డ్రైవర్ లెస్ కారులో ఇక సేఫ్ గా వెళ్లొచ్చు..
టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ఆవిష్కరించిన డ్రైవర్ లెస్ కారుతో ఇక ప్రమాద రహిత ప్రయాణం చేయొచ్చునట. లేటెస్ట్ టెక్నాలజీతో తయారు చేసిన కార్లతో అనేక ప్రమాదాలు చోటు చేసుకోవడంతో నిర్వాహకులు మరిన్ని అధ్యయనాల అనంతరం ఇప్పుడు సురక్షితమైన కార్లను రూపొందించారు. పాదచారులు ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వ్యక్తి.. కారుకు దగ్గరకు వస్తే పసిగట్టి సెన్సర్లు పనిచేయడంతో కారు... దానంతట అదే తప్పించుకొని వెళ్ళే అవకాశం ఉందని నిర్వాహకులు చెప్తున్నారు.
సుమారు లక్ష మైళ్ళ దూరం ఎటువంటి ప్రమాదాలు జరగకుండా సురక్షితంగా టెస్టింగ్ దశ పూర్తయిన అనంతరం ఆ సంస్...థ కార్ల తయారీలో మరింత సురక్షితంగా ఉండే డ్రైవర్ లెస్ కార్లను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు ప్రారంభించింది. కారుకు ఏర్పాటు చేసిన స్పీకర్ సిస్టం, స్క్రీన్లు డ్రైవర్ అవసరం లేకుండానే రోడ్డు మీద సురక్షితంగా వెళ్ళే అవకాశం ఉందని పేటెంట్ వివరాలు వెల్లడిస్తున్నాయి.
ఈ నూతన ఆవిష్కారంలోని కారు డోర్లు, స్క్రీన్లు పాదచారులకు సెన్సర్ల ఆధారంగా 'స్టాప్', 'సేఫ్ క్రాస్' వంటి ట్రాఫిక్ సిగ్నల్స్ ను తెలుపుతూ హెచ్చరికలు జారీ చేస్తాయి. వాహనంలోని కంప్యూటర్లు పాదచారులు వెళ్ళాల్సిన మార్గాన్ని నిర్దేశిస్తాయి. ఇద్దరికి మాత్రమే సీటు ఉండే ఈ కారు... కేవలం స్మార్ట్ ఫోన్ ద్వారా గ్యారేజ్ కు మెసేజ్ పంపిస్తే చాలు నడవడం ప్రారంభమౌతుంది.
అయితే ఈ కొత్త కారు సిస్టమ్ కు సంబంధించి ఎటువంటి స్కెచ్ ను గూగుల్ ప్రస్తుతానికి విడుదల చేయలేదు. కానీ గత నెల్లో నిస్సాన్ విడుదల చేసిన సిస్టమ్ కు ఇంచుమించు దగ్గరగా ఇది ఉండే అవకాశం ఉంది. నిస్సాన్ విడుదల చేసిన డ్రైవర్ లెస్ కారు టీట్రో ఫర్ డేజ్ ను... వెహికిల్ ఫర్ ది డిజిటల్ నేటివ్ గా సామాజిక మీడియా అభివర్ణించింది. ఈ తెల్లని కారు ఇప్పుడు సవరణల అనంతరం క్లీన్ కాన్వాస్ గా రూపొందించబడింది.