ఈ ఏడాది ప్చ్..!
ఈ ఏడాది ప్చ్..!
Published Thu, Jul 21 2016 11:43 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM
భర్తీకానీ విదేశీ విద్యార్థుల బీటెక్ అడ్మిషన్లు
నాక్ గుర్తింపు లేక ప్రవేశాలకు ఆటంకం
బాలాజీచెరువు(కాకినాడ) :
జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం కాకినాడలో చేరేందుకు విదేశీ విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. దాంతో నేషనల్ ఫారన్స్ సంఖ్య గణనీయంగా తగ్గింది. రెండు సంవత్సరాల్లో బీటెక్ ఇంజినీరింగ్‌లో ప్రవేశాలు లేక సీట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన నేషనల్ ఇనిస్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ వర్క్(ఎన్‌ఐఆర్‌ఎఫ్) విడుదల చేసిన ర్యాంక్‌లో 69వ ర్యాంక్ సాధించిన వర్సిటీ జేఎన్‌టీయూకేకు నాక్ గుర్తింపులేకపోవడంతో వీదేశీ విద్యార్థులు చేరడానికి వెనకడుగు వేస్తున్నారని వర్సిటీ అధికారులు చెబుతున్నారు. స్వీడన్, బ్యాంకాక్, అమెరికా వంటిదేశాల విశ్వవిద్యాలయాలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు నిర్వహిస్తున్న వర్సిటీ ఈ సీట్లను భర్తీ చేయడంతో విఫలమవుతోంది.
జేఎన్‌టీయూకే 2008లో అవిర్భవించింది. ఇక్కడ విద్యార్థులతో పాటు వీదేశీయులకు సీట్లు కేటాయించారు. ప్రధానంగా ఫారన్ నేషనల్స్(విదేశీ)విద్యార్థులు, నాన్ రెసిడెంట్ ఇండియన్ పీపుల్స్, పీపుల్ ఇండియా ఆరిజన్స్‌కు మొత్తం 300 సీట్లలో 15 శాతం కేటాయించారు. వీరిలో ఫారన్ నేషనల్స్‌కు ఐదు శాతం కేటాయించినా రెండేళ్ల నుంచి సీట్లు భర్తీకావడం లేదు. సాధారణంగా శ్రీలంక, నేపాల్, భూటాన్ వంటి దేశాల నుంచి బీటెక్, ఎంటెక్ డిగ్రీలు చదివేందుకు ఇక్కడికి వస్తుంటారు. ఒక విద్యార్థి సంవత్సరానికి దాదాపు రెండు లక్షల ఫీజు చెల్లిస్తాడు. బీటెక్‌లో 40 సీట్లు, ఎంటెక్, ఎంబీఏలో 25 సీట్లు కేటాయించినా సీట్లు అంతంతమాత్రంగానే భర్తీ అవుతున్నాయి.
అధికారుల వైఫల్యం..
విదేశీ విద్యార్థులను అకర్షించడంలో అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పవచ్చు. కేవలం నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియన్స్, పీపుల్ ఇంyì యన్ ఆరిజన్(పీఐవో) కేటగీరిల విద్యార్థులు కొంతవరకూ చేరడం గమనార్హం. వీటిలో మాత్రం నామమాత్రంగా సీట్లు నిండుతున్నాయి. ఎవరూ చేర కపోతే ఈ సీట్లు అలాగే ఖాళీగా ఉంచాలి తప్ప వేరేవారికి కేటాయించకూడదు. ఇలా వీదేశీ విద్యార్థులు లేక, మిగత వారికి కేటాయించక సీట్లు ఏళ్లతరబడి ఖాళీగా ఉంటున్నాయి.
గత ఐదు సంవత్సరాల ప్రవేశాలు.
సంవత్సరం కేటాయించిన సీట్లు భర్తీ అయిన సీట్లు
2010–11 45 30
2011–12 – 42
2012–13 – 10
2013–14 – 1
2014–15 – 0
2015–16 – 04
2016–17 – 0
Advertisement
Advertisement