అంగరంగ వైభవంగా నిఖిల్‌గౌడ నిశ్చితార్థం | HD Kumara Swamys Son Nikhil Engaged Congress Leaders Grand Niece | Sakshi
Sakshi News home page

అంగరంగ వైభవంగా నిఖిల్‌గౌడ నిశ్చితార్థం

Published Mon, Feb 10 2020 3:28 PM | Last Updated on Mon, Feb 10 2020 10:19 PM

HD Kumara Swamys Son Nikhil Engaged Congress Leaders Grand Niece - Sakshi

బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్‌ గౌడ నిశ్చితార్థం బెంగళూరులో ఘనంగా జరిగింది. దీనికి పార్టీ నేతలతో పాటు నిఖిల్‌ అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. బెంగళూరులోని తాజ్‌ వెస్ట్‌ ఎండ్‌ హోటల్లో నిఖిల్‌, రేవతిల నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు అన్ని పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు హాజరయ్యారు. దాదాపు 4 నుంచి 5 వేల మంది ఈ వేడుకలో పాల్గొన్నారు.

వేలాదిమంది అతిథులు, బంధువులు మధ్య నిఖిల్‌, రేవతిల నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. పెళ్లికి కూడా కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది. నిఖిల్‌ తెలుగుచిత్ర సీమకు కూడా సుపరిచితుడే. నాలుగేళ్ల  క్రితం జాగ్వార్‌ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమయ్యాడు. తదనంతర కాలంలో కర్ణాటక  ఎన్నికలలో మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి జేడీఎస్‌ అభ్యర్థిగా పోటీచేసి స్వతంత్ర అభ్యర్థి అయిన సుమలతా అంబరీష్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల అనంతరం సినిమాలపైన దృష్టిపెట్టిన నిఖిల్‌ ఇప్పుడు పెళ్లితో కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభించబోతున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement