
బెంగళూరు: ‘మా కుటుంబానికి కన్నీళ్లు పేటెంట్‌గా మారాయి’ అని మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి సదానందగౌడ చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా ఖండించారు. దేవెగౌడ కుటుంబసభ్యులను ఉద్దేశించి సదానందగౌడ ‘ఎన్నికలలో కన్నీళ్లను వ్యాపారంగా మార్చుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు. దీనికి కుమారస్వామి స్పందిస్తూ, ‘అవును, మా కుటుంబానికి కన్నీళ్లపై పేటెంట్ ఉంది. మాది భావోద్వేగాల జీవితం. మా హృదయాలలో నొప్పిని కన్నీళ్లు వ్యక్తీకరిస్తాయి’ అని హున్సూర్‌లో మాట్లాడుతూ చెప్పారు. అసెంబ్లీ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న జేడీ(ఎస్) అభ్యర్థి కోసం ప్రచారం చేస్తున్న సమయంలో, కుమారస్వామి బుధవారం కిక్కేరిలో కన్నీళ్లు పెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment