Patent
-
కొవాగ్జిన్ పేటెంట్‌కు సహ యజమానిగా ఐసీఎంఆర్
హైదరాబాద్‌కు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్) తమ కోవిడ్ వ్యాక్సిన్ కొవాగ్జిన్ పేటెంట్‌కు సహ యజమానిగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)ను చేర్చినట్లు తెలిపింది.భారత్ బయోటెక్ తమ కొవాగ్జిన్ ఒరిజినల్ పేటెంట్ ఫైలింగ్‌లో ఐసీఎంఆర్‌ను చేర్చకపోవడం వివాదానికి దారితీసింది. అయితే ఈ తప్పిదం అనుకోకుండా జరిగిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. బీబీఐఎల్-ఐసీఎంఆర్ అగ్రిమెంట్ కాపీ గోప్యమైన డాక్యుమెంట్ కావడంతో అందుబాటులో లేదని, దీంతో ఐసీఎంఆర్‌ను ఒరిజినల్ అప్లికేషన్ లో చేర్చలేదని వివరణ ఇచ్చింది.ఈ తప్పిదం ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని, ఐసీఎంఆర్ పట్ల తమకు ఎంతో గౌరవం ఉందని, వివిధ ప్రాజెక్టులపై నిరంతరం సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని భారత్ బయోటెక్ తెలిపింది. ఈ పొరపాటును గుర్తించిన వెంటనే, కోవిడ్ -19 వ్యాక్సిన్ కోసం పేటెంట్ దరఖాస్తులకు సహ యజమానిగా ఐసీఎంఆర్‌ను చేర్చడం ద్వారా దానిని సరిదిద్దే ప్రక్రియను బీబీఐఎల్ ఇప్పటికే ప్రారంభించింది. అవసరమైన లీగల్ డాక్యుమెంట్లను సిద్ధం చేస్తున్నామని, అవి సిద్ధమై సంతకం చేసిన వెంటనే పేటెంట్ కార్యాలయంలో దాఖలు చేస్తామని కంపెనీ పేర్కొంది.ఐసీఎంఆర్ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రముఖ వైద్య పరిశోధనా సంస్థ. పుణెలోని ఐసీఎంఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, భారత్ బయోటెక్ సంయుక్తంగా 2020 ఏప్రిల్‌లో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) తర్వాత కొవాగ్జిన్‌ను అభివృద్ధి చేశాయి. -
లక్ష పేటెంట్లు మంజూరు.. అధికంగా ఎందులో తెలుసా..
గతేడాదిలో సుమారు లక్ష పేటెంట్లను మంజూరు చేసినట్లు భారతీయ పేటెంట్ కార్యాలయం తెలిపింది. ప్రధానంగా జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) రిజిస్ట్రేషన్లలో చెప్పుకోదగ్గ పెరుగుదల ఉందని, గత ఏడాదితో పోలిస్తే మూడు రెట్లు పెరిగాయని పేర్కొంది. ఈమేరకు తాజాగా వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. భారత్‌లో ప్రతి 6 నిమిషాలకు ఒక టెక్నాలజీ ఐపీ రైట్స్కోసం నమోదవుతున్నట్లు ప్రకటనలో పాలిపారు. 2022-23లో అత్యధికంగా 90,300 పేటెంట్ దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (15-మార్చి-2023 నుంచి 14-మార్చి 2024 వరకు) లక్షకు పైగా పేటెంట్లను మంజూరు చేశారు. ప్రతిరోజు 250 పేటెంట్లు మంజూరు చేసినట్లు తెలిసింది. 2013–14లో కేవలం 6 వేల పేటెంట్లు మాత్రమే ఇష్యూ అయినట్లు ప్రకటనలో తెలిపారు. ఇదీ చదవండి: 2003-07 నాటి వృద్ధిరేటు దిశగా భారత జీడీపీ ఈ సంఖ్య లక్షకు పెరగడం పట్ల వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ హర్షం వ్యక్తం చేసింది. విభిన్న అంశాలపై పరిశోధనలు చేస్తున్న ఆచార్యులు, సృజనాత్మకమైన ఆలోచనలతో కొత్త పరికరాలు, యంత్రాలను కనిపెడుతున్న వారు పేటెంట్ల కోసం దరఖాస్తు చేసుకుంటారు. -
ఆంధ్రా షుగర్స్‌కు షుగర్ కేన్ హార్వెస్టింగ్ మెషీన్ పేటెంట్
తణుకు: పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని ఆంధ్రా షుగర్స్ సంస్థ జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. ఆంధ్రా షుగర్స్ సంస్థ హార్వెస్టింగ్ మెషీన్ పేరుతో చేసిన ఆవిష్కరణకు 20 సంవత్సరాల కాలవ్యవధికి గాను షుగర్ కేన్ పేటెంట్ వ చ్చింది. ఈ మేరకు భారత ప్రభుత్వ పేటెంట్ కార్యాలయం ఈ నెల 26న పేటెంట్ సరి్టఫికెట్ జారీ చేసింది. సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ముళ్లపూడి నరేంద్రనా«థ్ మార్గదర్శకత్వంలో సంస్థకు చెందిన షుగర్ కేన్ హార్వెస్టర్ డెవలప్మెంట్ టీమ్ దీన్ని నిర్మించడానికి, ఉపయోగించడానికి పదేళ్లుగా అంకిత భావంతో కృషి చేస్తోంది. భారతీయ వ్యవసాయ పరిస్థితులకు అనువైన చెరకు హార్వెస్టర్ ఆవిష్కరణకు పేటెంట్ మంజూరు అయిన దేశంలోనే మొట్టమొదటి సంస్థ ఆంధ్రా షుగర్స్ కావడం విశేషం. -
యాపిల్ దిమ్మతిరిగే టెక్నాలజీ.. మడత ఐఫోన్లు కింద పడినా ఏమీ కావు!
ప్రీమియం ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ దిగ్గజం యాపిల్ దిమ్మతిరిగే సరికొత్త టెక్నాలజీని తీసుకొస్తోంది. ఈ టెక్నాలజీ ఐఫోన్లు, ఐపాడ్లు కింద పడినా ఏమీ కాకుండా రక్షిస్తుంది. ఫోన్లు కింద పడే సందర్భంలో వీటికున్న సెన్సర్లు వెంటనే గ్రహించి వాటి ఫ్లెక్సిబుల్ స్క్రీన్లు మడతపడేలా చేస్తాయి. దీంతో ఫోన్ కింద పడినా స్క్రీన్లకు ఎటువంటి దెబ్బా తగలదు. ఇదీ చదవండి: పెళ్లి ఖర్చులకు డబ్బు కావాలా? ఈపీఎఫ్ నుంచి ఇలా తీసుకోండి.. ‘సెల్ఫ్-రిట్రాక్టింగ్ డిస్ప్లే డివైస్ అండ్ టెక్నిక్స్ ఫర్ ప్రొటెక్టింగ్ స్క్రీన్ యూజింగ్ డ్రాప్ డిటెక్షన్’ పేరుతో అభివృద్ధి చేస్తున్న ఈ కొత్త టెక్నాలజీపై యాపిల్ సంస్థ పేటెంట్ కోసం దరఖాస్తు చేసినట్లు తెలిసింది. ఈ టెక్నాలజీ ఎలా పనిచేసేదీ కంపెనీ పేటెంట్ దరఖాస్తులో పేర్కొంది. ఇదీ చదవండి: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనానికి ఎన్సీఎల్టీ ఆమోదం.. ఇక ఇదే మూడో అతిపెద్ద బ్యాంక్! ఈ టెక్నాలజీలో ఫోల్డబుల్, రోలబుల్ డిస్ప్లేలు కలిగిన మొబైల్ ఫోన్లు కింద పడిపోతున్నప్పుడు గుర్తించేందుకు సెన్సార్ ఉంటుందని తెలుస్తోంది. ఫోన్ కింద పడుతున్నట్లు సెన్సార్ గుర్తించిన వెంటనే అది నేలను తాకే లోపు సున్నితమైన డిస్ప్లే నేలకు తగలకుండా ముడుచుకునిపోతుందని కంపెనీ పేర్కొంది. ఇలా ముడుచుకునే క్రమంలో ఫోన్లోని రెండు స్క్రీన్లకు మధ్య కోణం తగ్గిపోతుంది. దీని వల్ల ఆ స్క్రీన్లకు దాదాపుగా దెబ్బ తాకే అవకాశం ఉండదు. ఇదీ చదవండి: సుందర్ పిచాయ్.. మాకు న్యాయం చేయండి.. తొలగించిన ఉద్యోగుల బహిరంగ లేఖ -
పోటాపోటీగా పేటెంట్లు.. రాయితీలతో కేంద్రం వెన్నుదన్ను
సాక్షి, అమరావతి : కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని జాతీయ ఉన్నత విద్యాసంస్థలతో పాటు ప్రైవేటు యూనివర్సిటీలు, విద్యాసంస్థలు పేటెంట్ల విషయంలో పోటీపడుతున్నాయి. వీటిల్లో పరిశోధనా కార్యక్రమాలను మరింత పగడ్బందీగా కొనసాగిస్తుండడంతో కొత్త ఆవిష్కరణలతో స్వయం సమృద్ధికి వీలుగా మేథో సంపత్తి హక్కుల (ఇంటెలెక్యువల్ ప్రాపర్టీ రైట్స్) సాధనలో పురోగతి సాధిస్తున్నాయి. కేంద్రం కూడా ఈ ఉన్నత విద్యా సంస్థల్లో చేపట్టే ఆవిష్కరణలకు పేటెంట్లు కల్పించడంలో 80 శాతం ఫీజు రాయితీలు ఇవ్వడం కూడా నూతన ఆవిష్కరణలకు కారణమవుతున్నాయి. ఫలితంగా ఈ సంస్థలలో పేటెంట్ల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. నిజానికి.. ఏదైనా సంస్థ పేటెంట్ దాఖలు చేయాలంటే ముందుగా రూ.20వేల ఖర్చుపెట్టాలి. ఆ తరువాత వాటి పరిశీలన తదితర ప్రక్రియలలో మరికొంత మొత్తాన్ని ఛార్జీలుగా చెల్లించాలి. దీనికి అదనంగా.. పేటెంట్ చేసే వ్యక్తి 20 ఏళ్లపాటు దాని నిర్వహణ రుసుమును కూడా జమచేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఇప్పటివరకు ఉన్నత విద్యాసంస్థల్లో పేటెంట్లపై ఆసక్తి కనబర్చలేదు. అయితే, కేంద్ర ప్రభుత్వం పరిశోధన, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా చట్టాన్ని సవరించి 80 శాతం రాయితీలను ప్రకటించడంతో క్రమేణా పేటెంట్లు పెరిగేందుకు ఆస్కారమేర్పడుతోంది. నూతన జాతీయ విద్యావిధానం–2020లో కూడా ఉన్నత విద్యా సంస్థల్లో నూతన ఆవిష్కరణలకు పెద్దపీట వేయాలని.. వాటి ద్వారా ఆయా సంస్థలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రణాళికలు అమలుచేయాలని సూచించింది. సమగ్ర పరిశోధనలతో నూతన ఆవిష్కరణలు చేసే వారికి ఆర్థిక సహకారం కూడా అందించేలా మార్గనిర్దేశం చేసింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏటా అధ్యాపకులు, పరిశోధక అభ్యర్థులకు నిధులు కూడా ఇస్తోంది. ఇలా ఏటా 10వేల పేటెంట్ల లక్ష్యంగా ఈ ప్రోత్సాహకాలను అందిస్తోంది. పేటెంట్ల వాణిజ్యీకరణను ప్రోత్సహించడం ద్వారా ప్రపంచ పేటెంట్ ర్యాంకింగ్స్‌లో స్థానాన్ని మెరుగుపర్చుకునేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఏయూలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు ఈ పేటెంట్లను ప్రోత్సహించడానికి రాష్ట్రంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం తన క్యాంపస్‌లో మేథో సంపత్తి హక్కుల కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. ఈ కేంద్రం డాక్యుమెంటేషన్ ప్రక్రియను పర్యవే„ìక్షించడంతో పాటు దాఖలుకు అయ్యే ఖర్చును కూడా భరిస్తోంది. అనేక విద్యాసంస్థల విద్యార్థులు తమ మెంటార్ల మార్గదర్శకత్వంలో వినూత్న ప్రాజెక్టుల పేటెంట్ల దాఖలుకు ఇప్పుడిప్పుడే ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు.. 2020–21లో విద్యాసంస్థలు, ఇతర పరిశోధనా సంస్థలు అందించిన పేటెంట్ దరఖాస్తులు 58,503గా ఉన్నాయి. అందులో ప్రధానంగా మహారాష్ట్ర 4,214, తమిళనాడు 3,945, కర్ణాటక 2,784, యూపీ 2,317, తెలంగాణ 1,662, పంజాబ్ 1,650, ఢిల్లీ 1,608, గుజరాత్ 921, హర్యానా 765, ఆంధ్రప్రదేశ్ 709, పశ్చిమ బెంగాల్ 505 రాజస్థాన్ 449, కేరళ 426, మధ్యప్రదేశ్ 398, ఒడిశా 144, పాండిచ్చేరి నుంచి 139 దరఖాస్తులు వచ్చాయి. పేటెంట్లలో ముందున్నవి ఇవే.. ఇక కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ వంటి పరిశోధనా సంస్థలు అత్యధిక సంఖ్యలో పేటెంట్లను దాఖలు చేయడంలో ముందున్నాయి. కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్, ట్రేడ్‌మార్క్ (సీజీపీడీటీఎం) నివేదిక ప్రకారం 2019–2020లో టాప్–10 విద్యాసంస్థలు అందించిన పేటెంట్ల సంఖ్య 2,533 కాగా.. 2020–21లో ఆ సంఖ్య 3,103కి పెరిగింది. 2019–20లో ఐఐటీలు 664 పేటెంట్లను దాఖలు చేశాయి. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, చండీగఢ్ వర్సిటీ వంటి ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు తక్కిన పేటెంట్లకు దరఖాస్తు చేశాయి. అలాగే, 2020–21లో ఐఐటీలు 640 పేటెంట్లు ప్రకటించగా తక్కిన సంస్థల్లో అవి మరింత మెరుగుపడ్డాయి. ఈ వర్సిటీల్లో టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్లను ఏర్పాటుచేసి ఈ పేటెంట్లను దాఖలు చేశాయి. ఇదీ చదవండి: AP: ఫ్యామిలీ డాక్టర్.. సరికొత్త ‘జీవన శైలి’ -
హైడ్రోజన్ కారుకు పేటెంట్.. మిర్యాలగూడ వాసి ఘనత
మిర్యాలగూడ: పెట్రోల్, డీజిల్ కారుకు నీటిలోని హైడ్రోజన్ సాయంతో మైలేజీ పెంచేలా తాను రూపొందించిన యంత్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పేటెంట్ లభించినట్లు బీఎస్ఎన్ఎల్రిటైర్డ్ ఉద్యోగి కాశీనాథుని పూర్ణమల్లికార్జున్‌రావు తెలిపారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఆదివారం ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ఏడేళ్లు శ్రమించి నీటినుంచి హైడ్రోజన్‌ను వేరు చేసి కారు ఇంజన్‌కు అందించే సాంకేతికతను అభివృద్ధి చేశానన్నారు. 2021, జూన్ 6న కేంద్ర ప్రభుత్వ పేటెంట్ సంస్థకు దరఖాస్తు చేయగా పలు దశల్లో ఇంజనీర్లు పరిశీలించి ఈ నెల 27న పేటెంట్ పత్రం మంజూరు చేశారని చెప్పారు. యంత్రం పనితీరు ఇలా.. డీజిల్, పెట్రోల్ కార్లకు రూ.10 వేల వ్యయంతో నీటి నుంచి హైడ్రోజన్‌ను వేరుచేసే యంత్రాన్ని అమర్చి ఇంజన్‌కు అనుసంధానిస్తారు. కారు ఆన్ చేయగానే ఆటోమేటిక్‌గా ఈ యంత్రం పనిచేయడం ప్రారంభమవుతుంది. యంత్రం నీటి ట్యాంకులోని హైడ్రోజన్‌ను వేరు చేస్తుంది. అది ఇంజిన్లోకి వెళ్లి కారు ముందుకు వెళ్లేందుకు సాయం చేస్తుంది. దీంతో డీజిల్, పెట్రోల్ కార్లకు అదనంగా 10 కి.మీ. మైలేజీ పెరుగుతుంది. తన కారుకు యంత్రాన్ని అమర్చి ఏడాదికిపైగా పరిశీలిస్తున్నట్లు పూర్ణమల్లికార్జున్‌రావు తెలిపారు. పెరిగిపోతున్న ఇంధన ఖర్చులు తగ్గించుకునేందుకు ఈ యంత్రం ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వం మందుకొస్తే తన ప్రాజెక్టును అందిస్తానన్నారు. -
11 ఏళ్లలో తొలిసారిగా రికార్డు సృష్టించిన భారత్..!
న్యూఢిల్లీ: దేశంలో పేటెంట్ దరఖాస్తుల సంఖ్య గత ఆర్థిక సంవత్సరంలో 66,440 నమోదైంది. 2014–15లో ఈ సంఖ్య 42,763. మేధో సంపత్తి హక్కుల వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలే ఈ వృద్ధికి కారణమని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ‘2020–21లో భారత్‌లో మంజూరైన పేటెంట్ల సంఖ్య 30,074 ఉంది. 2014–15లో ఇది కేవలం 5,978 మాత్రమే. పేటెంట్ దరఖాస్తుల పరిశీలనకు అయ్యే సమయం ఆరేళ్ల క్రితం 72 నెలలు ఉంటే.. ఇప్పుడు 5–23 నెలలకు వచ్చింది. 2022 జనవరి–మార్చిలో భారత్‌లో నమోదైన పేటెంట్ ఫైలింగ్స్ అంతర్జాతీయంగా నమోదవుతున్న దరఖాస్తులను మించిపోయాయి. భారత ఫైలింగ్స్ జోరు 11 ఏళ్లలో ఇదే తొలిసారి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో వచ్చిన 19,796 దరఖాస్తుల్లో భారతీయ సంస్థలు, వ్యక్తులకు చెందినవి 10,706 ఉన్నాయి’ అని వివరించింది. -
ప్లేట్లెట్ థెరపీ కిట్‌కు పేటెంట్.. రెండు తెలుగు రాష్టాల్లో ఇదే తొలిసారి
Guntur Doctor Gets Patent For Plasma Therapy Kit: వైద్య రంగంలో పరిశోధనలు చేస్తూ పలు అవార్డులను సొంతం చేసుకున్న సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సూరత్ అమర్నాథ్కు కేంద్ర ప్రభుత్వం పేటెంట్ మంజూరు చేసింది. ప్లేట్లెట్ థెరపీలో వినూత్నంగా రూపొందించిన వైద్య పరికరానికి ఈ పేటెంట్ లభించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక వైద్యుడు రూపొందించిన వైద్య పరికరానికి పేటెంట్ లభించడం ఇదే మొదటిసారి. శనివారం గుంటూరు కొత్తపేటలోని డాక్టర్ అమర్ ఆర్థోపెడిక్ హాస్పటల్లో డాక్టర్ సూరత్ అమర్నాథ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా నినాదంతో స్ఫూర్తి పొంది ప్లేట్లెట్ థెరపీ పరికరాన్ని రూపొందించినట్టు చెప్పారు. రోగి నుంచి రక్తాన్ని సేకరించి ఆ రక్తంలోని ప్లేట్‌లెట్స్‌ను వేరు చేసి.. ఆ రోగికి అవసరమైన చోట సిరంజితో ఎక్కించడాన్ని ప్లేట్లెట్ థెరపీ అంటారని, ప్రస్తుతం దీనికి రూ.6 వేల నుంచి రూ.15 వేలు ఖర్చవుతుందన్నారు. అయితే తాను రూపొందించిన ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ పరికరం ఖరీదు కేవలం రూ.2 వేలు మాత్రమేనని డాక్టర్ సూరత్ అమర్నాథ్ వివరించారు. -
టీ అమ్మే వ్యక్తి.. నేడు రైలు ఇంజిన్ తయారు చేసే స్థాయికి!
ఆగ్రా: టీ అమ్ముతూ, సైకిళ్లను రిపేర్ చేసే త్రిలోకి ప్రసాద్ గాలి శక్తితో నడిచే ఇంజన్ని తయారు చేశాడు. అతను ఆగ్రాలోని ఫతేపూర్ సిక్రి నివాసి. పైగా అతను తయారు చేసిన ఇంజిన్‌ను కారు, ఆటోమొబైల్స్‌కు సరిపోయేలా రీ డిజైన్ చేస్తే అధిక మొత్తంలో వాహన కాలుష్యం నియంత్రించగలం అని చెబుతున్నాడు. అంతేకాదు పైగా త్రిలోకి తయారు చేసిన న్యూమాటిక్ ఇంజిన్ ద్విచక్ర వాహనం నుండి రైలు వరకు ఏదైనా నడపగలదు. (చదవండి: నీ దొంగ బుద్ధి తగలెయ్య!...మరీ ఆ వస్తువా! ఎక్స్పీరియన్స్ లేనట్టుందే....) ఈ ఇంజిన్ వాహనం అవసరాలకు అనుగుణంగా ఇంజిన్ ఆకారాన్ని మాత్రమే మార్చితే సిపోతుందని అంటున్నాడు. ఈ మేరకు 50 ఏళ్ల త్రిలోక్ మాట్లాడుతూ....నేను చిన్న వయసులోనే ట్యూబ్‌వెల్ ఇంజిన్‌ను తయారు చేయడం నేర్చుకున్నాను. అయితే నేను 15 ఏళ్ల క్రితం టైర్లకు పంక్చర్లు రిపేరు చేసేవాడు. ఇలా నేను చేస్తూ ఉండగా ఒకరోజు పంక్చర్ అయిన ట్యూబ్‌లో గాలిని నింపుతున్నప్పుడు ఎయిర్ ట్యాంక్ వాల్వ్ లీక్ అయ్యి , గాలి ఒత్తిడి కారణంగా ట్యాంక్ ఇంజిన్ రివర్స్‌లో పనిచేయడం ప్రారంభించింది. దీంతో అప్పటి నుంచి గాలి శక్తిని ఇంజిన్‌లో ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను. ఆ క్రమంలో నేను యంత్రాన్ని గాలితో ఆపరేట్ చేయగలిగితే ఖర్చులు కూడా గణనీయంగా తగ్గుతాయని భావించాను. ట్యాంక్‌లో గాలి నింపే ఖర్చును తగ్గించే ప్రయత్నంతో మొదలైన ఆలోచన చివరకు పూర్తి స్థాయి ఆటోమోటివ్ ఇంజిన్‌గా రూపాంతరం చెందింది. అని చెప్పారు. ఈ క్రమంలో త్రోలోకి భాగస్వామి సంతోష చౌహర్ మాట్లాడుతు తమ బృందంలో తానొక్కడే గ్రాడ్యుయేట్ అని మిగిలిన వారంతా పది కూడా పూర్తిచేయలేదు. మా బృందం అంతా కలిసి ఊపిరితిత్తుల ఆకారంలో రెండు బెల్లోలను తయారు చేసి వాటిని యంత్రంలో అమర్చాం. ఆ తర్వాత యంత్రానికి ఉన్న మీటను తిప్పడం ద్వారా బెలోస్లో గాలి ఒత్తిడి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఇంజిన్ మానవుని ఊపిరితిత్తుల మాదిరిగానే గాలిని పంపింగ్ చేయడం ప్రారంభించింది. అంతేకాదు యంత్రంలోని భాగాల్లో ఘర్షణను తగ్గించేందుకు లూబ్రికెంట్ అయిల్ అవసరం. పైగా పెట్రోల్-డీజిల్ ఇంజిన్ల వలే కాకుండా మేము తయారు చేసిన లిస్టర్ ఇంజన్లో లూబ్రికెంట్ ఆయిల్ వేడిగా లేదా నల్లగా మారదు. అని చెప్పాడు. అయితే త్రిలోకి తనకు వారసత్వంగా వచ్చిన ఇల్లు, పొలం అమ్మి ఈ యంత్రాన్ని తయారు చేసినట్లు చెప్పాడు. అంతేకాదు తమ బృందం పేటెంట్ కోసం దరఖాస్తు చేసినట్లు కూడా చెప్పుకొచ్చారు. (చదవండి: పువ్వుల్లొ దాగున్న ఇల్లు... కానీ అవి మొక్కలకు పూయని పూలు!) -
అనకాపల్లి బెల్లంపొడికి పేటెంట్..
సాక్షి, అమరావతి: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన అనకాపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రం అరుదైన ఘనత సాధించింది. బెల్లం, అనుబంధ ఉత్పత్తుల తయారీలో విశేష కృషికి పేటెంట్ దక్కింది. బెల్లాన్ని గుళికలు, పొడి రూపంలో తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని, తయారీ పద్ధతుల్ని అందుబాటులోకి తెచ్చినందుకు 20 ఏళ్ల పాటు పేటెంట్ హక్కు లభించినట్టు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. 1970 పేటెంట్ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా హక్కు కల్పించినట్లు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పేటెంట్ కార్యాలయం ప్రకటించిందన్నారు. బెల్లం పాడవకుండా వినూత్న పరిజ్ఞానం చెరకు నుంచి సంప్రదాయ పద్ధతిలో రసాన్ని తీసి దాన్ని ఉడకబెట్టి బెల్లాన్ని తయారు చేస్తుంటారు. ఈ తరహా బెల్లంలో అంతర్గతంగా తేమ ఉండడం వల్ల సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది పాడవుతుంటుంది. ఈ నేపథ్యంలో అనకాపల్లిలోని అఖిల భారత సమన్వయ పరిశోధన సంస్థ (ఏఐసీఆర్పీ), ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం (రార్స్) గుళికలు లేదా పలుకుల రూపంలో (గ్రాన్యూల్స్) ఉండే బెల్లాన్ని తయారు చేసే వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించింది. రెండేళ్ల పాటు నిల్వ ఈ సాంకేతికతో తయారయ్యే పలుకుల రూపంలో ఉండే బెల్లంలో అతి తక్కువ తేమ ఉంటుంది. తయారు చేసినప్పటి నుంచి రెండేళ్ల పాటు నిల్వ ఉంటుంది. ప్యాకింగ్ సులువు. సూపర్ ఫాస్ఫేట్, ఫాస్పొరిక్ యాసిడ్ వంటి ప్రమాదకర రసాయనాలను వినియోగించాల్సిన పని లేదు. ఎగుమతికి అనువైంది. సంప్రదాయ పద్ధతిలో తయారు చేసి అమ్మే బెల్లం కన్నా రైతులు ఎకరానికి అదనంగా రూ.40 వేలు సంపాదించవచ్చు. బెల్లంలో ఎన్నో ఔషధ గుణాలు వంద గ్రాముల బెల్లం పలుకుల్లో 80 నుంచి 90 గ్రాముల వరకు సుక్రోజ్, 0.4 గ్రాముల ప్రొటీన్, 0.1 గ్రాముల కొవ్వు, 0.6 నుంచి 1 గ్రాము వరకు ఖనిజాలు, 12 మిల్లీగ్రాముల ఐరన్, 4 మిల్లీగ్రాముల ఫాస్పరస్, 9 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది. తీపిని తగ్గించే లక్షణాలూ ఉన్నాయి. అటువంటి గ్రాన్యూల్ జాగరీకి పేటెంట్ లభించడం యూనివర్సిటీకి గొప్ప గౌరవంగా వీసీ డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 8 దశల్లో ఈ బెల్లం తయారవుతుందని వివరించారు. నాగజెముడు జెల్లీకి పేటెంట్ నాగజెముడు కాయలతో తయారు చేసే రసం లేదా తాండ్రకు తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఫుడ్ సైన్స్, టెక్నాలజీ కళాశాలలకు సంయుక్తంగా పేటెంట్ లభించింది. ఇది 20 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. నాగజెముడు వర్షాధారిత మెట్ట ప్రాంతాల్లో లభిస్తుంది. ఇటీవలి కాలంలో నాగజెముడును వాణిజ్య పంటగా సాగు చేస్తున్నారు. నాగజెముడులో పోషకాలతో పాటు ఔషధ లక్షణాలున్నాయి. సౌందర్య పోషణ వస్తువుల్లో వాడుతున్నారు. క్యాక్టస్ జాతికి చెందిన ఈ మొక్కల నుంచి వచ్చే కాయల నుంచి రసాన్ని తీసి జెల్లీ రూపంలోకి వచ్చేలా ఎండబెట్టి వాడుతున్నారు. చాక్లెట్ల మాదిరిగా తయారు చేసి వినియోగిస్తున్నారు. ఇందుకు ఈ పేటెంట్ లభించిందని డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. -
కన్నీళ్లపై పేటెంట్ మాదే!
బెంగళూరు: ‘మా కుటుంబానికి కన్నీళ్లు పేటెంట్గా మారాయి’ అని మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి సదానందగౌడ చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా ఖండించారు. దేవెగౌడ కుటుంబసభ్యులను ఉద్దేశించి సదానందగౌడ ‘ఎన్నికలలో కన్నీళ్లను వ్యాపారంగా మార్చుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు. దీనికి కుమారస్వామి స్పందిస్తూ, ‘అవును, మా కుటుంబానికి కన్నీళ్లపై పేటెంట్ ఉంది. మాది భావోద్వేగాల జీవితం. మా హృదయాలలో నొప్పిని కన్నీళ్లు వ్యక్తీకరిస్తాయి’ అని హున్సూర్‌లో మాట్లాడుతూ చెప్పారు. అసెంబ్లీ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న జేడీ(ఎస్) అభ్యర్థి కోసం ప్రచారం చేస్తున్న సమయంలో, కుమారస్వామి బుధవారం కిక్కేరిలో కన్నీళ్లు పెట్టుకున్నారు. -
ట్యాగ్ నుంచి పేటెంటెడ్ టెక్నాలజీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లైవ్‌స్టాక్ టెక్నాలజీ కంపెనీ ట్రాపికల్ యానిమల్ జెనెటిక్స్ (ట్యాగ్) పేటెంటెడ్ టెక్నాలజీ ‘ట్రాపికల్ బొవైన్ జెనెటిక్స్’ను అందుబాటులోకి తెచ్చింది. పాడి రైతుల ఆదాయం పెంపు లక్ష్యంగా దీనిని అభివృద్ధి చేసినట్టు ట్యాగ్ ఎండీ ప్రవీణ్ కిని వెల్లడించారు. కంపెనీ కో–ఫౌండర్ ఆలూరి శ్రీనివాస రావు, ఫ్యూచర్ టెక్నాలజీ ఆర్కిటెక్ట్ బ్రూస్ వైట్లాతో కలిసి సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ‘భారత్‌లో ఆవు/గేదె ఏడాదికి సగటున 1,500 లీటర్లు ఇస్తుంది. మా టెక్నాలజీతో ఇది 4,000 లీటర్లకు చేరుతుంది. ఎంబ్రియో టెక్నాలజీ కారణంగా ఆవుల ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుంది. మరో విధానమైన ప్రెగ్నెన్సీ ఫ్రీ లాక్టేషన్ పద్ధతిలో ఆవు గర్భం దాల్చకుండానే పాలను ఇస్తుంది. ప్రతి ఏడాది ఒక ఇంజెక్షన్ ఇస్తే చాలు. పశువు జీవిత కాలం అంతా పాలను అందిస్తుంది. గుజరాత్‌లోని ఆనంద్‌లో ఏడాదికి ఒక లక్ష అండాలను అభివృద్ధి చేయగలిగే సామర్థ్యమున్న ప్లాంటు ఉంది. ఇటువంటి కేంద్రం ఒకటి తెలంగాణ లేదా అంధ్రప్రదేశ్‌లో నెలకొల్పుతాం. ఇప్పటికే కంపెనీలో రూ.56 కోట్లు వెచ్చించాం’ అని వివరించారు. -
అమ్మాయిలకు ఇండియానే పేటెంట్
కలర్‌ఫుల్ అమ్మాయిలకు ఇండియానే పేటెంట్ అని నటి తమన్నా అంటున్నారు. అందానికే అందం ఈ పుత్తడి బొమ్మ అని ఈ మిల్కీబ్యూటీని పేర్కొనవచ్చు. పాలరాతి బొమ్మలాంటి మేనందంతో కుర్రకారుని కిర్రెక్కిస్తున్న తమన్నా దశాబ్దం దాటి నేటికీ మేటి నటిగా రాణిస్తున్నారు. రాజమౌళి బాహుబలి చిత్రం తమన్నా ముఖ చిత్రాన్నే మార్చేసింది. ఆ చిత్రంలో అంత అందంగా ప్రేక్షకులను కనువిందు చేశారు. దీంతో ప్రస్తుతం బాహుబలి–2 కోసం అన్ని వర్గాల వారు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక తమిళంలో శింబుతో రొమాన్స్ చేస్తున్న ట్రిబుల్ ఏ( అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్) చిత్రంపైనా అంచనాలు పెరుగుతున్నాయి. ఇలా ఉండగా దక్షిణాదిలో పాలరాతి బొమ్మలుగా పేరు తెచ్చుకున్న నటి తమన్నా, హన్సిక ఆమె మేని ఛాయ కారణంగా కొన్ని అవకాశాలు కొల్పోవలసి వచ్చిందా? కలర్ తక్కువ హీరోయిన్లకే కథా బలం ఉన్న అవకాశాలు లభిస్తున్నాయా? ఇలాంటి ప్రచారం పరిశ్రమ వర్గాల్లో హల్చల్ చేస్తుండడంతో అదే ప్రశ్నను నటి తమన్నా ముందుంచగా తను ఎలాంటి బదులిచ్చారో చూద్దాం. కలర్ నాకు ఎలాంటి ఇబ్బందిని కలిగించలేదు. నాకు రావలసిన అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే నేను నటించిన రెండు చిత్రాల్లో కాస్త రంగు ఛాయ తగ్గించుకునే నటించాను. అందులో ఒకటి బాహుబలి. ఆ చిత్రం ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శరీర ఛాయ అన్నది ఒక సమస్య కానే కాదు. ఇంకా చెప్పాలంటే కలర్‌ఫుల్ అమ్మాయిలకు ఇండియానే పేటెంట్. మహిళలు ఏ కలర్లో ఉన్నా అది వారికి అందమే. -
డ్యూయల్ సిమ్ ఆపిల్ రానుందా?
ఆపిల్ ఈ బ్రాండ్ ఫోన్ కోసం ప్రపంచవ్యాప్తంగా వెర్రెత్తిపోయే వారేందరో. మొన్నటికి మొన్న ఆపిల్ ఫోన్ కోసం కిడ్నీలు అమ్ముకున్న వార్తలూ చూశాం. తాజాగా వస్తున్న రిపోర్టుల ప్రకారం ఆపిల్ డ్యూయల్ సిమ్ ఫోన్లను త్వరలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోందట. ఈ మేరకు డ్యూయల్ సిమ్‌కు సంబంధించిన పేటెంట్ హక్కులను ఆపిల్ ఈ మధ్యే పొందిందని సమాచారం. ఇదే నిజమైతే ఆపిల్ ఫోన్ అంటే చెవి కోసుకునే వారికి బంపర్ ఆఫరే. భారత్, చైనాల్లో అత్యధిక సంఖ్యలో డ్యూయల్ సిమ్ మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే ఐఫోన్-8లో డ్యూయల్ సిమ్‌ను ఆపిల్ పరిచయం చేయనుందట. డ్యూయల్ సిమ్ టెక్నాలజీకి సంబంధించి యాపిల్ ఇటీవలే అమెరికాలో పేటెంట్ హక్కులను పొందింది. చైనాలోనూ అనుమతి లభించినట్లు ఆ సంస్థకు చెందిన ఓ అధికారి తాజాగా వెల్లడించారు. -
హృదయం లేని వైద్యులు
రక్తమోడుతున్నా హెచ్ఐవీ బాధితుడికి వైద్యం నిరాకరణ ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకు పడిగాపులు గత్యంతరం లేక ఇంటికి తీసుకెళ్లిన రోగి బంధువులు గుంటూరు మెడికల్: జిల్లాలోని కొల్లిపర ‡మండలం సిరిపురం గ్రామానికి వ్యక్తి కొంతకాలంగా హెచ్ఐవీతో బాధపడుతూ తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆగస్టు నుంచి చికిత్స పొందుతున్నాడు. రెండు రోజుల క్రితం శరీరంలో రక్తం తక్కువగా ఉండటంతో రెండు బాటిళ రక్తం ఎక్కించారు. అయినప్పటికీ ఆరోగ్యం కుదటపడకపోవడంతో తెనాలి ఆసుపత్రి వైద్యులు గుంటూరు జీజీహెచ్‌కు రిఫర్ చేశారు. ఆదివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో కుటుంబ సభ్యులు రోగిని జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. అత్యవసర సేవల విభాగంలో వీల్‌చైర్‌లోనే రాత్రంతా ఉంచారు. కొన్నిరకాల రక్త పరీక్షలు రాసిన వైద్యులు ఆ రిపోర్టులు వచ్చేసరికి తెల్లవారుజామున 6 గంటలు అవడంతో క్యాజువాలిటీలో వైద్యం చేయకుండా ఓపీకి వెళ్లి చూపించుకోవాలని చెప్పారు. దీంతో వీల్‌చైర్‌లోనే కుటుంబ సభ్యులు ఓపీలో తీసుకెళ్లగా జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, చర్మవ్యాధుల వైద్య విభాగాలకు వెళ్లాలని సూచించారు. ఆయా విభాగాలకు వీల్‌చైర్‌లోనే తిప్పారు. అక్కడ వైద్యులు వైద్య చేసేది తాము కాదంటే తాము కాదంటూ వెనక్కి పంపారు. దీంతో రోగి బాగా నీరసంగా తల్లిదండ్రులు ఓపీ విభాగం వద్దే ఉంచారు. అక్కడ పని చేస్తున్న కాంట్రాక్ట్ శానిటేషన్ సిబ్బంది ఓపీ గదికి తాళాలు వేయాలని బయటకు వెళ్లాలని చెప్పడంతో అక్కడ చెత్తను ఎత్తే బండిలోనే రోగిని ఓపీ భవనం బయటకు తీసుకొచ్చి మందుల షాపు వద్ద చెత్తను నిల్వ చేసే డబ్బాల వద్ద నేలపై పండుకోబెట్టారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు అక్కడ వేచి ఉన్నప్పటికీ వైద్యులుగానీ, వైద్య అధికారులుగానీ రోగిని పట్టించుకున్న దిక్కు లేదు. ఈలోగా కాలికి తీవ్రంగా గాయమై రక్తం కారుతుండటంతో కన్నతల్లి విజయకుమారి అది చూసి తట్టుకోలేక కాలికి మందు పూసి ఈగలు వాలకుండా ప్లాస్టిక్ సంచులను తలిగించింది. ఈ తంతు కళ్లారా చూస్తున్న పలువురు రోగుల సహాయకులు, అధికారులు, వైద్యుల తీరుపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. సాయంత్రం వరకు వేచి ఉన్నా వైద్యులు ఎవరూ తమ వైపు రాకపోవడం, వైద్యం అందించకపోవడంతో కుటుంబ సభ్యులు రోగిని ఇంటికి తీసుకెళ్లిపోయారు. పెద్ద ఆసుపత్రిలో వైద్యం చేస్తారని తెనాలి వైద్యులు చెబితే ఎంతో ఆశతో వస్తే కనీసం ఒక్కరు కూడా తమ కుమారుడు ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీయలేదని కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. -
నాలుగు కోట్లకు ‘ఫ్లైయింగ్ కారు’
న్యూఢిల్లీ:నెదర్లాండ్స్ చెందిన ‘పాల్-వి యూరప్ ఎన్వీ’అనే కంపెనీ ఫ్లైయింగ్ కారుకు భారత్‌లో పేటెంట్ హక్కులు పొందింది. రోడ్డుపైనా పరుగులు తీయడంతోపాటు గాల్లో హెలికాప్టర్లా ప్రయాణించే ఈ కారును ఈ ఏడాది చివర్లోగానీ, వచ్చే ఏడాది మొదట్లోగానీ యూరప్ మార్కెట్లో విడుదల చేయనుంది. విమానయాన అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉన్నందున భారతీయ మార్కెట్లో దీన్ని విడుదల చేసేందుకు మరికొంత సమయం పట్టవచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి. ట్రయల్ రన్ పూర్తి చేసుకున్న పర్సనల్ ల్యాండ్ అండ్ ఎయిర్ వెహికిల్ (పీఏఎల్-వి)గా పిలిచే ఈ ఫ్లైయింగ్ కారు రోడ్డుపైనా గంటకు గరిష్టంగా 170 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుందని, పది సెకండ్లలో గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని పుంజుకుంటుందని, ఇంధనం లీటరుకు 12 కిలోమీటర్లు వస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. అదే ఆకాశంలో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుందని, గంటకు 28 లీటర్ల ఇంధనం ఖర్చవుతుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇద్దరు వ్యక్తులు కూర్చుని ప్రయాణించే సౌకర్యం గల ఈ ఫ్లైయింగ్ కారు ధరను 3.80 కోట్ల రూపాయలుగా నిర్ణయించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఫ్లైయింగ్ కార్లను తయారు చేయాలనే ఆలోచన అమెరికా ఏవియేషన్ అథారిటీ 1917లోనే ఆలోచన చేసినా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. స్లొవేకియాకు చెందిన ఎరోమొబైల్ కంపెనీ 2015లోనే రెక్కలుగల ప్లైయింగ్ కారు ప్రొటోటైప్‌ను తయారు చేసింది. అయితే అది ట్రయల్ రన్లో క్రాష్ అయింది. ఆ తర్వాత రెక్కలుగల ప్లైయింగ్ కార్లను తయారు చేస్తున్నామని ఎన్నో కంపెనీలు ప్రకటించినప్పటికీ ఇప్పటికీ ఏవీ విజయం సాధించలేదు. ఇప్పుడు ఈ పాల్-వీ ఫ్లైయింగ్ కారుకు రెక్కలకు బదులుగా హెలికాప్టర్లలా రోటర్‌ను ఏర్పాటు చేశారు. -
స్టార్టప్‌లకు పేటెంట్ ఫ్రీ
మరిన్ని నిబంధనలు సడలించే యోచనలో సర్కారు న్యూఢిల్లీ: వినూత్న ఆలోచనలతో స్టార్టప్‌లను ప్రారంభించే యువ వ్యాపారవేత్తలకు మరిన్ని రాయితీలు ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది. వ్యాపారవేత్తల ఉత్పత్తులకు, ఆలోచనలకు ఇవ్వాల్సిన పేటెంట్, ట్రేడ్‌మార్క్, డిజైన్‌పై పేటెంట్ హక్కుకు పెట్టుకునే దరఖాస్తు ఖర్చును ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. స్టార్టప్‌లు కేవలం చట్టపరంగా చెల్లించాల్సిన రశీదు చెల్లిస్తేసరిపోతుంది. మిగతాదంతా ప్రభుత్వమే చూసుకుంటుందని..ప్రభుత్వం విడుదల చేసిన కార్యాచరణ ప్రణాళిక స్పష్టం చేసింది. ఇందుకోసం కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ డిజైన్ అండ్ ట్రేడ్‌మార్క్ నేతృత్వంలో ఓ ప్యానెల్‌ను కేంద్రం ఏర్పాటుచేయనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా వ్యాపారుల హక్కులను కాపాడటంతోపాటు మేధో సంపత్తి హక్కులపై అవగాహన పెరుగుతుందని జాతీయ మేధో సంపత్తి సంస్థ (ఎన్ఐపీఓ) అధ్యక్షుడు టీసీ జేమ్స్ తెలిపారు. స్వచ్ఛభారత్‌పై సెక్రటరీల ప్రజెంటేషన్ పాలనలో మార్పుకోసం పలువురు ఉన్నతస్థాయి అధికారులతో ఏర్పాటుచేసిన సెక్రటరీల బృందాలు నాలుగు ఆదివారం ప్రధాని మోదీకి ‘స్వచ్ఛభారత్, శిక్షిత్ భారత్’పై ఐడియాలను అందజేశాయి. ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలను అందరికీ అందేలా చేసేందుకు ఐడియాలు ఇవ్వాలంటూ వివిధ విభాగాల అధికారులతో ఎనిమిది సెక్రటరీల బృందాలను ప్రధాన మంత్రి ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. -
డ్రైవర్ లెస్ కారులో ఇక సేఫ్ గా వెళ్లొచ్చు..
టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ఆవిష్కరించిన డ్రైవర్ లెస్ కారుతో ఇక ప్రమాద రహిత ప్రయాణం చేయొచ్చునట. లేటెస్ట్ టెక్నాలజీతో తయారు చేసిన కార్లతో అనేక ప్రమాదాలు చోటు చేసుకోవడంతో నిర్వాహకులు మరిన్ని అధ్యయనాల అనంతరం ఇప్పుడు సురక్షితమైన కార్లను రూపొందించారు. పాదచారులు ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వ్యక్తి.. కారుకు దగ్గరకు వస్తే పసిగట్టి సెన్సర్లు పనిచేయడంతో కారు... దానంతట అదే తప్పించుకొని వెళ్ళే అవకాశం ఉందని నిర్వాహకులు చెప్తున్నారు. సుమారు లక్ష మైళ్ళ దూరం ఎటువంటి ప్రమాదాలు జరగకుండా సురక్షితంగా టెస్టింగ్ దశ పూర్తయిన అనంతరం ఆ సంస్...థ కార్ల తయారీలో మరింత సురక్షితంగా ఉండే డ్రైవర్ లెస్ కార్లను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు ప్రారంభించింది. కారుకు ఏర్పాటు చేసిన స్పీకర్ సిస్టం, స్క్రీన్లు డ్రైవర్ అవసరం లేకుండానే రోడ్డు మీద సురక్షితంగా వెళ్ళే అవకాశం ఉందని పేటెంట్ వివరాలు వెల్లడిస్తున్నాయి. ఈ నూతన ఆవిష్కారంలోని కారు డోర్లు, స్క్రీన్లు పాదచారులకు సెన్సర్ల ఆధారంగా 'స్టాప్', 'సేఫ్ క్రాస్' వంటి ట్రాఫిక్ సిగ్నల్స్ ను తెలుపుతూ హెచ్చరికలు జారీ చేస్తాయి. వాహనంలోని కంప్యూటర్లు పాదచారులు వెళ్ళాల్సిన మార్గాన్ని నిర్దేశిస్తాయి. ఇద్దరికి మాత్రమే సీటు ఉండే ఈ కారు... కేవలం స్మార్ట్ ఫోన్ ద్వారా గ్యారేజ్ కు మెసేజ్ పంపిస్తే చాలు నడవడం ప్రారంభమౌతుంది. అయితే ఈ కొత్త కారు సిస్టమ్ కు సంబంధించి ఎటువంటి స్కెచ్ ను గూగుల్ ప్రస్తుతానికి విడుదల చేయలేదు. కానీ గత నెల్లో నిస్సాన్ విడుదల చేసిన సిస్టమ్ కు ఇంచుమించు దగ్గరగా ఇది ఉండే అవకాశం ఉంది. నిస్సాన్ విడుదల చేసిన డ్రైవర్ లెస్ కారు టీట్రో ఫర్ డేజ్ ను... వెహికిల్ ఫర్ ది డిజిటల్ నేటివ్ గా సామాజిక మీడియా అభివర్ణించింది. ఈ తెల్లని కారు ఇప్పుడు సవరణల అనంతరం క్లీన్ కాన్వాస్ గా రూపొందించబడింది. -
‘చిరు’ దోసెకు పేటెంట్
చిరంజీవి దోసె గురించి తెలుసా? అదేంటి చిరంజీవి సినిమాలు తెలుసు, అందులో డ్యాన్సులు, డైలాగులు తెలుసు గానీ ఈ దోసేమిటబ్బా అనుకుంటున్నారా! త్వరలో ఈ దోసెకు పేటెంట్ కూడా రానుంది. హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్, రజనీకాంత్, సచిన్ టెండూల్కర్ - ఇలా ఎంతో మంది ప్రముఖులు ఈ దోసె టేస్ట్‌కు ఫిదా అయిపోయారు. చిరంజీవి ఈ దోసెను మైసూరులో షూటింగ్ సమయంలో ఓ దాబాలో తిన్నారట. దాని టేస్ట్‌కు ఫిదా అయిపోయి, ఆ హోటల్వాడిని బతిమాలారు. అతను ఆ వంట రహస్యం చెప్పక పోయినా, ప్రయోగాలు చేసి మరీ నేర్చుకున్నారు. అప్పటి నుంచి అది ‘చిరంజీవి దోసె’గా అతిథులందరికీ సుపరిచితమే. చిరంజీవి షష్టిపూర్తి సందర్భంగా ఆయన తనయుడు రామ్‌చరణ్ ఈ దోసెకు పేటెంట్ తీసుకోవాలని అనుకుంటున్నారు.