nil
-
నిల్వలు నిల్!
జిల్లాలో రూ. 50, రూ.100 విలువైన నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ల కొరత ఏర్పడింది. విజయవాడ సహా అన్ని ప్రధాన రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ సమస్య వేధిస్తోంది. స్టాంప్ వెండర్ల వద్ద కూడా నిల్వలు నిండుకోవడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఫలితంగా స్థిర, చరాస్థుల లావాదేవీలు చాలా వరకు తగ్గాయి. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా అధికారులు ఫ్రాంక్లింగ్ మెషిన్‌తో స్టాంపు వేసి ప్రస్తుత అవసరాలకు వినియోగిస్తున్నారు. సాక్షి, అమరావతి: రిజి్రస్టేషన్ల శాఖ జిల్లాలోని సబ్ రిజి్రస్టార్ కార్యాలయాలు, లైసెన్స్డ్ స్టాంపు వెండర్స్ ద్వారా దస్తావేజు పత్రాలు విక్రయిస్తుంది. ఈ స్టాంపు పత్రాలపైనే క్రయ, విక్రయ లావాదేవీలను రాసుకుని రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజి్రస్టేషన్లు చేయిస్తారు. అనామతుగానూ, బయానాగా ఇచ్చి పుచ్చుకునే వ్యవహారాలను సైతం ఈ పత్రాలపై రాసుకుంటుంటారు. ఎక్కువగా రూ.10, రూ. 20, రూ.50, రూ.100 ముఖ విలువతో స్టాంపు పత్రాలు వినియోగిస్తుంటారు. నెలకు రూ.35 లక్షల విక్రయాలు జిల్లాల్లో 28 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. అన్ని కార్యాలయలతో పాటు లైసెన్స్డ్ స్టాంప్ వెండర్స్ కూడా స్టాంపులు విక్రయిస్తారు. నెలకు సరాసరిన జిల్లాలో రూ.35 లక్షల విలువైన స్టాంపు పత్రాలు అమ్ముడవుతుంటాయి. వీటిలో రూ.50, రూ.100ల స్టాంపులు ఎక్కువగా గిరాకీ ఉంటుంది. నాసిక్‌లో ముద్రణ స్టాంపు పత్రాలు అధికారిక రాజ ముద్రతో మహారాష్ట్ర నాసిక్‌లో ఉన్న కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ముద్రణాలయంలో ముద్రిస్తారు. దక్షిణాది రాష్ట్రాలన్నింటికి ఈ ముద్రణా కేంద్రం నుంచే స్టాంపు పేపర్లు సరఫరా అవుతుంటాయి. ఎన్నికల ముందు నుంచి రాష్ట్రానికి సరిపడా స్టాంపు పత్రాలు ఆ కేంద్రం నుంచి రావటం లేదు. దీంతో కొన్ని రోజులుగా స్టాంపు పత్రాల కొరత తీవ్రమైంది. ఫలితంగా లావాదేవీలు నిలిచిపోతున్నాయి. రూ.100 విలువైన స్టాంపు పత్రాలు రాష్ట్ర వ్యాప్తంగా కొరత ఉన్నట్లు సమాచారం. రాజధాని నగరం విజయవాడలో కొంత మేరకు రూ.10, రూ.20 విలువైన స్టాంపు పత్రాలు లభిస్తుండగా రూ.50, రూ.100ల స్టాంపు పత్రాలు కొరత వేధిస్తోంది. గన్నవరం, నూజివీడు సబ్‌రిజిస్ట్రార్ వంటి గ్రామీణ ప్రాంత కార్యాలయాల్లో కొంతమేర లభిస్తుండటంతో నగర ప్రజలు అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఫ్రాంకింగ్ మెషిన్... ప్రభుత్వం రూ.10, రూ.20, రూ.50, రూ.100 ముఖ విలువతోనే స్టాంపు పత్రాలు విక్రయిస్తోంది. స్టాంపు డ్యూటీ ఎక్కువ మొత్తంలో అంటే ఉదాహరణకు రూ.10వేలు అంతకు మించిన విలువ మేరకు పత్రాలు కొనుగోలు చేయాలంటే స్టాంపు పత్రాలు పెద్ద సంఖ్యలో కావాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయంగా ఫ్రాంకింగ్ మెషిన్‌ను వినియోగిస్తున్నారు. ఒక తెల్లకాగితంపై కావాల్సినంత విలువను ముద్రించి ఇస్తారు. ఒక్క కాగితంపైనే ఒప్పందం రాసుకునేవారు ఈ విధానంలో పెద్ద మొత్తానికి తగిన విధంగా ఫ్రాంకింగ్ మిషన్ వినియోగిస్తారు. ఈ యంత్రాలు రిజి్రస్టార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయి. కొంతమంది లైసెన్స్డ్ వెండర్ల దగ్గరా ఈ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఫ్రాంకింగ్ యంత్రం వినియోగించి ముద్రించిన విలువకు సమానమైన నగదు వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం స్టాంపు పేపర్లు అందుబాటులో లేకపోవటంతో వీటిని ఉపయోగిస్తున్నారు. లావాదేవీలకు కష్టం... లావాదేవీల్లో చట్టపరమైనవే కాక కొన్ని అనధికారికంగా కూడా నడుస్తుంటాయి. అటువంటి వ్యవహారాలు ఫ్రాంకింన్ మెషిన్‌తో స్టాంపు విలువ ముద్రించుకోవటం వీలుపడదు. ఇటువంటి వ్యవహారాలకు స్టాంపుల కొరత తీవ్రంగా ఇబ్బందిపెడుతోంది. ఇటువంటి వారి అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని అందుబాటులో ఉన్న అరకొర పత్రాలను బ్లాక్‌లో కొందరు బ్రోకర్లు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. రూ.100 విలువ చేసే పత్రాలను విజయవాడ గాం«దీనగర్ సబరిజి్రస్టార్ కార్యాలయ పరిధిలో ఏకంగా రూ.150 నుంచి రూ.180ల దాకా అమ్ముతున్నారని ఓ వినియోగదారుడు వాపోయారు. కొరత లేకుండా చేస్తున్నాం.. కొన్ని ప్రాంతాల్లో స్టాంపుల కొరత ఉన్న మాట వాస్తవమే. ఆయా చోట్ల యుద్ధ ప్రాతిపాదికన అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే విజయవాడ గాం«దీనగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి కావాల్సిన స్టాంపులను పంపాం. జిల్లాలో అవసరమున్న చోట్లకు మిగులుగా ఉన్న ప్రాంతాలను నుంచి సర్దుబాటు చేసే కార్యక్రమం జరుగుతోంది. – శ్రీనివాస మూర్తి, డీఐజీ, రిజిస్ట్రేషన్ శాఖ, కృష్ణా జిల్లా -
బడిత బాజా
ఏలూరు (ఆర్ఆర్ పేట) : మౌలిక సదుపాయాల మాట లేదు. సమస్యల పరిష్కారంపై ఏమాత్రం దృష్టి లేదు. వేసవి సెలవులు పూర్తవడంతో ఎప్పటిలా పాత సమస్యలతోనే సోమవారం బడులు తెరుచుకున్నాయి. ఇరుకు గదుల్లో దుమ్ము, ధూళి విద్యార్థులకు స్వాగతం పలికాయి. ప్రభుత్వ పాఠశాలల్లో పలుచోట్ల బెంచీలు లేకపోవడంతో నేలబారు చదువులు తప్పని పరిస్థితి కనిపించింది. ఇటు సర్కారీ బడులతోపాటు అటు ప్రైవేట్ పాఠశాలల నిర్వా హకులు సైతం బడిత బాజా (మంచీచెడు అనే ఆలోచన లేకుండా) చందాన సావధానంగా బడి తలుపులు బార్లా తెరిచారు. దుమ్ము దులపలేదు.. నేలపై తప్పలేదు ప్రభుత్వ పాఠశాలల్లో పాత తరగతి నుంచి కొత్త తరగతి గదుల్లోకి విద్యార్థులు ఉత్సాహంగా తరలిరాగా సమస్యలు స్వాగతం పలి కాయి. చాలాచోట్ల తరగతి గదుల్లో దుమ్ము, ధూళిని దులపలేదు. బెంచీలన్నీ దుమ్ముకొట్టుకుపోయి దర్శనమిచ్చాయి. కొన్ని పాఠశాలల్లో బెంచీలు లేక చిన్నారులు నేలపైనే కూర్చోవాల్సి వచ్చింది. అక్కడక్కడా ఉపాధ్యాయులకూ ఇలాంటి పరిస్థితి తప్పలేదు. కొన్ని పాఠశాలల్లో తరగతి గదుల కొరత ఉండటంతో ఒకేచోట రెండు తరగతులు నిర్వహించడం కనిపించింది. తొలి రోజున అరకొరగానే విద్యార్థులు తరగతులకు హాజరుకాగా.. ఉపాధ్యాయులూ వారితో పోటీపడ్డారు. కొన్ని పాఠశాలల్లో శ్లాబులు పాడై వర్షం నీరు గదుల్లోకి చేరే పరిస్థితి కనిపించింది. పలుచోట్ల నూతన తరగతి గదులు నిర్మించినా ఫ్లోరింగ్, సున్నాలు వేయకపోవడంతో అక్కరకు రాలేదు. అరకొరగా పాఠ్య పుస్తకాలు జిల్లాలో 2,920 ప్రాథమిక, 490 ప్రాథమికోన్నత, 520 ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 3,930 ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి. వీటిలో సుమారు 3.20 లక్షల మంది విద్యార్థులు ఉండగా.. వారికి 14.74 పాఠ్యపుస్తకాలు అందించాల్సి ఉంది. ఇప్పటివరకు 8.70 లక్షల పాఠ్య పుస్తకాలు మాత్రమే వచ్చాయి. ఇంకా 40 శాతం పుస్తకాలు పాఠశాలలకు చేరుకోవాల్సి ఉంది. తమకు పుస్తకాలు ఇస్తారో లేక బయట కొనుక్కోమంటారోననే ఆందోళన విద్యార్థుల్ని వెంటాడుతోంది. బదిలీల టెన్షన్ ఉపాధ్యాయులు బదిలీల టెన్షన్లో ఉండటంతో పాఠ్యాంశాల బోధనపై ఇప్పట్లో దృష్టి సారించే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు రేషనలైజేషన్ ప్రకియ కొలిక్కి రాకపోవడంతో ఏ పాఠశాలలు ఉంటాయో.. ఏ పాఠశాలలో విలీనమవుతాయోననే ఉత్కంఠ తారస్థాయికి చేరుకుంది. తాము పనిచేస్తున్న పాఠశాలను ఉంచుతారో మూసేస్తారో అనే దిగులు.. మూసేస్తే తమకు ఎక్కడ స్థానం కల్పిస్తారో అనే అనుమానం ఉపాధ్యాయుల్ని వెంటాడుతున్నాయి. హేతుబద్ధీ్దకరణలో భాగంగా జిల్లాలో 129 పాఠశాలలు మూతపడనున్నాయని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ఇప్పటికీ స్పష్టత రాకపోవడం, హేతుబద్ధీకరణ పూర్తయ్యాకే బదిలీలు చేయాల్సి ఉండటం బోధనపై ప్రభావం చూపనుంది. ప్రైవేట్ స్కూళ్లది మరో దారి పైకి హంగులు కనిపిస్తున్నా ప్రైవేట్ పాఠశాల్లోని పరిస్థితులు సైతం సర్కారు బడులతో పోటీ పడుతున్నాయి. బెంచీల సమస్య లేకపోయినా.. ఇరుకు గదుల సమస్య ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థుల్ని వెంటాడుతోంది. కనీసం ఆడుకునేందుకు స్థలం లేక.. భోజనం చేసేందుకు జాగా లేక విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. అధిక శాతం ప్రైవేట్ స్కూల్స్ నివాస గృహాల్లాంటి గదులు, అపార్ట్‌మెంట్స్‌లో కొనసాగుతున్నాయి. కనీసం సైకిల్ పార్క్ చేసుకునే సదుపాయం లేని పాఠశాలలు అనేకం ఉన్నాయి. వీటిలో ఫీజుల మోత మాత్రం భారీగా మోగుతోంది. జిల్లాలో 1,129 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా.. వీటిలో 2.27 లక్షల మంది చదువుతున్నారు. వీరికి విరామ సమయంలో ఆడుకోవడానికి కనీసం క్రీడా ప్రాంగణాలు కూడా అందుబాటులో లేవు. -
అంతులేని నిర్లక్ష్యం
పెద్దాస్పత్రిలో వైద్యసేవలు మృగ్యం ఈఎన్టీ విభాగంలో హౌస్సర్జన్ల తీరుతో రోగుల అవస్థలు ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు అనంతపురం మెడికల్ : పేదోడికి జబ్బు చేస్తే వచ్చేది ప్రభుత్వ ఆస్పత్రికే. అదీ జిల్లాకే పెద్ద దిక్కుగా ఉన్న సర్వజనాస్పత్రికయితే రోజూ వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. కానీ ఇక్కడి వైద్యుల నిర్లక్ష్యంతో మెరుగైన వైద్యం మేడిపండు చందంగా మారుతోంది. హౌస్సర్జన్ల తీరయితే మరీ ఘోరం. ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని వైద్యంపై పట్టుపెంచుకోవాల్సిన వీరికి కనీసం రోగులను పట్టించుకునే ఓపికే ఉండదు. ప్రధానంగా సర్వజనాస్పత్రిలోని చెవి, ముక్కు, గొంతు (ఈఎన్టీ) విభాగంలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రోగులు నరకం అనుభవిస్తున్నారు. అటు ఈఎన్టీ వార్డుతో పాటు ఓపీ (ఔట్ పేషెంట్స్) గదిలోనూ గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి. చెవి, ముక్కు, గొంతు సమస్యలతో రోజూ వంద మందికి పైగా ఇక్కడికి వస్తుంటారు. వార్డు, థియేటర్, డ్రస్సింగ్, ఓపీ సేవల కోసం ప్రత్యేకంగా నలుగురు హౌస్‌సర్జన్లను కేటాయించారు. ఇక్కడి డాక్టర్లే సరిగా విధులు నిర్వర్తించని పరిస్థితి నెలకొని ఉండటంతో వారు కూడా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మంగళవారం పెద్ద సంఖ్యలో రోగులు ఓపీ చూపించుకుని డ్రస్సింగ్ కోసం ఎదురు చూస్తున్నా పట్టించుకునే వారు లేరు. ఓ మహిళా హౌస్‌సర్జన్ అయితే రోగులు నిరీక్షిస్తున్నట్లు గమనించినా అస్సలు పట్టించుకోకుండా వెళ్లిపోయారు. ఈమెను చూసిన కొందరు డ్రస్సింగ్ కోసం వచ్చామని, చూడాలని కోరినా విన్పించుకోకుండా డాక్టర్లున్న గదిలోకి వెళ్లి కబుర్లు చెప్పుకోవడం కన్పించింది. ఈఎన్టీ విభాగంలోనే సెమినార్ గది ఉంది. వైద్య విద్యార్థులకు ఈ విభాగపు సేవలపై వివరించాల్సి ఉంది. కానీ ఇక్కడ కూడా నిర్లక్ష్యమే. గంటల తరబడి ఓపీ బయటకే విద్యార్థులు గుమిగూడి ఉన్నారు. ఇదే సమయంలో ‘సాక్షి’ ఫొటోలు తీయడాన్ని గమనించి వారందరినీ సెమినార్ గదిలోకి పంపారు. కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన వారికి ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలను డాక్టర్లు చేయాల్సి ఉంటుంది. మంగళవారం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు వచ్చినా సుమారు గంట పాటు వారిని పట్టించున్న వారే లేరు. వార్డులోనూ మధ్యాహ్నం తర్వాత రోగులను పట్టించుకునే వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. సెలవులో విభాగాధిపతి ఈఎన్టీ విభాగాధిపతి డాక్టర్ నవీద్ దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు. దీంతో ఇక్కడి వైద్యులు, సిబ్బంది పనితీరు పర్యవేక్షించే వారు కరువయ్యారు. కొందరు డాక్టర్లు మధ్యాహ్నానికి ఇంటి ముఖం పట్టి.. సాయంత్రం బయోమెట్రిక్ కోసం మాత్రమే వస్తున్నారు. పట్టించుకునే వారే లేరయ్యా : వెంకటేశ్, అనంతపురం నాకు చెవి నొప్పి ఎక్కువగా ఉంది. పొద్దున్నే ఇక్కడికొచ్చి డాక్టర్లతో చూపించుకున్నా. చెవిలో క్లీన్ చేయాలని చెప్పారు. డ్రస్సింగ్ చేసే గది వద్దకు వెళితే ఎవరూ లేరు. గంటన్నర నుంచి ఈడే ఉన్నా. ఓ డాక్టరమ్మ వచ్చినా అటే వెళ్లిపోయింది. పలకరిస్తున్నా పట్టించుకోలేదు. బయట డబ్బులు పెట్టుకోలేకే కదయ్యా ఇక్కడికొచ్చేది. -
‘బోరు’మంటున్నారు!
