
బనశంకరి: అక్రమంగా గ్యాస్ రీ ఫిల్లింగ్ చేస్తున్న కేంద్రంపై సీసీబీ పోలీసులు దాడులు నిర్వహించి ముగ్గురు నిర్వాహకులను అరెస్ట్ చేశారు.వారి నుంచి 116 గ్యాస్ సిలిండర్లు, రీఫిల్లింగ్ రాడ్‌లు, గ్యాస్ తూకం యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరహళ్లి ప్రధాన రహదారిలోని కోడిపాళ్య గోదాములో వంట గ్యాస్ సిలిండర్ల నుంచి కమర్షియల్ సిలిండర్లలోకి గ్యాస్‌ను రీ ఫిల్లింగ్ చేస్తున్నట్లు సీసీబీ పోలీసులకు పక్కాసమాచారం అందింది.
దీని ఆధారంగా బుధవారం దాడిచేసి నిర్వాహకులైన బాగేపల్లి తాలూకా చేలూరుకు చెందిన సునీల్‌కుమార్, కనకపుర పైప్‌లైన్ రోడ్డు నివాసి శివరాజు, గవిపురం గుట్టహళ్లికి చెందిన లక్ష్మణ్‌గౌడను అరెస్ట్ చేశారు. సిలిండర్లు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకొని నిందితులపై కెంగేరి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment