కాంగ్రెస్‌కు మళ్లీ సున్నా..! | Congress All Set To Get Zero Again In Delhi Assembly Elections | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో కాంగ్రెస్‌కు మూడోసారి సున్నా..!

Published Wed, Feb 5 2025 9:19 PM | Last Updated on Wed, Feb 5 2025 9:21 PM

Congress All Set To Get Zero Again In Delhi Assembly Elections

న్యూఢిల్లీ:ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. పోలింగ్‌ ముగియగానే ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వెలువడ్డాయి. ఈసారి బీజేపీదే అధికారమని ఎగ్జిట్‌పోల్స్‌ తెలిపాయి. అయితే తమకు ఎగ్జిట్‌పోల్స్‌ ఎప్పుడూ అనుకూలంగా రాలేదని ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌) నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు పార్టీల విషయం కాసేపు పక్కనపెడితే గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని ఎగ్జిట్‌పోల్స్‌ చెబుతున్నాయి. 

2015,2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్కసీటు కూడా రాలేదు. ఈసారి కూడా ఆ పార్టీది ఇంచుమించు అదే పరిస్థితి ఉంటుందని ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతున్నాయి.దీంతో ఢిల్లీలోని ఆ పార్టీ శ్రేణులు నిరాశలో కూరుకుపోయారు. 

ఢిల్లీలో వరుసగా అధికారం చేపట్టిన తమకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని కాంగ్రెస్‌ శ్రేణులు ఆత్మపరిశీలిన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8న రానున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement