filling
-
లిప్ ఫిల్లింగ్ ట్రీట్మెంట్ మంచిదేనా? ఫెయిలైతే అంతేనా..!
సెలబ్రెటీల దగ్గర నుంచి సాధారణ యువతీ యువకులు వరకు అందరూ అందం వెంట పరుగులు పెడుతున్నారు. అందుకోసం ఎలాంటి సర్జరీలైన చేయించుకునేందుకు అయినా వెనుకాడటం లేదు. తీరా అవి శరీరానికి పడక ఫైయిలై ప్రాణాల మీదకు తెచ్చకున్న సందర్భాలు ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అచ్చం అలాంటి ఘటనే యూకేలో ఒకటి చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. యూకేకి చెందిన 24 ఏళ్ల షౌన్నా హారిస్ అనే మహిళ తన పెదాలు అందంగా కనిపించేందుకు లిప్ ఫిల్లర్ ట్రీట్మెంట్ చేయించుకుంది. ఈ ట్రీట్మెంట్ని మొదటగా 18 ఏళ్ల వయసులో 0.51ఎంఎల్ లిప్ ఫిల్లర్ పొందింది. ఆ తర్వాత హారిస్ 24 ఏళ్ల వయసులో మరోక 1ఎంఎల్ ట్రీట్మెంట్ అందుకుంది. మొదటగా చేయించుకున్నప్పుడు బాగానే ఉంది. కానీ రెండోసారి అది తీవ్రమైన దుష్పరిణామాలకు దారితీసింది. సాధారణంగా ఈ ట్రీట్మెంట్ ఫెయిలైతే పెదాలు ఉబ్బడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఆమెకు పెదాలు ఒక విధమైన మంటతో లావుగా అయ్యిపోవడమేగాక శ్వాస సంబంధ సమస్యలు, ముఖమంతా మంట, దద్దర్లు వంటి సమస్యలు ఉత్ఫన్నమయ్యాయి.ఆ బాధ తాళ్లలేక చనిపోతానేమో అనేంత భయానక నరకాన్ని అనుభవించింది. ఓ మూడు రోజుల వరకు బయటకు రాలేకపోయింది. వైద్యులు వెంటనే ఆమె పరిస్థితిని గమనించి చికిత్స చేయగా శ్వాస పీల్చుకోగలిగింది. ఆ సమస్యలు తగ్గుతాయా లేదా అనేది వైద్యలు వెల్లడించలేదు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉంది. ఏదీ ఏమైనా దేవుడిచ్చిన అందం చాలు అనుకుంటే సమస్యలు ఉండవు. ఇలా అందం కోసం ఆర్రులు చాచి లేనిపోని కష్టాలు కొనితెచ్చుకుని పడరాని పాట్లు పడుతుంటారు చాలామంది. అందం మాట దేవుడెరుగు అస్సలు బతుకుతామా అనే సందేహాలు తెప్పించే ఈ కాస్మోటిక్ సర్జరీల జోలికి వెళ్లకపోవడమే మంచిది.ఎందుకు చేస్తారంటే..పెదాలు బొద్దుగా కనిపించేందుకు ఈ లిప్ ఫిల్లింగ్ ట్రీట్మెంట్ చేయించుకుంటారు. మొదటగా 0.5ఎంఎల్ డెర్మల్ ఫిల్లర్ (సగం సిరంజి) తో ప్రారంభిస్తారు. రెండువారాల తర్వాత ఇంకాస్త లావుగా కావాలనుకుంటే మరోసారి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ట్రీట్మెంట్ తర్వాత పెదాల ఆకృతి శాశ్వతం ఉండిపోదు. ఆ లిప్ ఫిల్లర్లు సాధారణంగా 12 నుండి 18 నెలల వరకు ఉంటాయి. మన శరీరం శక్తి ఎంత వేగంగా బర్న్ చేసే దాన్న బట్టి వాటి సైజు తగ్గిపోవడం జరుగుతుంది. ఈ ట్రీటెమెంట్కు కనీసం 21 ఏళ్ల వయసు ఉండాలి. అలాగే పెదాలు లావు తగ్గిపోయాక మళ్లీ వైద్యుడిని సంప్రదించి చేయించుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఈ ట్రీట్మెంట్లో పెదాలకు ఇంజెక్షన్లు పడకపోతే శరీరంపై తీవ్ర దుష్పరిణామాలు చూపించే ప్రమాదం కూడా ఉంది. ఈ కాస్మోటిక్ సర్జరీలు ఎంత లగ్జరీయస్తో కూడికున్నవైనా.. తేడా కొడితే ప్రాణం మీదకు వస్తుందనే విషయం మరువద్దు. ఇక ఇక్కడ లిప్ ఫిల్లింగ్ ట్రీట్మెంట్లో ఇచ్చే హైలురోనిడేస్ అనే ప్రోటీన్ ఎంజైమ్ ప్రతిచర్య ఫలితంగానే ఒక్కోసారి ఫెయిలై శరీరంపై పలు దుష్పరిణామాలు చూపిస్తుంది. ఇది పెదవుల్లో సాధారణంగా ఉండే హైలురోనిక్ యాసిడ్‌ను విచ్ఛిన్నం చేసి కావల్సినంత ఆకృతిలో పెదవులు ఉండేలా చేసుకునేందుకు ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటారు.గతంలో ఇలానే యూఎస్‌కి చెందిన మహిళ ఇలాంటి శస్త్ర చికిత్స చేయించుకుని కార్టూన్ క్యారెక్టర్ మాదిరిగా ఫేస్ మారిపోయింది. దీంతో ఆమె సోషల్ మీడియా వేదికగా ఆ బాధను వెల్లబోసుకుంది. ఈ లిప్ ఇంజెక్షన్ పడకపోతే మనిషి కోలుకోలేనివిధంగా ఆరోగ్యం దెబ్బతినడం, ముఖం వికృతంగా మారిపోవడం వంటివి జరుగుతాయని నిపుణులు కూడా చెబుతున్నారు. అసలు అవి పడతాయని నిర్థారించక గానీ ఆ ట్రీట్మెంట్ని చేయకూడదని చెబుతున్నారు. -
సింగరేణిలో 272 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో ప్రత్యక్ష నియామకాల పద్ధతిలో 272 పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్ జారీ అయింది. మేనేజ్మెంట్ ట్రైనీ(మైనింగ్) పోస్టులు 139, మేనేజ్మెంట్ ట్రైనీ(ఎఫ్ అండ్ ఏ) పోస్టులు 22, మేనేజ్మెంట్ ట్రైనీ(పర్సనల్) పోస్టులు 22, మేనేజ్మెంట్ ట్రైనీ(ఐఈ) పోస్టులు 10, జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ పోస్టులు 10, మేనేజ్మెంట్ ట్రైనీ(హైడ్రో–జియాలజిస్ట్) పోస్టులు 2, మేనేజ్మెంట్ ట్రైనీ(సివిల్) పోస్టులు 18, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ పోస్టులు 3, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు 30, సబ్–ఓవర్సీస్ ట్రైనీ(సివిల్) పోస్టులు 16 ఇందులో ఉన్నా యి. మార్చి 1 నుంచి 18 వరకు ఆన్లైన్లో దర ఖాస్తులను స్వీకరించనున్నారు. వైద్యాధికారి పోస్టు మినహా మిగిలిన పోస్టులకు గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లు. వైద్యాధికారి పోస్టుకు గరిష్ట వయోపరిమితి 45 ఏళ్లు. అన్ని పోస్టుల విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ల గరిష్ట వయోపరి మితి మినహాయింపు వర్తిస్తుంది. సింగరేణి ఉద్యోగులకు మాత్రం ఎలాంటి వయోపరిమితి లేదు. పూర్తి వివరాల కోసం మార్చి 1 నుంచి సింగరేణి సంస్థ వెబ్సైట్ (https://scclmin es.com) లోని ‘కెరీర్’విండోను సందర్శించాలని సంస్థ యాజమాన్యం సూచించింది. -
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం పక్కా ప్రణాళిక
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ప్రతి ఒక్కరి కల. దీన్ని సాధిస్తే తమ జీవితానికి, భవిష్యత్తుకు ఇక ఢోకా ఉండదనుకుంటారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి అహోరాత్రులు కష్టపడుతుంటారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించింది. ఒకేసారి 1.34 లక్షల సచివాలయాల ఉద్యోగాలను భర్తీ చేసి రికార్డు సృష్టించింది. లంచాలకు, సిఫారసులకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా, వేగంగా నియామకాలు చేసి అభ్యర్థుల ప్రశంసలు అందుకుంది. ఇందులో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)కి ప్రశ్నాపత్రం రూపకల్పన బాధ్యతలు అప్పగించింది. ఇక ఏపీపీఎస్సీ ద్వారా నేరుగా వివిధ విభాగాల్లో 6,296 పోస్టులను భర్తీ చేసింది. ఇందుకు మొత్తం 78 నోటిఫికేషన్లను ఇచ్చింది. అంతేకాకుండా ఇటీవల గ్రూప్–1, గ్రూప్–2, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. వీటి ద్వారా 1,446 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీంతో ఉద్యోగార్థులు అందరూ రెట్టించిన ఉత్సాహంతో ప్రభుత్వ కొలువును దక్కించుకోవడానికి ఉద్యుక్తులవుతున్నారు. నిరుద్యోగుల మేలుకు ఎన్నో చర్యలు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు మేలు చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాలనను నేరుగా ప్రజల ముంగిటకే తీసుకెళ్లి.. వారి సమస్యలను స్థానికంగా అక్కడికక్కడే పరిష్కరించేలా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సచివాలయాల్లో పనిచేయడానికి ఒకేసారి 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించారు. ఇంత పెద్ద స్థాయిలో ఉద్యోగాల భర్తీ దేశ చరిత్రలో ఎప్పుడూ లేకపోవడం గమనార్హం. అంతేకాకుండా ఒక్క వైద్యశాఖలోనే దాదాపు 55 వేల పోస్టులను భర్తీ చేశారు. ఇందులో వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్లు, వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ పోస్టులు ఉన్నాయి. చంద్రబాబు సీఎంగా ఉండగా నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఎన్నికల ముందు ప్రయోజనం పొందాలనే దురుద్దేశంతో 2018 డిసెంబర్లో 32 నోటిఫికేషన్లు జారీ చేసి వదిలేశారు. వాటి భర్తీకి పరీక్షలు కూడా నిర్వహించలేదు. ఈ పరీక్షలను కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే నిర్వహించి, పోస్టులను భర్తీ చేసింది. ఎప్పటి ఖాళీలు అప్పుడే భర్తీ.. నిరుద్యోగ యువతకు మేలు చేసేలా ప్రభుత్వం వివిధ శాఖల వారీగా ఉన్న ఖాళీలను ఎప్పటికప్పుడు సేకరిస్తోంది. ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేయడానికి వీలుగా ఏపీపీఎస్సీతో సమన్వయం చేసుకుంటోంది. నోటిఫికేషన్ ఇచ్చే ముందే ఎలాంటి వివాదాలకు తావులేకుండా కమిషన్ చర్యలు తీసుకుంటోంది. గత నాలుగేళ్లల్లో మొత్తం 78 నోటిఫికేషన్లను ఒక్క కోర్టు వివాదం లేకుండా, ఒక్క నిరుద్యోగికీ అన్యాయం జరగకుండా 6,296 పోస్టులను భర్తీ చేయడం విశేషం. ఇంత పక్కాగా ఉద్యోగాల భర్తీ గత ప్రభుత్వంలో ఎప్పుడూ జరిగింది లేదు. నాడు అలా.. నేడు ఇలా.. గత టీడీపీ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇచ్చినా పరీక్షలు ఎప్పుడు జరిగేది, నియామకాలు ఎప్పుడు పూర్తయ్యేదీ అంతా అగమ్యగోచరంగా ఉండేది. అంతేకాకుండా ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్‌పైనా అనేక వివాదాలు.. కోర్టు కేసులు తలెత్తేవి. ఇలా పలు కారణాలతో నియామక పరీక్షలు నిలిచిపోవడమో లేక రద్దు కావడమో జరిగేది. అలాంటిది గత నాలుగేళ్లల్లో ఏపీపీఎస్సీ 78 నోటిఫికేషన్లు ఇచ్చి 6,296 ఉద్యోగాలను ఎలాంటి వివాదాలు లేకుండా అత్యంత పారదర్శకంగా భర్తీ చేసింది. అంతేకాకుండా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి న్యాయ వివాదాల్లో చిక్కుకున్నవాటిని సైతం పరిష్కరించింది. ఆ పోస్టులను భర్తీ చేసి అభ్యర్థులకు న్యాయం చేసింది. ఇలా గ్రూప్–1, గ్రూప్–2 వంటి గెజిటెడ్ పోస్టులతో పాటు వివిధ శాఖల్లో అసిస్టెంట్ ఇంజనీర్లు, అగ్రికల్చరల్ ఆఫీసర్లు, మరెన్నో నాన్ గెజిటెడ్ పోస్టుల నియామకాలు చేపట్టింది. -
పోలవరం నిధులపై అభ్యంతరం చెప్పలేదు
పోలవరం ప్రాజెక్ట్‌లో 41.15 మీటర్ల వరకూ నీటిని నింపడానికి రూ.10,911.15 కోట్లు వరద నష్టం రూ.2 వేల కోట్లు నిధులకు ఆర్థిక శాఖ అభ్యంతరం చెప్పలేదని జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు పేర్కొన్నారు. ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. జనవిశ్వాస్ బిల్లుకు మద్దతు లోక్‌సభలో కేంద్రం గురువారం ప్రవేశపెట్టిన జన విశ్వాస్ సవరణ బిల్లు, 2022కు వైఎస్సార్సీపీ మద్దతు తెలిపింది. బిల్లుపై చర్చలో వైఎస్సార్సీపీ ఎంపీ బీవీ సత్యవతి మాట్లాడుతూ.. దేశంలో జీవన సౌలభ్యానికి బిల్లు ఎంతో తోడ్ప డుతుందన్నారు. బిల్లులో కొన్ని మార్పులను ఎంపీ సత్యవతి సూచించారు. తిట్టలేదు.. అవాస్తవాల ప్రచారంపై ప్రశ్నించానంతే: ఎంపీ ఎంవీవీ తనతో పాటు తన కుటుంబ సభ్యుల గౌరవానికి భంగం కలిగేలా మీడియాతో మాట్లాడిన వ్యవహారంలో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును కేవలం ప్రశ్నించాను తప్ప అసభ్య పదజాలంతో తిట్టలేదని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్పష్టం చేశారు. తనపై చేసిన అసత్య ప్రచారంపై రఘురామను నిలదీశానని, వాస్తవాలు తెలియకుండా ఇష్టానురీతిన ఎలా మాట్లాడుతారని ప్రశ్నించినట్టు తెలిపారు. ఈ నెల 20న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభ వాయిదా పడిన అనంతరం సెంట్రల్ హాల్లో తనను అసభ్య పదజాలంతో తిడుతూ.. చంపేస్తాననే ధోరణిలో బెదిరింపులకు పాల్పడ్డారంటూ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లాకు ఎంపీ రఘురామరాజు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై ఎంవీవీ సత్యనారాయణ స్పందిస్తూ.. ఆయన ఆరోపణలు పూర్తిగా అవాస్తమని కొట్టిపారేశారు. తన కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఉదంతంపై రఘురామ తలాతోక లేని ఆరోపణలు చేశారని విమర్శించారు. -
11 ఏళ్లలో తొలిసారిగా రికార్డు సృష్టించిన భారత్..!
న్యూఢిల్లీ: దేశంలో పేటెంట్ దరఖాస్తుల సంఖ్య గత ఆర్థిక సంవత్సరంలో 66,440 నమోదైంది. 2014–15లో ఈ సంఖ్య 42,763. మేధో సంపత్తి హక్కుల వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలే ఈ వృద్ధికి కారణమని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ‘2020–21లో భారత్‌లో మంజూరైన పేటెంట్ల సంఖ్య 30,074 ఉంది. 2014–15లో ఇది కేవలం 5,978 మాత్రమే. పేటెంట్ దరఖాస్తుల పరిశీలనకు అయ్యే సమయం ఆరేళ్ల క్రితం 72 నెలలు ఉంటే.. ఇప్పుడు 5–23 నెలలకు వచ్చింది. 2022 జనవరి–మార్చిలో భారత్‌లో నమోదైన పేటెంట్ ఫైలింగ్స్ అంతర్జాతీయంగా నమోదవుతున్న దరఖాస్తులను మించిపోయాయి. భారత ఫైలింగ్స్ జోరు 11 ఏళ్లలో ఇదే తొలిసారి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో వచ్చిన 19,796 దరఖాస్తుల్లో భారతీయ సంస్థలు, వ్యక్తులకు చెందినవి 10,706 ఉన్నాయి’ అని వివరించింది. -
బాల బాహుబలి
తల్లి చేయాల్సిన అభిషేకం కోసం ఏకంగా శివలింగాన్నే పెళ్లగించి జలపాతం కింద ఉంచాడు సినీ బాహుబలి! తల్లిదండ్రులు ధాన్యం మూటగట్టడానికి పడే కష్టాన్ని తాను కనిపెట్టిన యంత్రంతో తేలిక చేశాడు ఈ బాల బాహుబలి!! అతడు కనిపెట్టిన పరికరం ధాన్యాన్ని సులువుగా నింపి, ఒక చోట నుంచి మరో చోటకు సునాయాసంగా మోసుకెళ్లడానికి వీలుకల్పిస్తుండటంతో జాతీయ అవార్డే వరించింది. ఈ ఆవిష్కరణ జాతీయ స్థాయిలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ నిర్వహించిన ఇన్స్పైర్ అవార్డుల పోటీలో మూడో బహుమతిని గెల్చుకుంది. అంతేకాదు.. తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఈ పరికరాన్ని ధాన్యం సేకరణ కేంద్రాల్లో ఉపయోగించడానికి సిద్ధమవుతోంది. మన వాళ్ల ఆవిష్కరణలను వెలుగులోకి వచ్చిన వెంటనే ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం అపూర్వం. గొప్ప ప్రారంభం. ప్రభుత్వం ఇదే మాదిరిగా దృష్టి సారించాల్సిన అద్భుత గ్రామీణ ఆవిష్కరణలు తెలుగు రాష్ట్రాల్లో బోలెడు మూలనపడి ఉన్నాయి. వాటిలో కొన్నిటికైనా గుర్తింపు వస్తుందని, ఆవిష్కర్తలకూ మంచిరోజులొస్తాయని ఆశిద్దాం.. పద్నాలుగు సంవత్సరాల మర్రిపల్లి అభిషేక్ రైతు బిడ్డ. 8వ తరగతి చదువుతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హన్మాజిపేట అతని స్వగ్రామం. ఆ ఊళ్లోనే ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి. తండ్రి లక్ష్మీరాజం వ్యవసాయ పనులు చేస్తూ, తల్లి రాజవ్వ బీడీలు చుడుతూ జీవనం సాగిస్తున్నారు. సెలవు రోజుల్లో ఇంటివద్ద ఏదో ఒక వస్తువు తయారు చేయడానికి అభిషేక్ ప్రయత్నిస్తుండేవాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. గత వేసవిసెలవుల్లో సిరంజీలు, కాటన్ బాక్స్‌లతో వాటర్ ప్రెషర్ ద్వారా నడిచే పొక్లెయినర్‌ను తయారు చేసే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ ఓ రోజు తన తండ్రితో కలసి వేములవాడలోని మార్కెట్‌యార్డుకు వెళ్లాడు. అక్కడ కార్మికులు ధాన్యాన్ని సంచుల్లోకి నింపుతున్నారు. ఒకరు ఖాళీ సంచిని పట్టుకొని నిలబడుతుంటే, మరొకరు ధాన్యాన్ని కిందినుంచి ఎత్తి సంచిలో నింపుతున్నారు. ధాన్యం నింపిన బస్తాను మరో ఇద్దరు తీసుకెళ్లి పక్కన పెడుతున్నారు. ఈ పనిని అభిషేక్ శ్రద్ధగా గమనించాడు. ఒక ధాన్యం సంచిని నింపడానికి నలుగురు పనిచేయాలా? ఈ కష్టాన్ని తగ్గించడానికి ఏమీ చేయలేమా? అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఈ ఆలోచనే తక్కువ శ్రమతో చక్కగా పనిచేసే ఓ పరికరం రూపకల్పనకు దారితీసింది. ఈ పరికరంలో 2 నిమిషాల్లో ధాన్యం బస్తాను నింపి, బరువు ఎంతో తెలుసుకునే ఏర్పాటు కూడా ఉంటుంది. అతనికి వచ్చిన కొత్త ఆలోచనకు కార్యరూపం ఇవ్వడానికి, జాతీయ స్థాయి బహుమతిని పొందడానికి హన్మాజిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమారాణి, సైన్స్టీచర్ వెంకటేశం ప్రోత్సాహం తోడ్పడింది. గొప్ప ఆలోచన.. రూ. 5 వేల ఖర్చు.. ధాన్యాన్ని సంచిలోకి సులువుగా ఎత్తే పరికరం (ప్యాడీ ఫిల్లింగ్ మిషన్)ను తయారు చేస్తే బాగుంటుందన్న తన ఆలోచనను పాఠశాల ఉపాధ్యాయులకు అభిషేక్ తెలియజేశాడు. జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో ఈ ఆలోచనకు ప్రోత్సాహం లభించింది. ఆ తర్వాత గైడ్ టీచర్ వెంకటేశ్ సూచనలు, సహకారంతో ఐరన్ షీట్లు, రాడ్లు, బరువు తూచే మిషన్‌ను కొనుగోలు చేసి.. వారం రోజులపాటు వెల్డింగ్ షాపులో శ్రమించి తను ఆశించిన విధంగా అభిషేక్ పరికరాన్ని ఆవిష్కరించాడు. ఇందుకోసం రూ. 5 వేల వరకు ఖర్చయింది. ఈ పరికరంతో ఒక్కరే అత్యంత సులభంగా కేవలం రెండు నిమిషాల్లోనే ధాన్యాన్ని బస్తాలోకి నింపుకోవచ్చు. ఈ పరికరంలో రెండు భాగాలుంటాయి. ట్రాలీ వంటిది ఒకటి, ధాన్యాన్ని తీసుకొని సంచిలోకి పోసే పరికరం ఒకటి. సంచిని నింపిన తర్వాత ఈ రెంటిని విడదీసి, ట్రాలీ ద్వారా ధాన్యం బస్తాను గోదాములోకి తీసుకెళ్లి భద్రంగా పెట్టుకోవచ్చు. నలుగురు చేసే పనిని ఒక్కరే రెండునిమిషాల్లో పూర్తిచేయడానికి ఈ పరికరం దోహదపడుతోంది. ఈనెల 14, 15 తేదీల్లో ఢిల్లీ ఐఐటీలో జరిగిన జాతీయ స్థాయి ‘ఇన్స్పైర్ అవార్డ్స్–మనక్’ ఎగ్జిబిషన్– 2019లో వివిధ రాష్ట్రాలకు చెందిన 60 మంది విద్యార్థులు తమ అత్యుత్తమ ఆవిష్కరణలను ప్రదర్శించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన విద్యార్థి తయారు చేసిన ఆటోమేటిక్ వాష్‌రూమ్ క్లీనర్‌కు మొదటి బహుమతి, అండమాన్ నికోబార్‌కు చెందిన విద్యార్థి తయారుచేసిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఓపెనర్‌కు రెండో బహుమతి వచ్చింది. అభిషేక్ తయారు చేసిన ప్యాడీ ఫిల్లింగ్ మిషన్‌కు మూడవ స్థానం వచ్చింది. ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్ డా. రాంగోపాల్‌రావు చేతుల మీదుగా రూ. పదివేల నగదు బహుమతితోపాటు ల్యాప్‌టాప్ లభించింది. పిన్నవయసులోనే చక్కటి పరికరాన్ని రూపొందించిన అభిషేక్‌ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వెన్నుతట్టి రూ. 1.16 లక్షల చెక్కు ఇచ్చి అభినందించారు. అభిషేక్ రూపొందించిన పరికరాన్ని మరింత మెరుగుపరచి ఈ రబీ సీజన్లోనే ప్రయోగాత్మకంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వినియోగించడంతోపాటు, ‘వరి అభిషేక్’ పేరిట పేటెంట్ కోసం దరఖాస్తు చేయడానికి తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకుల్ సబర్వాల్ ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. రూ. పదివేల నగదు ప్రోత్సాహాన్ని అభిషేక్‌కు అందించారు. వచ్చే ఏడాది నాటికి ఈ పరికరాన్ని రైతులకు అందుబాటులోకి తెచ్చే వీలుందని అభిషేక్ గైడ్ టీచర్ వెంకటేశం(85008 65263) తెలిపారు. ఏమిటీ ‘ఇన్స్పైర్’ అవార్డు? కేంద్ర శాస్త్ర – సాంకేతిక శాఖ, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా ‘ఇన్స్పైర్ అవార్డ్స్– మనక్’ పోటీలను నిర్వహిస్తున్నాయి. 2020 నాటికి శాస్త్రవిజ్ఞాన రంగంలో మొదటి 5 దేశాల్లో మన దేశాన్ని నిలపాలన్న లక్ష్యంతో పాఠశాల విద్యార్థుల్లో పరిశోధన, ఆవిష్కరణాభిలాషకు ప్రేరణ కలిగించడానికి ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. 6–10వ తరగతుల (10–15 ఏళ్ల వయసు) ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థుల్లో సృజనాత్మకతను, వినూత్న ఆలోచనలను గుర్తించడం ద్వారా ప్రజల జీవితాలను సులభతరం చేసే కొత్త ఆలోచనలు, ఉపాయాలను రేకెత్తించడమే లక్ష్యం. ఈ ఆలోచనలు సొంతవి, సాంకేతికతకు సంబంధించినవి అయి ఉండాలి. రోజువారీ సమస్యలను పరిష్కరించేటటువంటి ఒక యంత్రాన్నో, వస్తువునో మెరుగుపరిచేదిగా లేదా కొత్తదానిని సృష్టించేవిగా ఉండే సొంత ఆలోచనలై ఉండాలి. దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి పది లక్షల వినూత్న ఆలోచనలను సేకరిస్తారు. వాటిలో ఉత్తమమైన వాటిని జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన మెరుగైన ఆలోచనల ప్రకారం యంత్ర పరికరాల నమూనాలను తయారు చేయడానికి రూ. పది వేల చొప్పున గ్రాంటును మంజూరు చేస్తారు. దేశవ్యాప్తంగా గరిష్టంగా వెయ్యి ఆవిష్కరణలను ఎంపిక చేసి జాతీయస్థాయి పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీల్లో బహుమతులు పొందిన ఆవిష్కరణలకు స్టార్టప్ ఇండియా కార్యక్రమంలో భాగంగా శాస్త్ర సాంకేతిక సంస్థల ద్వారా సాంకేతిక, ఆర్థిక తోడ్పాటును అందించి, ఆయా ఆవిష్కరణలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా లక్షన్నర పాఠశాలల నుంచి 2.88 లక్షల వినూత్న ఆలోచనలను సేకరించి వడపోసిన తర్వాత 60 ఆవిష్కరణలు ఢిల్లీకి చేరాయి. అందులో మూడోస్థానాన్ని తెలుగు విద్యార్థి అభిషేక్ దక్కించుకోవడం విశేషం. ఇంత పేరు తెస్తాడనుకోలేదు! నా కొడుకు తయారు చేసిన వడ్ల మిషన్కి ఇంత పేరు వస్తుందని నాకు తెలియదు. బడి లేని రోజుల్లో ఏదో ఒకటి తయారు చేస్తూ ఉంటాడు. కానీ తను తయారు చేసిన ఈ పరికరం ఇంత పేరు తెస్తుందని అనుకోలేదు. ఢిల్లీలో నా కొడుకు అవార్డు తీసుకోవడం ఆనందాన్ని ఇచ్చింది. – మర్రిపల్లి రాజవ్వ, అభిషేక్ తల్లి, హన్మాజిపేట మరిన్ని పరికరాలు తయారు చేస్తా ఉపాధ్యాయులతో పాటు నా తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ పరికరాన్ని తయారు చేయగలిగా. నాకు ఏదైనా తయారు చేయాలనే ఆలోచన కలిగినప్పుడల్లా వెంకటేశం సారు, ఇతర టీచర్లు ప్రోత్సహించారు. ఇంటివద్ద అమ్మ, అక్కలు కూడా సహాయం చేసేవారు. నా పరికరం జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై, మూడో బహమతి పొందడం ఆనందంగా ఉంది. ఇకముందు మరిన్ని కొత్త యంత్రాలను తయారుచేస్తా. ఐఏఎస్ అధికారి కావాలన్నది నా లక్ష్యం. – మర్రిపల్లి అభిషేక్, 8వ తరగతి విద్యార్థి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, హన్మాజిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా ఢిల్లీ ఐఐటీలో ‘ఇన్స్పైర్’ పోటీల్లో తన పరికరంతో అభిషేక్ – పాదం వెంకటేశ్, సాక్షి, సిరిసిల్ల ఫొటోలు: పుట్టపాక లక్ష్మణ్ -
అక్రమంగా గ్యాస్ రీ ఫిల్లింగ్
బనశంకరి: అక్రమంగా గ్యాస్ రీ ఫిల్లింగ్ చేస్తున్న కేంద్రంపై సీసీబీ పోలీసులు దాడులు నిర్వహించి ముగ్గురు నిర్వాహకులను అరెస్ట్ చేశారు.వారి నుంచి 116 గ్యాస్ సిలిండర్లు, రీఫిల్లింగ్ రాడ్లు, గ్యాస్ తూకం యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరహళ్లి ప్రధాన రహదారిలోని కోడిపాళ్య గోదాములో వంట గ్యాస్ సిలిండర్ల నుంచి కమర్షియల్ సిలిండర్లలోకి గ్యాస్‌ను రీ ఫిల్లింగ్ చేస్తున్నట్లు సీసీబీ పోలీసులకు పక్కాసమాచారం అందింది. దీని ఆధారంగా బుధవారం దాడిచేసి నిర్వాహకులైన బాగేపల్లి తాలూకా చేలూరుకు చెందిన సునీల్‌కుమార్, కనకపుర పైప్‌లైన్ రోడ్డు నివాసి శివరాజు, గవిపురం గుట్టహళ్లికి చెందిన లక్ష్మణ్గౌడను అరెస్ట్ చేశారు. సిలిండర్లు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకొని నిందితులపై కెంగేరి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఏజెన్సీ ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీకి చర్యలు
బుట్టాయగూడెం (పోలవరం) : జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత ప్రభుత్వాస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని డీఎంహెచ్‌వో కె.కోటీశ్వరి చెప్పారు. బుధవారం బుట్టాయగూడెం మండలంలోని కేఆర్ పురం ఐటీడీఏలో జిల్లా మలేరియా కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. శుక్రవారం నులిపురుగుల నివారణకు పంపిణీ చేసే మాత్రల నిల్వలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెంలో ప్రభుత్వ ఆస్పత్రి మంజూరైం దని, సిబ్బందిని నియమించాల్సి ఉందన్నారు. అదేవిధంగా వేలేరుపాడులోని ప్రభుత్వ ఆస్పత్రిలో స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఐటీడీఏ పీవో ఎస్.షణ్మోహన్ ఆదేశాలు జారీ చేశారని ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫార్మసిస్ట్, ఎల్టీ పోస్టుల భర్తీకి కూడా కృషి చేస్తున్నామన్నారు. గిరిజన గ్రామాల్లో మలేరియా వ్యాప్తి చెందకుండా మలాథియాన్ స్ప్రేయింగ్ చేయిస్తున్నామని చెప్పారు. అన్ని పీహెచ్‌సీల్లో టైఫాయిడ్‌కు సంబంధించిన పరీక్షలు జరిపే విధంగా ఏర్పాటు చేశామన్నారు. మాతాశిశు ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో కొత్తగా ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 17 కేంద్రాలను సిద్ధం చేశామని, మరో 14 కేంద్రాలు సిద్ధం చేస్తున్నామన్నారు. డీ వార్మింగ్ డేను పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా 6 లక్షల 400 మంది పిల్లలకు మాత్రలు అందిస్తామని చెప్పారు. డెప్యూటీ డీఎంహెచ్‌వో వంశీలాల్ రాథోడ్ పాల్గొన్నారు. -
ఈ ఏడాది ప్చ్..!
భర్తీకానీ విదేశీ విద్యార్థుల బీటెక్ అడ్మిషన్లు నాక్ గుర్తింపు లేక ప్రవేశాలకు ఆటంకం బాలాజీచెరువు(కాకినాడ) : జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం కాకినాడలో చేరేందుకు విదేశీ విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. దాంతో నేషనల్ ఫారన్స్ సంఖ్య గణనీయంగా తగ్గింది. రెండు సంవత్సరాల్లో బీటెక్ ఇంజినీరింగ్‌లో ప్రవేశాలు లేక సీట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన నేషనల్ ఇనిస్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ వర్క్(ఎన్ఐఆర్ఎఫ్) విడుదల చేసిన ర్యాంక్‌లో 69వ ర్యాంక్ సాధించిన వర్సిటీ జేఎన్టీయూకేకు నాక్ గుర్తింపులేకపోవడంతో వీదేశీ విద్యార్థులు చేరడానికి వెనకడుగు వేస్తున్నారని వర్సిటీ అధికారులు చెబుతున్నారు. స్వీడన్, బ్యాంకాక్, అమెరికా వంటిదేశాల విశ్వవిద్యాలయాలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు నిర్వహిస్తున్న వర్సిటీ ఈ సీట్లను భర్తీ చేయడంతో విఫలమవుతోంది. జేఎన్టీయూకే 2008లో అవిర్భవించింది. ఇక్కడ విద్యార్థులతో పాటు వీదేశీయులకు సీట్లు కేటాయించారు. ప్రధానంగా ఫారన్ నేషనల్స్(విదేశీ)విద్యార్థులు, నాన్ రెసిడెంట్ ఇండియన్ పీపుల్స్, పీపుల్ ఇండియా ఆరిజన్స్కు మొత్తం 300 సీట్లలో 15 శాతం కేటాయించారు. వీరిలో ఫారన్ నేషనల్స్‌కు ఐదు శాతం కేటాయించినా రెండేళ్ల నుంచి సీట్లు భర్తీకావడం లేదు. సాధారణంగా శ్రీలంక, నేపాల్, భూటాన్ వంటి దేశాల నుంచి బీటెక్, ఎంటెక్ డిగ్రీలు చదివేందుకు ఇక్కడికి వస్తుంటారు. ఒక విద్యార్థి సంవత్సరానికి దాదాపు రెండు లక్షల ఫీజు చెల్లిస్తాడు. బీటెక్‌లో 40 సీట్లు, ఎంటెక్, ఎంబీఏలో 25 సీట్లు కేటాయించినా సీట్లు అంతంతమాత్రంగానే భర్తీ అవుతున్నాయి. అధికారుల వైఫల్యం.. విదేశీ విద్యార్థులను అకర్షించడంలో అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పవచ్చు. కేవలం నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియన్స్, పీపుల్ ఇంyì యన్ ఆరిజన్(పీఐవో) కేటగీరిల విద్యార్థులు కొంతవరకూ చేరడం గమనార్హం. వీటిలో మాత్రం నామమాత్రంగా సీట్లు నిండుతున్నాయి. ఎవరూ చేర కపోతే ఈ సీట్లు అలాగే ఖాళీగా ఉంచాలి తప్ప వేరేవారికి కేటాయించకూడదు. ఇలా వీదేశీ విద్యార్థులు లేక, మిగత వారికి కేటాయించక సీట్లు ఏళ్లతరబడి ఖాళీగా ఉంటున్నాయి. గత ఐదు సంవత్సరాల ప్రవేశాలు. సంవత్సరం కేటాయించిన సీట్లు భర్తీ అయిన సీట్లు 2010–11 45 30 2011–12 – 42 2012–13 – 10 2013–14 – 1 2014–15 – 0 2015–16 – 04 2016–17 – 0 -
పిన్‌వీల్ శాండ్విచ్
కావలసినవి: పెద్ద సైజు బ్రెడ్ స్లయిసెస్ - 3, కొత్తిమీర పేస్ట్ - 2 చెంచాలు, క్యారెట్ తురుము - పావు కప్పు, తురిమిన చీజ్ - పావు కప్పు, ఉడకబెట్టిన బంగాళదుంప - 1, తరిగిన పాలకూర - పావు కప్పు, నల్ల మిరియాల పొడి - 1 చెంచా, జీలకర్ర పొడి - అరచెంచా తయారీ: ఉడికించిన బంగాళాదుంపను తొక్కు తీసేసి, మెత్తగా చిదమాలి. బ్రెడ్ ముక్కల అంచులను తీసేసి, చపాతీ కర్రతో వాటిని వెడల్పుగా చేసుకోవాలి. తర్వాత వాటన్నిటి మీద కొత్తిమీర పేస్ట్ రాయాలి. ఆపైన బంగాళాదుంప పేస్ట్‌ని పరవాలి. తర్వాత క్యారెట్ తురుము, చీజ్, జీలకర్ర పొడి, మిరియాల పొడిని ఒకదాని పైన ఒకటిగా వేయాలి. దానిపై మరో బ్రెడ్ ముక్కను పెట్టి దానిపై కూడా అన్నిటినీ పరవాలి. పైన ఒక బ్రెడ్ స్లైస్ పెట్టి.... మొత్తాన్నీ రోల్‌లాగా చుట్టాలి (ఫిల్లింగ్స్ మరీ ఎక్కువైతే లావుగా ఉండి రోల్ అవ్వడం కష్టమవుతుంది. కాబట్టి పల్చగా ఉండేలా చూసుకోవాలి). తడి చేత్తో అంచుల్ని మూసేసి, వ్యాక్స్ పేపర్లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. అరగంటలో గట్టిగా అవుతుంది. అప్పుడు బయటికి తీసి, పేపర్ని తొలగించాలి. ఆపైన చాకుతో రోల్‌ను కావాల్సిన సైజులో ముక్కలుగా చేసుకోవాలి. టమాటో సాస్ లేదా చిల్లీ సాస్‌తో తింటే బాగుంటాయి. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్లు లోపలి ఫిల్లింగ్ను మార్చుకోవచ్చు. కావాలంటే బేక్ కూడా చేసుకోవచ్చు.