారా వాటాదారుల ఆందోళనలకు చెక్ పెట్టవచ్చని సలహా ఇచ్చింది. గ్రూప్ రుణాలపై అవసరానికి మించి ఆందోళనలు తలెత్తినట్లు అభిప్రాయపడింది. స్వతంత్ర థర్డ్‌పార్టీ ఆడిట్ ద్వారా గ్రూప్ విశ్వాసాన్ని( క్రెడిబిలిటీ) తిరిగి పొందవచ్చని సూచించింది. యూఎస్ షార్ట్‌సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీలలో అమ్మకాలు ఊపందుకున్న సంగతి తెలిసిందే. దీంతో సుమారు 140 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ ఆవిరైంది. అయితే మంగళవారం(28న) ట్రేడింగ్‌లో పలు కౌంటర్లు బౌన్స్‌బ్యాక్ అయ్యాయి. క్యాష్ ఫ్లోలు ఓకే అదానీ గ్రూప్‌లోని ప్రతీ కంపెనీ రుణ చెల్లింపులకు తగిన క్యాష్ ఫ్లోలు సాధించగలిగే స్థితిలో ఉన్నట్లు ఎస్ఈఎస్ అభిప్రాయపడింది. వెరసి గ్రూప్ రుణభారంపై అధిక స్థాయి ఆందోళనలు సరికాకపోవచ్చని పేర్కొంది. గ్రూప్‌లోని చాలా కంపెనీలు రుణ చెల్లింపులకు తగిన నగదు రాకను కలిగి ఉన్నట్లు తెలియజేసింది. అదానీ ట్రాన్స్మిషన్ అధిక రుణ–ఈక్విటీ నిష్పత్తిని కలిగి ఉన్నట్లు పేర్కొంది. అయితే విద్యుత్ ప్రసారం బిజినెస్ ద్వారా ఫిక్స్డ్ రిటర్న్ సాధించగలమని కంపెనీ విశ్వసిస్తున్నట్లు తెలియజేసింది. దీంతో ఆందోళన లు సరికాదని పేర్కొంది. ఇక అదానీ గ్రీన్ అధిక రు ణ భారాన్ని కలిగి ఉన్నప్పటికీ రుణ చెల్లింపుల్లో ఎ లాంటి సమస్యలనూ ఎదుర్కోలేదని వివరించింది. -
ఖతర్నాక్ ఐడియాతో రిలయన్స్ జియో..!
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో భారీ ప్రణాళికను రూపొందించింది. మొబైల్ నెట్వర్క్ సేవలనే కాకుండా శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించేందుకు జియో ప్రణాళికలను రచిస్తోంది. జాయింట్ వెంచర్‌గా..! భారత్‌లో అతి తక్కువ సమయంలో నంబర్ వన్ మొబైల్ నెట్వర్క్ సేవలను అందిస్తోన్న టెలికాం కంపెనీగా రిలయన్స్ జియో అవతరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు శాటిలైట్ ద్వారా బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిచేందుకుగాను రిలయన్స్ జియో సంస్థ జాయింట్ వెంచర్‌ను నెలకొల్పింది. శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవల్లో భాగంగా జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్, లక్సెంబర్గ్‌కు చెందిన శాటిలైట్, టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్ ప్రొవైడర్ ఎస్ఈఎస్ సంయుక్తంగా జియో స్పేస్ టెక్నాలజీ లిమిటెడ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ జాయింట్ వెంచర్లో జియో ప్లాట్‌ఫామ్స్ 51 శాతం, ఎస్ఈఎస్ 49 శాతం వాటాలను కల్గి ఉన్నాయి. జియో స్టేషనరీ, మీడియం ఎర్త్ ఆర్బిట్లలో పలు శాటిలైట్లను ప్రయోగించనున్నాయి. ఈ శాటిలైట్లతో బ్రాడ్‌బ్యాండ్ సేవలను రిలయన్స్ జియో అందించనుంది. మరిన్ని కంపెనీలు ఎలాగైనా శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను భారత్‌లో నెలకొల్పాలనే ఎలన్‌మస్క్ ప్రణాళికలకు రిలయన్స్ జియో గట్టి పోటీని ఇచ్చే అవకాశం ఉంది. స్టార్‌లింక్ సేవలను భారత్‌లో ప్రవేశపెట్టాలనే మస్క్ ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం అడ్డుపడింది. భారత్‌తో పాటుగా పొరుగుదేశాలకు కూడా శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను రిలయన్స్ జియో అందించనుంది. ఇక శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ విషయంలో మరో దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ముందుంది. టాటా గ్రూపు సైతం ఈ పనులు ఎప్పుడో ప్రారంభించింది. ఇప్పటికే 66 శాతం పైగా శాటిలైట్లను వన్‌వెబ్ సహకారంతో విజయవంతంగా పూర్తి చేసింది. చదవండి: రయ్‌మంటూ దూసుకెళ్లిన రిలయన్స్..! డీలా పడ్డ టీసీఎస్..! -
ఇక పెట్రోల్ మంటే
సాక్షి, సిటీబ్యూరో : కేంద్ర బడ్జెట్ వాహనదారులకు వాత పెట్టింది. సామాన్యులకు మళ్లీ పెట్రో మంట అంటుకుంది. ఇప్పటికే రోజువారి సవరణతో పెట్రో, డీజిల్ ధరలు పైసా పైసా ఎగబాకుతూ పరుగులు తీస్తుండగా.. బడ్జెట్లో సుంకాలు పెంపు మరింత భారంగా మారనున్నాయి. పెట్రోల్, డీజిల్ లీటర్‌పై ఎక్సైజ్ డ్యూటీ, సెస్ రూపాయి చొప్పున బడ్జెట్లో పెంచారు. ఫలితంగా హైదరాబాద్‌లో పెట్రోల్‌పై రూ.2.69, డీజిల్‌పై రూ.2.65 అదనపు భారం పడింది. దాంతో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్ రూ.74.88, డీజిల్ రూ.70.06 గా ఉన్నవి కాస్తా శుక్రవారం రాత్రి నుంచి పెట్రోల్ రూ.77.57, డీజిల్ రూ.72.71కు చేరాయి. హైదరాబాద్ పరిధిలో సుమారు 60.34 లక్షల వివిధ రకాల వాహనాలున్నాయి. అందులో పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలు 44.04 లక్షలు, డీజిల్ బస్సులు, మినీ బస్సులు, కార్లు, జీపులు, టాక్సీలు, ఆటోలు, ట్రాక్టర్లు, ఇతరాత్ర వాహనాలు కలిపి సుమారు 20.30 లక్షల వరకు ఉంటాయని అంచనా. మహానగరం పరిధిలో సుమారు 560 పైగా పెట్రోల్, డీజిల్ బంక్‌లు ఉండగా, ప్రతిరోజు సగటున 40 లక్షల లీటర్ల పెట్రోల్, 30 లక్షల లీటర్ల డీజిల్ వినియోగమవుతోంది. తాజాగా కేంద్ర బడ్జెట్ నిర్ణయంతో గ్రేటర్‌లోని వాహనదారుల నుంచి రోజుకు సగటున రూ.కోటిన్నరకు పైగా అదనపు భారం పడనుంది. పన్నుల మోతనే.. పెట్రో ధరల దూకుడుకు పన్నుల మోత, రవాణ చార్జీల బాదుడు కారణంగా కనిపిస్తోంది. పెట్రోల్ ఉత్పత్తుల అమ్మకాలపై వ్యాట్ పన్నుల విధింపు అధికంగానే ఉంది. నగరంలో పెట్రోల్‌పై 35.20 శాతం, డీజిల్ 27 శాతం వ్యాట్ వసూలు చేస్తున్నారు. వాస్తవంగా పెట్రో ఉత్పత్తులపై రెండు రకాల పన్నుల విధిస్తుండడంతో వినియోగదారుల జేబులు గుల్లవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్ర ప్రభుత్వం విలువ ఆధారిత పన్ను(వ్యాట్) విధిస్తున్నాయి. ప్రజలపై పన్ను భారం తగదు ఇప్పటికే పెట్రో, డీజిల్ ధరలు రోజువారి సవరణతో పెచడం భారంగా మారింది. ఇప్పుడు కేంద్ర బడ్జెట్లో సుంకాలు పెంపు మరింత భారమే. పెట్రో ఉత్పత్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడి ఎక్సైజ్, అమ్మకం పన్ను వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ ఖాజానా నింపేందుకు ప్రజలపై పన్ను బాదుడు తగదు. జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ ఉత్పత్తులు చేర్చితే ధరలు దిగి ఉపశమనం కలుగుతుంది. – బందగి బద్షా రియాజ్ ఖాద్రీ, చైర్మన్, ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ -
సెస్ సొమ్ము కార్మికుడి ఖాతాలోకి!
సాక్షి, హైదరాబాద్: దేశంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షే మం కోసం వసూలు చేసే సెస్ దుర్వినియోగం అవుతోంది. సుమారు రూ.28 వేల కోట్లు వృథాగా పడిఉన్నాయని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తెలిపింది. సరైన వైద్య సేవలు, రక్షణ అందక నిర్మాణ కార్మికుడు పూర్తి నిస్సహాయ స్థితిలో ఉన్నాడని.. ఇకనైనా కేంద్రం దృష్టి సారించాలని సూచించింది. 1996 భవన, ఇతర నిర్మాణ కార్మికుల ఉపాధి, రక్షణ, ఆరోగ్యం, సంక్షేమ చట్టాన్ని రూపొందించారు. నిర్మాణ వ్యయంలో 1% సెస్ రూపంలో కట్టాల్సి ఉంటు ంది. గతేడాది డిసెంబర్ నాటికి దేశంలో కార్మిక శాఖ వద్ద నమోదైన నిర్మాణ కార్మికుల సంఖ్య 2.8 కోట్లు. తెలంగాణలో కార్మిక శాఖ వద్ద నమోదైన సంఖ్య 10 లక్షలు. అదనంగా మరో 7 లక్షల వరకుంటారని తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు మెంబర్ గంధం అంజన్న తెలిపారు. అవగాహన లేకే చాలా మంది నిర్మాణ కార్మికులు నమోదు చేయించుకోవట్లేదు. 2022 నాటికి దేశంలో భవన నిర్మాణ రంగంలో 76.5 మిలియన్ మంది కార్మికుల అవసరం ఉంటుందని అన్‌రాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ చైర్మన్ అనూజ్పురి తెలిపారు. నిర్మాణ కార్మికుల్లో ఎక్కువ మంది వలసదారులే ఉంటారు. బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి వలసలెక్కువగా ఉంటుంటాయి. వలస నిర్మాణ కార్మికులు కనీస వేతనాలు, ఓవర్ టైం చెల్లింపులు, సెలవులు వంటి గృహ, సాంఘిక భద్రత ప్రయోజనాలకు అర్హులు. కానీ, వాస్తవానికి దేశంలో కార్మిక చట్టం అమలు సవ్యంగా జరగట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణ రంగంలో కార్మికులు అత్యంత కీలకం. ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేసే వీళ్ల రక్షణ, వైద్య సేవలు దీర్ఘకాలంగా నిర్లక్ష్యంగా చేయబడ్డాయి. దీనికి పరిష్కారం చూపించేందుకే భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) దృష్టిసారించిందని క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు ఎస్. రాంరెడ్డి తెలిపారు. దుర్వినియోగమవుతున్న లేబర్ సెస్ సద్వినియోగానికి ప్రత్యేకంగా ఒక పథకం ఉండాల్సిన అవసరముందని ఆయన సూచించారు. ‘‘సెస్ సొమ్మును నేరుగా కార్మికుని బ్యాంక్ ఖాతాలో జమ చేయవచ్చు. లేకపోతే ఆరోగ్యశ్రీ లాగానే లేబర్ వైద్య పథకం వంటి దాన్ని ఏర్పాటు చేసి సెస్ సొమ్మును అందులో జమ చేస్తే.. కార్మికునితో పాటూ కుటుంబంలోని ఇతర సభ్యుల వైద్య సేవల సమయంలోనూ వినియోగించుకునే వీలుంటుందని’’ ఆయన వివరించారు. దీంతో మరింత మంది నిర్మాణ కార్మికులు నమోదయ్యే అవకాశంతో పాటూ వారి ఆరోగ్యం, సంక్షేమం కూడా మెరుగవుతుందని పేర్కొన్నారు. సాధ్యాసాధ్యాలపై క్రెడాయ్ సభ్యులతో చర్చించి.. 2 నెలల్లో కార్మిక శాఖ మంత్రితో సంప్రదింపులు జరుపుతామని ఆయన తెలియజేశారు. మే 1 నుంచి కొత్త పథకాలు.. నిర్మాణ పనుల్లో కాళ్లు, చేతులు విరిగి వికలాంగులైన కార్మికులకు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం నెలకు రూ.1,500 పెన్షన్ ఇస్తోంది. దీనికి అదనంగా మరో రూ.3,000 ఇవ్వనున్నట్లు సమాచారం. కార్మిక దినోత్సవం (మే1)న దీన్ని సీఎం ప్రారంభించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదు చేసుకున్న కార్మికుల్లో వికలాంగులుగా ఉన్న వాళ్లు 225 మందిగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో పాటూ వలస కార్మికుల పిల్లలను బడికి పంపిస్తే 1–6వ తరగతి వరకు ఏడాదికి రూ.2 వేలు, 7–10 వరకు రూ.3 వేల ప్రోత్సాహకంగా ఇవ్వనున్నట్లు తెలిసింది. -
వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
కలెక్టర్ లోకేష్ కుమార్ భద్రాచలం : వ్యాధుల వ్యాప్తిపై సంబంధిత శాఖల అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, నివారణ చర్యలపై శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ డీఎస్ లోకేష్ కుమార్ ఆదేశించారు. బుధవారం ఐటీడీఏ పీఓ చాంబర్లో యూనిట్ అధికారులతో వివిధ అంశాలపై పీఓ రాజీవ్‌తో కలిసి సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. డెంగ్యూ, మలేరియా వ్యాప్తి–నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పిన్ పాయింట్ కార్యక్రమంలో భాగంగా ఏఎన్ఎమ్లు, ఆశా వర్కర్లు, మెడికల్ సిబ్బందితో కలిసి గ్రామాల్లోని ఇంటింటికీ వెళ్లి డెంగ్యూ, మలేరియా ఎందుకు వస్తుందో.. రాకుండా ఉండాలంటే ఏమేం చేయాలో వివరించాలని అన్నారు. గిరిజన గ్రామాల్లో గురు, శుక్రవారాల్లో డ్రై డే నిర్వహించాలన్నారు. దోమల లార్వాలన్నింటి తొలగింపు, ఇంటి పరిసరాల పరిశుభ్రత, జ్వరం వచ్చినప్పుడు వెంటనే సమీప ఆస్పత్రికి వెళ్లడం తదితరాంశాలపై అవగాహన కల్పించాలని, 7 నుంచి 17వ తేదీ వరకు ర్యాపిడ్ ఫీవర్ సర్వే నిర్వహించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఫాగింగ్, స్ప్రేయింగ్ కొనసాగించాలన్నారు. దీనికి కావాల్సిన నిధులను మంజూరు చేస్తామన్నారు. పంచాయతీ, వైద్య సిబ్బంది కలిసి గ్రామాలలో క్లోరినేషన్ పటిష్టంగా అమలయ్యేలా చూడాలన్నారు. భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచ, ఖమ్మంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో డెంగ్యూ ఇల్సా పరీక్షలు నిర్వహించడంతోపాటు వైద్యం కూడా అందుతోందని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. వర్షాలు పడుతున్నందున గ్రామాలలో తాగునీటిని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఎప్పటికప్పుడు పరీక్షించాలని ఆదేశించారు. గుర్తించిన మండలాలలో పామాయిల్ తోటలను గిరిజన రైతులు పెంచేందుకు ప్రణాళికలు రూపొందించేందుకు అధికారులు కషి చేయాలన్నారు. ప్రస్తుతం నర్సరీలో ఉన్న మొక్కలను పంపిణీ చేయడంతోపాటు వచ్చే సంవత్సరానికి 40 లక్షలు మొక్కలను పెంచాలని ఉద్యానవన అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీడీ (ట్రైబల్ వెల్ఫేర్) ఎం.జయదేవ్ అబ్రహం, ఏడీఎంహెచ్ఓ డాక్టర్ పుల్లయ్య, డీఎంఓ డాక్టర్ ఎం.రాంబాబు, ఏపీఓ (జనరల్) కె.భీమ్రావ్, ఎస్వో డేవిడ్‌రాజ్, ఎస్వో (పీటీజీ )మల్లేశ్వరి, ఏపీఓ (పవర్) అనురాధ, ఉద్యానవన అధికారి జి.మరియన్న, ఏడీఏహెచ్ జి.వెంకయ్య, యూనిట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
‘సెస్’ కొనుగోళ్లపై మంత్రి కేటీఆర్ ఆరా
సిరిసిల్ల : సిరిసిల్ల ‘సెస్’ పరిధిలో టెండర్లు లేకుండా ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాల కొనుగోలు వ్యవహారంపై మంత్రి కేటీఆర్ గురువారం ఆరా తీసినట్లు సమాచారం. ఎల్లారెడ్డిపేటలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ‘సెస్’ చైర్మన్ దోర్నాల లక్ష్మారెడ్డి, డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డిని తన వాహనంలో ఎక్కించుకుని కొనుగోళ్ల వ్యవహారంపై ఆరా తీసినట్లు తెలిసింది. నిబంధనల ప్రకారమే కొనుగోళ్లు జరిగాయని చైర్మన్ లక్ష్మారెడ్డి వివరణ ఇవ్వగా.. పారదర్శకంగా టెండర్లు నిర్వహించకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. పాలకవర్గం సభ్యుల మధ్య అంతర్గత కలహాలపైనా మంత్రి ఆరా తీసినట్లు తెలిసింది. ప్రధానంగా ‘సాక్షి’ కథనాలను ప్రస్తావిస్తూ.. ‘సెస్’ పరిధిలో ఇటీవల నెలకొన్న అంశాలను మంత్రి కేటీఆర్ అడిగినట్లు సమాచారం. ఉద్యోగుల సరెండర్, మూకుమ్మడి సిమ్‌కార్డుల సరెండర్ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. సమర్థవంతమైన సేవలు అందించే ‘సెస్’ పరువుతీయకుండా నిజాయితీగా వినియోగదారులకు సేవలు అందించాలని కేటీఆర్ సూచించినట్లు తెలిసింది. అత్యవసరం మేరకే కొనుగోళ్లు – ‘సెస్’ ఎండీ నాంపల్లి గుట్ట ‘సెస్’ పరిధిలో అత్యవసరమైన పనుల కోసం టెండర్లు లేకుండానే కొనుగోళ్లకు పర్చేజ్ కమిటీ ఆమోదంతో ఆర్డర్లు ఇచ్చామని మేనేజింగ్ డైరెక్టర్ కె.నాంపల్లి గుట్ట తెలిపారు. సిరిసిల్ల ‘సెస్’ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మధ్యమానేరు పునరావాస కాలనీల్లో విద్యుద్దీకరణ కోసం ప్రభుత్వం కలెక్టర్ ద్వారా ‘సెస్’ సంస్థకు రూ.4.87 కోట్లు డిపాజిట్ చేసిందని వివరించారు. పునరావాస కాలనీల్లో ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు ఏర్పాటు చేసేందుకు అత్యవసరంగా భావించి పాలకవర్గం నిర్ణయం మేరకు కొనుగోళ్లకు ఆర్డర్లు ఇచ్చామన్నారు. టెండర్లు లేకుండా అవసరం మేరకు కొనుగోళ్లు చేయవచ్చని ‘సెస్’ నిబంధనల్లో ఉందని వివరించారు. ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాల కొనుగోళ్లకు సంబంధించిన రికార్డులన్నీ సిద్ధంగా ఉన్నాయని ఎండీ తెలిపారు. ‘సెస్’ సంస్థకు నష్టం కలిగించే పనులు చేయడం లేదని పేర్కొన్నారు. పాలకవర్గంలోని కొందరు డైరెక్టర్లు వ్యతిరేకిస్తున్నా.. టెండర్లు లేకుండా కొనుగోళ్లు చేయడంపై ‘సాక్షి’లో ప్రచురితమైన వరస కథనాలపై ఎండీ స్పందించి వివరణ ఇచ్చారు. సమావేశంలో ఏడీఈ రాజిరెడ్డి ఉన్నారు. -
కరెంట్ కష్టాలకు చెక్
పెద్దూరులో 220 కేవీ సబ్‌స్టేషన్ రూ.7.67 కోట్లతో మరో ఆరు సబ్ స్టేషన్లు ‘సెస్’ పరిధిలో మెరుగైన విద్యుత్ పంపిణీ సిరిసిల్ల: సిరిసిల్ల రెవెన్యూ డివిజన్ ప్రజల కష్టాలు తీరనున్నాయి. లోవోల్టేజీ సమస్యలు దూరంకానున్నాయి. సిరిసిల్ల మండలం పెద్దూరులో రూ.80కోట్లతో 220/132 కేవీ విద్యుత్‌సబ్‌స్టేషన్ పనులు సాగుతున్నాయి. సబ్‌స్టేషన్ నిర్మాణంతో సిరిసిల్ల ప్రాంతంలోని వ్యవసాయం, వస్త్రోత్పతికి లోవోల్టేజీ లేని మెరుగైన విద్యుత్ సరఫరా చేయనున్నారు. చకచకా పనులు సిరిసిల్ల మండలం పెద్దూరులో 220/132 కేవీ సబ్‌స్టేషన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. 2014 ఆగస్టులో ఈ సబ్‌స్టేషన్ నిర్మాణానికి మంత్రి కె.తారకరామారావు శంకుస్థాపన చేశారు. టెండర్లు పూర్తయి పనులు మొదలయ్యేందుకు ఆలస్యమైనా.. ఇప్పుడు మాత్రం చకచకా సాగుతున్నాయి. 220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణంతో సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లోని 132/33 కేవీ సబ్స్టేషన్లకు, 33/11 కేవీ సబ్స్టేషన్లకు మెరుగైన విద్యుత్ అందే అవకాశం ఉంది. విద్యుత్‌గ్రిడ్ నుంచి నేరుగా పెద్దూరుకు కరెంట్ సరఫరా అవుతుంది. మరో ఆరు సబ్ స్టేషన్లు సిరిసిల్ల నియోజకవర్గంలో మరో ఆరు విద్యుత్ సబ్స్టేషన్లు నిర్మాణంలో ఉన్నాయి. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్, కోరుట్లపేట, సిరిసిల్ల మండలం లక్ష్మీపూర్, కస్బెకట్కూర్, ముస్తాబాద్ మండలం మోహినికుంట, గంభీరావుపేట మండలం నాగంపేటల్లో 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లు రూ.7.67 కోట్లతో నిర్మిస్తున్నారు. ఇప్పటికే వీటి పనులు పూర్తయ్యాయి. ఆపరేటర్ల నియామకానికి టెండర్లు పిలిచారు. కాంట్రాక్టు ఒప్పందం పూర్తికాగానే ఈ సబ్స్టేషన్లు వినియోగంలోకి రానున్నాయి. కొత్తగా నిర్మిస్తున్న ఉపకేంద్రాలతో రైతులకు పగటి పూట తొమ్మిది గంటల విద్యుత్ సరఫరాకు, సిరిసిల్ల పట్టణంలో వస్త్రోత్పత్తికి నిరంతర విద్యుత్ పంపిణీ చేయనున్నారు. రెండు గ్రామాలకో సబ్‌స్టేషన్ – కె.నాంపల్లిగుట్ట, ‘సెస్’ మేనేజింగ్ డైరెక్టర్ పెద్దూరులోని 220 కేవీ సబ్‌స్టేషన్ వినియోగంలోకి వస్తే మెరుగైన విద్యుత్ సరఫరాకు అవకాశం లభిస్తుంది. రెండు గ్రామాలకు ఓ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ ప్రతిపాదనలు అడిగారు. ఈ మేరకు నిర్మిస్తే భవిష్యత్‌లో విద్యుత్ సరఫరాలో లోవోల్టేజీ సమస్యలుండవు. వినియోగదారులకు నాణ్యమై విద్యుత్ అందుతుంది. -
‘సెస్’లో ఉద్యోగాల భర్తీకి చర్యలు
సిరిసిల్ల : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్)లో ప్రభుత్వ అనుమతి తీసుకుని ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని సంఘం చైర్మన్ దోర్నాల లక్ష్మారెడ్డి అన్నారు. సెస్ 44వ వార్షిక మహాసభను స్థానిక పద్మశాలి కల్యాణ మండపంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సెస్ పరిధిలో లూజువైర్లను సరిచేసేందుకు మండలానికి 500 విద్యుత్ స్తంభాలు అందించామని, మరో 1500 అందించి సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. 1985 నుంచి ఉద్యోగాలు భర్తీ చేపట్టలేదని, వాటిని భర్తీ చేయాలంటే ప్రభుత్వ అనుమతి కావాలన్నారు. మధ్యమానేరు నిర్వాసితులకు ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంట్ కట్ చేయబోమని, ఊళ్లు ఖాళీ చేసి వెళ్లినపుడే సరఫరా నిలిపివేస్తామని స్పష్టం చేశారు. అక్కపల్లి ఆదర్శం విద్యుత్ చౌర్యం నివారణకు అందరూ సహకరించాలని లక్ష్మారెడ్డి కోరారు. ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లిలో ట్రాన్స్ఫార్మర్ కమిటీలను ఏర్పాటు చేసుకుని అనుమతిలేని మోటార్లకు కనెక్షన్ తొలగించారని వివరించారు. ఇలా చేయడం ద్వారా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం లేదని, మోటార్లకు లోవోల్టేజీ సమస్య ఉండడం లేదని పేర్కొన్నారు. అన్ని గ్రామాల రైతులు అక్కపల్లిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. వినియోగదారులకు మె రుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు పాలకవర్గం కృషి చేస్తోందని, సిబ్బంది అవినీతికి పాల్పడినా.. విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించినా ఫిర్యాదు చేయాలని కోరారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే రవాణా ఖర్చులను రైతులపై వేస్తున్నారని విలేజీ ప్రతి నిధులు సభ దృష్టికి తీసుకొచ్చారు. కొందరు ఉద్యోగులు వివిధ సెక్షన్లలో ఏళ్ల తరబడి పాతుకుపోయారని, అం తర్గత బదిలీలు చేపట్టాలని సభ్యులు కోరారు. రూ.102.42 కోట్ల అంచనా బడ్జెట్‌కు ఆమోదం ‘సెస్’ మేనేజింగ్ డెరైక్టర్ కె.నాంపల్లిగుట్ట వార్షిక నివేదికను చదివి వినిపించారు. 2016-17కు గాను రూ.102.42 కోట్ల అంచనా బడ్జెట్‌ను సమావేశంలో ఆమోదించారు. ఈ స మావేశంలో వైస్ చైర్మన్ లగిశెట్టి శ్రీని వాస్, డెరైక్టర్లు జడల శ్రీనివాస్, ఏను గు విజయరామారావు, వూటుకూరి వెంకటరమణారెడ్డి, కొక్కు దేవేందర్‌యాదవ్, కుంబాల మల్లారెడ్డి, దేవరకొండ తిరుపతి, రామతీర్థపు రాజు, ఏనుగు లక్ష్మీ, ‘సెస్’ అకౌంట్స్ ఆఫీసర్ ఖుర్షీద్ సిబ్బంది పాల్గొన్నారు. -
సెస్‌లో అవినీతి చీకట్లు
► సెస్ పాలకవర్గ తొలి సమావేశం నేడు ► మంత్రి కేటీఆర్‌పైనే ప్రక్షాళన భారం సిరిసిల్ల : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన స హకార సంస్థ. వినియోగదారులకు అందించే సే వలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకున్నా యి. రైతుల భాగస్వామ్యంతో విద్యుత్ పంపిణీ వ్యవస్థ నడుస్తున్న తీరు సహకార స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తోంది. సేవల్లో ఎంతో పేరున్న సెస్‌కు అంతేస్థాయిలో అవినీతి మరకలూ ఉ న్నాయి. ఇటీవలే ఎన్నికైన సెస్ నూతన పాలకవర్గం తొలి సమావేశం శనివారం నిర్వహిస్తుం డగా, రాష్ట్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ హాజరవుతున్న నేపథ్యంలో కథనం. కేంద్ర గ్రామీణ విద్యుదీకరణ సంస్థ(ఆర్ఈసీ)దేశవ్యాప్తంగా ఐదు గ్రామీణ విద్యుత్ స హకార సంఘాలను స్థాపించగా అందులో సిరి సిల్ల ‘సెస్’ ఒకటి. అన్ని సంస్థలు ఉనికి కోల్పో గా సిరిసిల్ల సెస్ మాత్రం ఉత్తమ సేవలతో ముందుకు వెళ్తోంది. 1970 నవంబర్ 1న స్థా పించిన సెస్ పరిధిలో 203 గ్రామాల్లో 2,29,406 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వ్యవసాయంతోపాటు వస్త్రోత్పత్తి రంగం అభివృద్ధికి బా టలు వేసింది. కాంట్రాక్టర్ ప్రమేయం లేకుండా 2007 వరకు విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు, ట్రా న్స్ఫార్మర్ల బిగింపునకు వినియోగదారులే శ్రమదానం చేసేవారు. ప్రస్తుతం కాంట్రాక్టర్ల రా జ్య మే నడుస్తోంది. విద్యుత్ లైన్‌లాస్ 15 శాతం లోపే ఉంటుంది. వినియోగదారులు సైతం క్ర మం తప్పకుండా బిల్లులు చెల్లిస్తారు. అనేక విదే శీ కంపెనీల ప్రతినిధులు సందర్శించి ప్రశంసలు కురిపించారు. అవినీతి జాడలు సెస్ ప్రతిష్టను అవినీతి చేష్టలు దెబ్బతీస్తున్నాయి. గతంలో కొన్ని పాలకవర్గాల నేతలు సంస్థకు నష్టం కలిగిస్తూ తాము లబ్ధి పొందిన వ్యవహారాలు వెలుగుచూశాయి. ఉద్యోగులు, సిబ్బంది సైతం విద్యుత్ సర్వీసుల మంజూరు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటులో అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. డబ్బులిస్తేనే కార్యాలయంలో పనులు అవుతాయనే వాదన ఉంది. క్షేత్రస్థాయి సిబ్బంది మధ్యవర్తులుగా వసూళ్లపర్వం సాగుతున్నట్లు అనేకసార్లు స్పష్టమైంది. ట్రాన్స్ఫార్మర్లు, మీటర్ల కొనుగోళ్లు స్క్రాప్ అమ్మకాల్లో పాలకవర్గాలు, ఉన్నతస్థాయిలు అధికారులు పర్సెంటేజీలు దండుకుంటున్నారనే ఆరోపణలు కోకొల్లలు. రాజీవ్ గ్రామీణ విద్యుదీకరణ పథకంలో కోట్ల విలువైన అవినీతి జరిగిన ఫిర్యాదులున్నాయి. 170 గ్రామీణ ఎలక్ట్రికల్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పనకు ఒక్కొక్కరి వద్ద రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలొచ్చాయి. ఉన్నతాధికారులు ప్రైవేట్ చిట్స్‌కు అవకాశం ఇస్తూ సిబ్బంది జీతాలను నెలనెలా కట్ చేసి ప్రైవేట్ చిట్స్‌కు జమ చేస్తున్నట్లు సమాచారం. సంస్థలోని కీలక అధికారులే చిట్స్‌లో భాగస్వాములుగా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. వేధిస్తున్న సిబ్బంది కొరత సెస్‌ను సిబ్బంది కొరత వేధిస్తోంది. సొంతంగా ఉద్యోగులను నియమించుకునే స్థోమత ఉన్నా ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో కీలక పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. 1998లో 338 మంది సిబ్బంది ఉండగా 2011 నాటికి 123 మంది ఉన్నారు. విలేజీ ఎలక్ట్రికల్ వర్కర్లకు అసిస్టెంట్ హెల్పర్లుగా ప్రమోషన్ ఇవ్వడంతో 261 మంది ఉద్యోగులున్నారు. కీలక పోస్టులన్నీ ఎన్పీడీసీఎల్, ట్రాన్స్‌కో నుంచి డెప్యూటేషన్‌పై వచ్చినవారే ఉండడంతో సంస్థలో అజమాయిషీ కొరవడింది. రాత్రివేళల్లో విద్యుత్ సరఫరా నిలి చిపోతే సిబ్బంది కొరతతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు, విద్యు త్ చౌర్యం అరికట్టే చర్యలు కరువయ్యాయి. సం స్థ సభ్యుల సమగ్ర వివరాలు కరువయ్యాయి. మంత్రి కేటీఆర్‌పైనే ఆశ స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కె.తారకరామారాావుకు సెస్‌పై పూర్తి అవగాహన ఉంది. సంస్థ పనితీరును ఏడేళ్లుగా ఆయన పరిశీలిస్తున్నారు. ఇటీవలి ఎన్నికల్లో వినియోగదారులు టీఆర్ఎస్ మద్దతుదారులకే పట్టం కట్టడంతో పాలకవర్గం సంస్థ పనితీరు మెరుగుపరిచేందుకు ఉపక్రమించాలి. ఏం చేసినా చెల్లుబాటవుతుందనే భావం పోయేలా తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వేములవాడ మండలంలో ఎలాంటి అనుమతి లేకుండా విద్యుత్ లైన్ ఏర్పాటు చేయడాన్ని చైర్మన్ లక్ష్మారెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. రాజకీయంగా ఒత్తిళ్లు వచ్చినా తలొగ్గకుండా బాధ్యులను సస్పెండ్ చేశారు. జరిమానా విధించారు. నీతివంతమైన సమర్థ పాలన అందించాలని మంత్రి కేటీఆర్ పదేపదే చెప్పారు. మంత్రి చొరవతో సంస్థ ఆర్థికంగా బలోపేతమై సిబ్బంది నియామకంతోపాటు వినియోగదారులకు సమర్థ సేవలు అందించేలా నూతన పాలకవర్గం కృషి చేయాల్సిన అవసరముంది. -
3.5 శాతం వరకూ పెరిగిన నిస్సాన్ కార్ల ధరలు
న్యూఢిల్లీ: కార్లపై మౌలిక సెస్ విధింపు కారణంగా పలు కార్ల కంపెనీలు కార్ల ధరలను పెంచుతున్నాయి. తాజాగా నిస్సాన్ మోటార్ ఇండియా కంపెనీ తన అన్ని రకాల మోడళ్లపై ధరలను 3.5% వరకూ పెంచింది. తాము విక్రయిస్తున్న అన్నిరకాల మోడళ్ల ధరలను 1% నుంచి 3.5 శాతం వరకూ పెంచుతున్నామని నిస్సాన్ కంపెనీ తెలిపింది. డాట్సన్ ధరలను 1% వరకూ, టెర్రానో, మిడ్ సైజ్ సెడాన్ సన్నీ ధరలను 3.25% నుంచి 3.5% వరకూ పెంచుతున్నామని పేర్కొంది. ఈ కంపెనీ రూ. 3.23 లక్షల ధర ఉన్న డాట్సన్ గో నుంచి నుంచి రూ.13.20 లక్షల ఖరీదున్న ఎస్యూవీ టెర్రానో వరకూ వివిధ కార్లను విక్రయిస్తోంది. -
సెస్ చెల్లించకుంటే చర్యలు
సాక్షి, కాకినాడ : వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కార్మిక శాఖకు చెల్లించాల్సిన ఒక శాతం సెస్‌కు సంబంధించిన బకాయిలను వెంటనే చెల్లించకపోతే చర్యలు తప్పవని ఆ శాఖ కమిషనర్ బి.రామాంజనేయులు హెచ్చరించారు. వందల కోట్లలో పేరుకుపోయిన బకాయిల వసూళ్లలో ఉదాసీనంగా వ్యవహరించే అధికారులపై కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్నారు. సెస్ వసూలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, అసంఘటిత కార్మికుల సంక్షేమం వంటి అంశాలపై సోమవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. జిల్లాలో బకాయిలు రూ.5 కోట్లకు పైగా పేరుకుపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటిలో ఎక్కువ మున్సిపాలిటీలు, మేజర్ పంచాయతీల నుంచి రావాల్సి ఉందని గుర్తించి సంబంధిత అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. కాకినాడ సీ పోర్ట్స్ వంటి ప్రైవేటు సంస్థలు సెస్ చెల్లింపులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వపరంగా రూ.50 వేలకు పైబడి ఎలాంటి పనులు జరిగినా ఆ మొత్తంలో ఒక శాతం లేబర్‌సెస్ కింద చెల్లించాల్సిందేనన్నారు. రూ.10 లక్షల లోపు అంచనా వ్యయంతో నిర్మించుకునే వ్యక్తిగత గృహాలు, బహుళ అంతస్తుల సముదాయాలకు మాత్రమే మినహాయింపు ఉంటుందన్నారు. గత నెల రోజులుగా నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌తో జిల్లాలో 1100 సంస్థల నుంచి రూ.1.11 కోట్లు వసూలైందన్నారు. 2007 నుంచి శాఖల వారీగా వసూలైన సెస్, బకాయిలు, చెల్లించిన సంస్థలు, చెల్లించనివి వంటి వివరాలతో 15 రోజుల్లో నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. బకాయిలను నెల రోజుల్లోగా వసూలు చేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలో పరిశ్రమల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేటు కళాశాలలు, విద్యాసంస్థలు పెరిగాయని, వాటి నుంచి సెస్ వసూలు చేయాలన్నారు. 5 లక్షల మంది కొబ్బరి కార్మికుల కోసం పైలట్ ప్రాజెక్టు అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని కమిషనర్ చెప్పారు. ప్రతి జిల్లాలో కార్మికభవన్లు నిర్మించడంతో పాటు వర్కర్స్ ఫెసిలిటేషన్ సెంటర్లు, అడ్డా డెవలప్మెంట్ సెంటర్లు, సబ్సిడైజ్డ్ క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. కార్మికుల పిల్లలకు వివాహ సమయంలో ఇచ్చే రూ.5 వేల బహుమతి సొమ్మును రూ.15 వేలకు పెంచామని, కార్మికుల్లో ఎవరైనా చనిపోయినప్పుడు అంత్యక్రియల ఖర్చులకు ఇచ్చే రూ.5 వేలను రూ.10 వేలకు పెంచామని చెప్పారు. కార్మికుల పిల్లల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు స్కిల్ డెవలప్మెంట్ మిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అసంఘటిత కార్మిక చట్టం కింద కోనసీమలో 5 లక్షలమంది కొబ్బరి కార్మికులకు లబ్ధి చేకూరే పైల ట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నట్టు తె లిపారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు పైల ట్ ప్రాజెక్టుగా జిల్లాలో ఐదు మండలాలను ఎంపిక చేసుకొని 2015 కల్లా బాలకార్మికులు లేనివిగా ప్రకటించేందుకు జిల్లా అధికారులు కృషి చేయాలని కోరారు. కార్మికశాఖ జాయింట్ కమిషనర్ వరహాలరెడ్డి, డిప్యూటీ కమిషనర్ కృష్ణారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ప్రకాశరావు, జెడ్పీ సీఈఓ సూర్యభగవాన్, డీపీఓ శ్రీధర్‌రెడ్డి, డీఈఓ శ్రీనివాసులురెడ్డి, ఐసీడీఎస్ పీడీ నిర్మల పాల్గొన్నారు. -
స్వర్గమా.. సెస్‌కు నరకమా!
- గతమంతా అవినీతిమయం - ఆయనకే మళ్లీ ఎండీ పోస్టింగ్ - రూ.3.08 కోట్ల అవినీతికి జేజేలు - విచారణ నివేదిక తుంగలో తొక్కారా? - విజిలెన్స్ విచారణ ఫైలు ఎక్కడాగింది? - హాట్ టాపిక్‌గా మారిన రంగారావు నియామకం సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అయిదేళ్ల కిందట ఆయన హయాంలోనే భారీగా అవినీతి జరిగింది. సిరిసిల్ల సహకార విద్యుత్తు సరఫరా సొసైటీ లిమిటెడ్‌లో (సెస్)లో కనీసం రూ.3 కోట్ల సొమ్ము దుర్వినియోగమైంది. స్వయానా ఎన్పీడీసీఎల్ అధికారుల ప్రాథమిక విచారణలో ఈ అవినీతి స్వరూపం బట్టబయలైంది. ఆ విచారణ సైతం తూతూమంత్రంగానే సాగిందని... లోతుపాతులు తవ్వితే మరిన్ని లొసుగులు వెలికి వస్తాయని అప్పటి జిల్లా జాయింట్ కలెక్టర్ అరుణ్‌కుమార్ ఈ వ్యవహారాన్ని విజిలెన్స్ విచారణకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రాష్ట్ర సహకార శాఖ కమిషనర్, సహకార సంఘాల రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. జేసీ రాసిన లేఖను పరిశీలించి సమగ్ర నివేదికను సమర్పించాలని స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఐవీఆర్ కృష్ణారావు గత ఏడాది మే 25న రిజిస్ట్రార్ అండ్ కమిషనర్‌కు రిమైండర్ రాశారు. కానీ.. ఇప్పటికీ ఈ ఫైలు ముందుకు కదల్లేదు. దీంతో విజిలెన్స్ విచారణ ప్రారంభం కాకముందే కొండెక్కినట్లయింది. సిరిసిల్ల సెస్ కేంద్రంగా జరిగిన అవినీతి తుట్టెను కదిపితే.. ఎవరికి చుట్టుకుంటుందోననే భయంతో కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఈ ఫైలును తొక్కిపెట్టినట్లు ప్రచారం జరిగింది. ఇదంతా జరిగి ఏడాది కూడా పూర్తి కాలేదు. తెలంగాణ తొలి ప్రభుత్వం కొలువుదీరగానే అనుచిత నిర్ణయం వెలువడింది. అప్పట్లో ఎవరి హయాంలో అవినీతి జరిగిందనే ఆరోపణలు... అభియోగాలున్నాయో.. ఆయననే మరోసారి సెస్ మేనేజింగ్ డెరైక్టర్‌గా నియమించింది. సిరిసిల్ల సెస్ ఎండీగా స్వర్గం రంగారావును నియమిస్తూ రెండు రోజుల కిందట ఎన్పీడీసీఎల్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. 