- రోజురోజుకూ అడుగంటుతున్న భూగర్భ జలాలు - వేల సంఖ్యలో ఒట్టిపోయిన బోరుబావులు - కొత్త బోర్ల తవ్వకానికి రోజూ రూ.కోటిన్నర ఖర్చు - అయినా అన్నదాతలకు నిరాశే ధర్మవరం : ధర్మవరం మండలం నడిమిగడ్డపల్లికి చెందిన రైతు రమణ తనకున్న పొలంలో రెండెకరాల మేర ద్రాక్ష పంటను సాగుచేశాడు. పంట దిగుబడి బాగా ఉన్న సమయంలో ఉన్నట్లుండి బోరులో నీరు తగ్గిపోయింది. పంట ఎండుముఖం పట్టడంతో కాపాడుకోవడానికి రైతు తన పొలంలోనే మరోచోట బోరు వేయించాడు. దాదాపు రూ.1.50 లక్షలు ఖర్చు చేసి.. వెయ్యి అడుగుల మేర తవ్వించాడు. అయినా చుక్కనీరు పడలేదు. అంతటితో ప్రయత్నం ఆపలేదు. మరో నాలుగు బోర్లు వేయించి దాదాపు రూ.6లక్షలు ఖర్చు చేసి పంటను కాపాడుకున్నాడు. అయితే.. పంట దిగుబడి మొత్తం బోర్లకు పెట్టిన ఖర్చుకే సరిపోయింది. చెన్నేకొత్తపల్లి మండలం ప్యాదిండి గ్రామానికి చెందిన ముత్యాలరెడ్డి ఈ నెల 8వ తేదీన తన తోటలో 800 అడుగుల మేర బోరు వేయించాడు. నీళ్లు దాదాపు రెండున్నర ఇంచుల మేర పడ్డాయి. దీంతో ఆయన రూ.1.50 లక్షలు ఖర్చుపెట్టి కొత్త మోటారు తీసుకొచ్చి బిగించాడు.అయితే ఆ బోరులో నీరు కేవలం వారం రోజులు వచ్చి నిలిచిపోయాయి. రైతులు రమణ, ముత్యాలరెడ్డి మాత్రమే కాదు.. జిల్లావ్యాప్తంగా వేలాది మంది ఇదేవిధమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తీవ్ర వర్షాభావం వల్ల భూగర్భజలాలు అడుగంటిపోవడంతో బోర్లు ఒట్టిపోతున్నాయి. రైతన్నలు తమ పంటలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నమే చేస్తున్నారు. రూ.లక్షలు ఖర్చు చేస్తున్నా పాతాళగంగను పైకి తేలేకపోతున్నారు. ప్రతిరోజూ జిల్లాలో సగటున వంద బోర్లు వేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ధర్మవరం, రాప్తాడు, శింగనమల, కళ్యాణదుర్గం, కదిరి, రాయదుర్గం, పెనుకొండ నియోజకవర్గాల్లో భూగర్భజలాలు రోజురోజుకూ అడుగంటిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యాన పంటలను కాపాడేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. జిల్లాలో గత ఆరు నెలలుగా డీప్‌బోర్లు అధికంగా తవ్విస్తున్నారు. లోతులో నీరుపడితే చాలా రోజుల పాటు ఎండిపోకుండా ఉంటాయని భావిస్తున్న రైతులు చాలా మంది వెయ్యి అడుగుల మేర తవ్విస్తున్నారు. ఒక్కో డీప్ బోరు తవ్వకానికి రూ.1.30 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు ఖర్చవుతోంది. ఈ లెక్కన రోజుకు వంద బోర్లు తవ్వించేందుకు రూ.1.50 కోట్ల వరకు వెచ్చిస్తున్నారు. జనవరి నుంచి ఇప్పటి దాకా బోర్లు తవ్వించడానికి జిల్లా రైతులు దాదాపు రూ.135 కోట్లు ఖర్చు చేశారు. ఈ మూడు నెలల్లో రైతులు పెట్టిన ఖర్చుతో ఒక చిన్న ప్రాజెక్ట్ పూర్తి చేయొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వెయ్యి అడుగుల బోరు తవ్వకానికి రూ.1,22,000తో పాటు కేసింగ్ ఖర్చు ప్రతి అడుగుకు రూ.350 చొప్పున అవుతుంది. సాధారణ భూముల్లో అయితే 20 అడుగుల మేర కేసింగ్ వేస్తారు. ఇసుక నేలల్లో అయితే 50 నుంచి 100 మేర కేసింగ్ వేయాల్సి ఉంటుంది. అదేవిధంగా బోర్‌లారీ సిబ్బంది భోజనం, ట్రాన్స్‌పోర్టు ఖర్చులు రూ.3 వేల వరకు వస్తాయి. ఇదీ భూగర్భ జలాల పరిస్థితి వర్షాలు పడితే భూగర్భ నీటి మట్టం పెరుగుతుంది. లేదంటే తగ్గుతుంది. అయితే వరుస కరువులతో జిల్లాలో భూగర్భ జలాలు రోజురోజుకూ లోతుకు పడిపోతున్నాయి. ప్రస్తుతం 26.50 మీటర్ల లోతుకు పడిపోయాయి. డీప్ బోరు వేయడానికి అయ్యే ఖర్చు అడుగులు ధర (అడుగుకు) ఖర్చు 1–300 రూ.75 రూ.22,500 300–400 రూ.85 రూ.8,500 400–500 రూ.95 రూ.9,500 500–600 రూ.115 రూ.11,500 600–700 రూ.135 రూ.13,500 700–800 రూ.175 రూ.17,500 800–1000 రూ.195 రూ.39,000 -
బ్యాంకుల్లో నగదు నిల్!
* ప్రజలకు తీవ్ర ఇక్కట్లు * పనిచేయని ఏటీఏంలు * బ్యాంకుల్లో నిలిచిన లావాదేవీలు * సోమవారం వరకు డబ్బులు వచ్చే అవకాశం లేదంటున్న బ్యాంకర్లు సాక్షి, అమరావతి బ్యూరో : పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజల కష్టాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. బ్యాంకులను డబ్బు కొరత పట్టి పీడిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎక్కువ శాతం ఏటీఎంలు తెరుచుకోలేదు. బ్యాంకులకు వెళ్ళిన ఖాతాదారులకు చుక్కెదురవుతోంది. డబ్బు లేదని విత్‌డ్రాలకు చాలా బ్యాంకులు అనుమతించలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారానికి విత్‌డ్రాల పరిమితి తగ్గించడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అత్యవసర పనులకు డబ్బులు అవసరమైతే తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. బ్యాంకుల వద్ద పడిగాపులు కాసిన ప్రజలకు ‘డబ్బులు వస్తే ఇస్తాం.. లేకపోతే మేమేం చేస్తాం’ అని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో ప్రజలు మధ్యాహ్నం 2 గంటల వరకు నిరీక్షించి బాధతో వెళ్ళిపోతున్నారు. ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంకు వంటి ప్రధాన బ్యాంకులు విత్‌డ్రాలకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి నెలకొందంటే , డబ్బు కొరత జిల్లాలో ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజు ప్రైవేటు చిన్న బ్యాంకులకు కనీసం రూ.3 లక్షలైనా ఇచ్చేవారు. ఈరోజు లీడ్ బ్యాంకు వద్ద డబ్బు నిల్వలు లేకపోవడంతో ప్రైవేటు బ్యాంకులకు డబ్బు సరఫరా జరగలేదు. ఈ నేపథ్యంలో పలుచోట్ల లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. పనిచేసిన అరకొర ఏటీఎంల నుంచి సైతం రూ.2000 నోట్లు రావడంతో చిల్లర దొరకక, ఈ నోటు ఏం చేసుకోవాలంటూ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరింత పెరగనున్న కష్టాలు... ఆర్బీఐ నుంచి జిల్లాకు సోమవారం వరకు డబ్బులు వచ్చే అవకాశం లేదని బ్యాంకు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఒకవేళ వచ్చినా అవి బ్యాంకులకు సరఫరా అయి, ప్రజలకు పంపిణీ అయ్యేసరికి మంగళవారం వరకు పడుతుందని తెలుస్తోంది. దీంతో ప్రజల డబ్బు కష్టాలు మరింత పెరిగే అవకాశముంది. ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు చెల్లించాలంటే కోట్ల రూపాయలు అవసరం. అరకొరగా వచ్చే డబ్బు ఒకట్రెండు రోజుల్లోనే అయిపోతోంది. మరోపక్క కేంద్ర ప్రభుత్వం రకరకాల నిబంధనలను ప్రకటిస్తోంది. దీంతో ఏ రోజు ఎలాంటి కొత్త నిబంధనలు అమలుల్లోకి వస్తాయోనని జనం హడలిపోతున్నారు. -
నల్లా.. నీరు నిల్లే..!
రూపాయి కనెక్షన్‌కు కుప్పలుగా దరఖాస్తులు రెండు నెలలుగా ఎదురుచూస్తున్న ప్రజలు ఉన్న కనెక్షన్లకే నీళ్లు లేవు.. కొత్త వాటికెలా.. తర్జన భర్జన పడుతున్న అధికారులు విలీన పంచాయతీలకు విస్తరించని పైపులు ఖమ్మం : మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ స్థాయికి.. ఒక్క రూపాయికే నల్లా.. కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు.. రెండు నెలలు గడిచినా దిక్కులేని కనెక్షన్లు.. ఉన్నవాటికే రెండు మూడు రోజులకోసారి నీరు.. ఏళ్ల నాటి పైపులైన్లు.. విలీన పంచాయతీలకు విస్తరించని పైపులు.. లీకేజీలు.. మరమ్మతులు.. ఆర్భాటంగా ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ అంటూ గుప్పించిన నేతల హామీలు నీటి మూటలుగానే మిగిలాయి. కనెక్షన్ కోసం డబ్బులు కట్టిన వారికి తొందరేమిటంటూ కార్పొరేషన్ అధికారుల ఈసడింపులు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో నిరుపేదలకు ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో నగర మేయర్ పాపాలాల్, కమిషనర్, కార్పొరేటర్లు ఆయా డివిజన్లలో రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తామని ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. దరఖాస్తు చేసుకున్న వెంటనే నల్లా బిగిస్తామని నిరుపేదలకు హామీ ఇచ్చారు. నల్లా కనెక్షన్లు లేని వారు దరఖాస్తు చేసుకునేందుకు అధికారుల వద్దకు వస్తే.. ఇంటి పన్నులు సక్రమంగా చెల్లించిన వారికే కనెక్షన్ ఇస్తామని మెలిక పెట్టారు. దీంతో అప్పో సప్పో చేసి ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఇంటి పన్నుల బకాయిలు చెల్లించారు. ఒక్క రూపాయి నల్లా కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. జూన్ నుంచి దరఖాస్తులు స్వీకరించడం మొదలు పెట్టారు. ఇప్పటివరకు సుమారు 1,200లకు పైగా దరఖాస్తులు వచ్చాయి. కాగా.. రూపాయి నల్లా కనెక్షన్ గురించి అంతగా పట్టించుకోవడం లేదని.. డబ్బులు కట్టి కనెక్షన్ తీసుకునే వారికే ఆలస్యమవుతుంది.. మీకేం తొందర అంటూ పలువురు అధికారులు చీదరించుకుంటున్నారని నగర ప్రజలు ఆరోపిస్తున్నారు. రెండు నెలలు దాటినా.. ఇప్పటివరకు 300 కనెక్షన్లు మాత్రమే మంజూరు చేయగా.. వీటిలో 100 కనెక్షన్లు కూడా పూర్తిస్థాయిలో ఇవ్వకపోవడం గమనార్హం. కనెక్షన్లు సరే.. నీరెలా? రూపాయికే నల్లా కనెక్షన్ వస్తుందని భావించిన నగర ప్రజలు పోటీపడి దరఖాస్తు చేసుకున్నారు. ఈ పథకంలో గ్రీన్ జోన్ అంటే.. పైపులైన్, నీటి సరఫరా సక్రమంగా ఉన్న ప్రాంతం. బ్లూజోన్ అంటే.. నీటి వసతి ఉండి పైపులైన్లు లేని ప్రాంతం. రెడ్ జోన్ కింద పైపులైన్ లేకుండా, నీటి సరఫరా లేకుండా ఉన్న ప్రాంతాలను గుర్తించారు. అయితే విలీన పంచాయతీలను కలుపుకొని నగరంలో 54వేల ఇళ్ల పరిధిలో 