న్యూఢిల్లీ: దేశంలో పేటెంట్ దరఖాస్తుల సంఖ్య గత ఆర్థిక సంవత్సరంలో 66,440 నమోదైంది. 2014–15లో ఈ సంఖ్య 42,763. మేధో సంపత్తి హక్కుల వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలే ఈ వృద్ధికి కారణమని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ‘2020–21లో భారత్‌లో మంజూరైన పేటెంట్ల సంఖ్య 30,074 ఉంది. 2014–15లో ఇది కేవలం 5,978 మాత్రమే. పేటెంట్ దరఖాస్తుల పరిశీలనకు అయ్యే సమయం ఆరేళ్ల క్రితం 72 నెలలు ఉంటే.. ఇప్పుడు 5–23 నెలలకు వచ్చింది.
2022 జనవరి–మార్చిలో భారత్‌లో నమోదైన పేటెంట్ ఫైలింగ్స్ అంతర్జాతీయంగా నమోదవుతున్న దరఖాస్తులను మించిపోయాయి. భారత ఫైలింగ్స్ జోరు 11 ఏళ్లలో ఇదే తొలిసారి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో వచ్చిన 19,796 దరఖాస్తుల్లో భారతీయ సంస్థలు, వ్యక్తులకు చెందినవి 10,706 ఉన్నాయి’ అని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment