సెస్‌లో అవినీతి చీకట్లు
► సెస్ పాలకవర్గ తొలి సమావేశం నేడు
► మంత్రి కేటీఆర్‌పైనే ప్రక్షాళన భారం
సిరిసిల్ల : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన స హకార సంస్థ. వినియోగదారులకు అందించే సే వలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకున్నా యి. రైతుల భాగస్వామ్యంతో విద్యుత్ పంపిణీ వ్యవస్థ నడుస్తున్న తీరు సహకార స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తోంది. సేవల్లో ఎంతో పేరున్న సెస్‌కు అంతేస్థాయిలో అవినీతి మరకలూ ఉ న్నాయి. ఇటీవలే ఎన్నికైన సెస్ నూతన పాలకవర్గం తొలి సమావేశం శనివారం నిర్వహిస్తుం డగా, రాష్ట్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ హాజరవుతున్న నేపథ్యంలో కథనం.
కేంద్ర గ్రామీణ విద్యుదీకరణ సంస్థ(ఆర్‌ఈసీ)దేశవ్యాప్తంగా ఐదు గ్రామీణ విద్యుత్ స హకార సంఘాలను స్థాపించగా అందులో సిరి సిల్ల ‘సెస్’ ఒకటి. అన్ని సంస్థలు ఉనికి కోల్పో గా సిరిసిల్ల సెస్ మాత్రం ఉత్తమ సేవలతో ముందుకు వెళ్తోంది. 1970 నవంబర్ 1న స్థా పించిన సెస్ పరిధిలో 203 గ్రామాల్లో 2,29,406 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వ్యవసాయంతోపాటు వస్త్రోత్పత్తి రంగం అభివృద్ధికి బా టలు వేసింది. కాంట్రాక్టర్ ప్రమేయం లేకుండా 2007 వరకు విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు, ట్రా న్స్‌ఫార్మర్ల బిగింపునకు వినియోగదారులే శ్రమదానం చేసేవారు. ప్రస్తుతం కాంట్రాక్టర్ల రా జ్య మే నడుస్తోంది. విద్యుత్ లైన్‌లాస్ 15 శాతం లోపే ఉంటుంది. వినియోగదారులు సైతం క్ర మం తప్పకుండా బిల్లులు చెల్లిస్తారు. అనేక విదే శీ కంపెనీల ప్రతినిధులు సందర్శించి ప్రశంసలు కురిపించారు.
అవినీతి జాడలు
సెస్ ప్రతిష్టను అవినీతి చేష్టలు దెబ్బతీస్తున్నాయి. గతంలో కొన్ని పాలకవర్గాల నేతలు సంస్థకు నష్టం కలిగిస్తూ తాము లబ్ధి పొందిన వ్యవహారాలు వెలుగుచూశాయి. ఉద్యోగులు, సిబ్బంది సైతం విద్యుత్ సర్వీసుల మంజూరు, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటులో అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. డబ్బులిస్తేనే కార్యాలయంలో పనులు అవుతాయనే వాదన ఉంది. క్షేత్రస్థాయి సిబ్బంది మధ్యవర్తులుగా వసూళ్లపర్వం సాగుతున్నట్లు అనేకసార్లు స్పష్టమైంది. ట్రాన్స్‌ఫార్మర్లు, మీటర్ల కొనుగోళ్లు స్క్రాప్ అమ్మకాల్లో పాలకవర్గాలు, ఉన్నతస్థాయిలు అధికారులు పర్సెంటేజీలు దండుకుంటున్నారనే ఆరోపణలు కోకొల్లలు.
రాజీవ్ గ్రామీణ విద్యుదీకరణ పథకంలో కోట్ల విలువైన అవినీతి జరిగిన ఫిర్యాదులున్నాయి. 170 గ్రామీణ ఎలక్ట్రికల్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పనకు ఒక్కొక్కరి వద్ద రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలొచ్చాయి. ఉన్నతాధికారులు ప్రైవేట్ చిట్స్‌కు అవకాశం ఇస్తూ సిబ్బంది జీతాలను నెలనెలా కట్ చేసి ప్రైవేట్ చిట్స్‌కు జమ చేస్తున్నట్లు సమాచారం. సంస్థలోని కీలక అధికారులే చిట్స్‌లో భాగస్వాములుగా ఉన్నట్లు ఆరోపణలున్నాయి.
వేధిస్తున్న సిబ్బంది కొరత
సెస్‌ను సిబ్బంది కొరత వేధిస్తోంది. సొంతంగా ఉద్యోగులను నియమించుకునే స్థోమత ఉన్నా ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో కీలక పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. 1998లో 338 మంది సిబ్బంది ఉండగా 2011 నాటికి 123 మంది ఉన్నారు. విలేజీ ఎలక్ట్రికల్ వర్కర్లకు అసిస్టెంట్ హెల్పర్లుగా ప్రమోషన్ ఇవ్వడంతో 261 మంది ఉద్యోగులున్నారు.
కీలక పోస్టులన్నీ ఎన్పీడీసీఎల్, ట్రాన్స్‌కో నుంచి డెప్యూటేషన్‌పై వచ్చినవారే ఉండడంతో సంస్థలో అజమాయిషీ కొరవడింది. రాత్రివేళల్లో విద్యుత్ సరఫరా నిలి చిపోతే సిబ్బంది కొరతతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు, విద్యు త్ చౌర్యం అరికట్టే చర్యలు కరువయ్యాయి. సం స్థ సభ్యుల సమగ్ర వివరాలు కరువయ్యాయి.
మంత్రి కేటీఆర్‌పైనే ఆశ
స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కె.తారకరామారాావుకు సెస్‌పై పూర్తి అవగాహన ఉంది. సంస్థ పనితీరును ఏడేళ్లుగా ఆయన పరిశీలిస్తున్నారు. ఇటీవలి ఎన్నికల్లో వినియోగదారులు టీఆర్‌ఎస్ మద్దతుదారులకే పట్టం కట్టడంతో పాలకవర్గం సంస్థ పనితీరు మెరుగుపరిచేందుకు ఉపక్రమించాలి. ఏం చేసినా చెల్లుబాటవుతుందనే భావం పోయేలా తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వేములవాడ మండలంలో ఎలాంటి అనుమతి లేకుండా విద్యుత్ లైన్ ఏర్పాటు చేయడాన్ని చైర్మన్ లక్ష్మారెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. రాజకీయంగా ఒత్తిళ్లు వచ్చినా తలొగ్గకుండా బాధ్యులను సస్పెండ్ చేశారు. జరిమానా విధించారు. నీతివంతమైన సమర్థ పాలన అందించాలని మంత్రి కేటీఆర్ పదేపదే చెప్పారు. మంత్రి చొరవతో సంస్థ ఆర్థికంగా బలోపేతమై సిబ్బంది నియామకంతోపాటు వినియోగదారులకు సమర్థ సేవలు అందించేలా నూతన పాలకవర్గం కృషి చేయాల్సిన అవసరముంది.