2007 జూలై నుంచి 2010 మే వరకు ఆయన సెస్ ఎండీగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన హయాంలోనే భారీగా అవినీతి, అవకతవకల దుమారం చెలరేగింది. 2007-2010 మధ్య కాలంలో ఇంప్రూవ్మెంట్ వర్క్స్ పేరిట జరిగిన పనుల్లో భారీగా నిధులు దుర్వినియోగమయ్యాయి. సిరిసిల్ల సెస్ పరిధిలో తొమ్మిది మండలాలున్నాయి. దాదాపు 300 గ్రామాలకు విద్యుత్తు సరఫరా చేసే సహకార సంఘంగా దేశంలోనే సిరిసిల్ల సెస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. నీటిపారుదల సదుపాయం లేని మెట్ట ప్రాంతంలో ఉన్న మండలాలకు విద్యుత్తు సరఫరా చేసేందుకు ఢిల్లీలోని ఆర్ఈసీ ఆర్థిక సహకారంతో 43 ఏళ్ల కిందట సెస్ ఏర్పడింది. 2007-10 మధ్య కాలంలో భారీ మొత్తంలో నిధులు దుర్వినియోగం అయినట్లు ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఈ వ్యవహారంపై జిల్లా జాయింట్ కలెక్టర్ సూచనల మేరకు ఎన్పీడీసీఎల్ విచారణ కమిటీని నియమించింది. అప్పటి చీఫ్ ఇంజనీర్ కె.కృష్ణయ్యను విచారణ అధికారిగా నియమించారు. వరుసగా మూడేళ్ల వ్యవధిలో జరిగిన అవకతవకలు, అందుకు బాధ్యులైన ఉద్యోగులు, అధికారులపై సమగ్ర నివేదికను అందించాలని ఆదేశించింది. ఈ విచారణ కమిటీ మొత్తం రూ 3.08 కోట్ల అవినీతి జరిగినట్లు ధ్రువీకరించింది. జరిగిన అవకతవకలను ఉటంకించటంతో పాటు బాధ్యులైన ఉద్యోగులు, అధికారుల వివరాలను సైతం వేలెత్తి చూపింది. వరుసగా మూడేళ్ల వ్యవధిలో సెస్ పరిధిలో ఇంప్రూవ్మెంట్, డిపాజిట్ కంట్రిబ్యూషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, మైనర్ ఎక్స్టెన్షన్ విభాగాలుగా మొత్తం 3207 పనులు జరిగాయి. అందులో కేవలం 1837 పనులను విచారణ కమిటీ తనిఖీ చేసింది. మిగతా 1370 పనులను సెస్ అధికారులు రికార్డులు సమర్పించకపోవటంతో తనిఖీ చేయలేకపోయినట్లు విచారణ నివేదికలో పేర్కొంది. ఇంప్రూవ్మెంట్ వర్క్స్‌లోనే భారీగా దుర్వినియోగం జరిగింది. అగ్రిమెంట్లు చేసుకోకుండానే ఏడీఈ, డీఈలు కాంట్రాక్టర్లతో పనులు చేయించి ఏకంగా బిల్లులు చెల్లించినట్లు నిర్ధారించింది. కేవలం 89 పనులకు సంబంధించిన బిల్లులను కమిటీ పరిశీలించింది. అందుకు సంబంధించి కాంట్రాక్టర్లకు రూ.3.16 లక్షలు చెల్లించాల్సి ఉండగా రూ.7.56 లక్షలు అదనంగా చెల్లింపులు జరిగినట్లు బయటపడింది. సెక్షన్ ఆఫీసర్లు స్టోర్ నుంచి తీసుకున్న మెటీరియల్‌లో కొంత మొత్తం వినియోగించి, మిగతాదంతా పక్కదారి పట్టించినట్లు వేలెత్తి చూపింది. పనులు పూర్తి కాకుండానే.. కనీసం వర్క్ ఆర్డర్లు, అగ్రిమెంట్లు లేకుండానే కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు జరగటంతో సెస్‌కు భారీ మొత్తం గండి పడింది. పలువురు ఏడీఈ, డీఈలతో పాటు ఏఏఓ, ఏఓలు, సెక్షన్ ఆఫీసర్లకు ఇందులో ప్రమేయముందని, అప్పటి ఎండీ రంగారావు పర్యవేక్షణ లోపం ఉందని విచారణ కమిటీ నిగ్గు తేల్చింది. మరింత లోతుగా విచారణ జరిపేందుకు ఈ కేసును విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు అప్పగించాలని అప్పట్లో సెస్‌కు పర్సన్ ఇన్చార్జిగా ఉన్న జిల్లా జాయింట్ కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇంత జరిగినా అప్పటి బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు, దుర్వినియోగమైన నిధుల రికవరీకి ఉన్నతాధికారులు వెనుకంజ వేయటం అనుమానాలకు తావిస్తోంది. ఈలోగా విచారణ పేరుతోమరో రూ.10 లక్షలకు పైగా సెస్ ఖజానాకు గండి పడింది. ఇదేమీ పట్టించుకోకుండా అవినీతి హయాంగా ముద్రవేసుకున్న అధికారికే మరోసారి సెస్ ఎండీగా బాధ్యతలు అప్పగించటం చర్చనీయాంశంగా మారింది. దీంతో సెస్‌లో జరిగిన అవినీతికి ఉన్నత స్థాయిలోనే లింక్లున్నాయా.. అప్పటి అవినీతి ఫైళ్లను తొక్కిపెట్టేందుకు కొత్తగా మళ్లీ పాత ఎండీని రంగంలోకి దింపారా.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్వయానా ముఖ్యమంత్రి కుమారుడు మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో నామినేటేడ్ పదవులతో ముడిపడి ఉన్న సహకార సంఘం కావటంతో సెస్ ఎండీ నియామకం అందరి నోటా హాట్ టాపిక్‌గా మారింది.