3.9లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. ప్రస్తుతం 32వేల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. వీరికి రోజుకు ఒక్కొక్కరికి 150 లీటర్ల చొప్పున నీటిని సరఫరా చేయాలి. అంటే సుమారు 60 మిలియన్ లీటర్ల నీరు కావాలి. కానీ.. నగరానికి నీరు సరఫరా చేసే విభాగం ద్వారా కేవలం రోజుకు 40 మిలియన్ల లీటర్లు మాత్రమే సరఫరా చేసే సామర్థ్యం ఉంది. ఇప్పుడున్న కనెక్షన్లకే రెండు.. మూడు రోజులకోమారు నీటిని సరఫరా చేయడం ఇబ్బందిగా ఉంటుంది. అలాగే నగరంలోని అన్ని ప్రాంతాలకు నీరు సరఫరా చేయాలంటే 500 కిలోమీటర్ల పొడవున పైపులైన్లు వేయాలి. కానీ.. ఇప్పటి వరకు కేవలం 230 కిలో మీటర్ల మాత్రమే పైపులైన్లు ఉన్నాయి. అంటే 270 మీటర్ల పైపులైన్ లేకుండా.. నీరు సరఫరా చేయడం ఏలా సాధ్యమని అధికారులు అంటున్నారు. గత ఏడాది తాగునీటి కోసం మంజూరైన రూ.74కోట్లతో చేపట్టిన పనుల్లో సరితా క్లినిక్ నుంచి బోనకల్ రోడ్డు వరకు పైపులైన్ వేయకుండా పాత పైపులైన్‌కే కనెక్షన్ ఇచ్చారు. దీంతో అది తరచూ పగలడం, అది వర్షపు నీరు, ఇతర డ్రెయినేజీ నీటితో కలవడంతో కలుషిత నీటిని సరఫరా చేయడం.. అదీ కూడా రెండు మూడు రోజుల తర్వాత మరమ్మతులు చేయాల్సి వస్తోంది. ఇలా విలీన పంచాయతీలు అల్లీపురం, దంసులాపురం, శ్రీనగర్ కాలనీతోపాటు నగరంలోని ఎత్తు ప్రాంతాలైన రమణగుట్ట, రంగనాయకులగుట్ట, బ్యాంక్ కాలనీ ప్రాంతాలకు సక్రమంగా పైపులైన్లు లేవు. ఎగువ ప్రాంతాల్లో ఇళ్లు ఉండటం వల్ల పైకి నీరు వెళ్లేంత ప్రెషర్ లేదు. ఉన్న పైపులైన్లు ఎప్పుడు లీకేజీ అవుతూనే ఉంటాయి.. ఇటువంటి పరిస్థితిలో రూపాయి నల్లా కనెక్షన్ ముందుకు సాగాలంటే ముందుగా పైపులైన్లు వేయడం.. నీటి సామర్థ్యం పెంపు చేపట్టాల్సి ఉంటుంది. అందుకే కొత్త కనెక్షన్లకు ఏ విధంగా నీరు ఇవ్వాలనే ఆలోచనలో అధికారులు, ప్రజాప్రతినిధులు తర్జన భర్జన పడుతున్నారు. -
డిస్కౌంట్లు ఇస్తున్నా... కొనేవారు కరువు!
బంగారం ధరలు మరింత తగ్గుతాయన్న ఆలోచనలో కస్టమర్లు ♦ కేంద్రం వచ్చే బడ్జెట్లో పుత్తడి దిగుమతి సుంకం తగ్గిస్తుందని ఆశలు ♦ ఔన్స్‌కు 25 డాలర్లమేర డిస్కౌంట్నిస్తున్న జ్యువెలరీ రిటైలర్లు ♦ అయినా పసిడి కొనుగోళ్లు నిల్! ముంబై: అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు కారణంగా పుత్తడి ధర పెరుగుతున్నా, వినియోగదారులు మాత్రం బంగారం, ఆభరణాల కొనుగోళ్లకు పెద్దగా ఆసక్తి కనపర్చడం లేదు. దేశంలో పలు ప్రాంతాల్లో కస్టమర్లని ఆకర్షించేందుకు జ్యువెలరీ షాపులు భారీగా డిస్కౌంట్లు ఇస్తున్నా కూడా బంగారానికి వినియోగ డిమాండ్ పెరగడం లేదు. వినియోగదారులు మాత్రం బంగారం కొనుగోలు విషయంలో ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు. కేంద్రం రానున్న బడ్జెట్లో బంగారం దిగుమతి సుంకాన్ని తగ్గిస్తుందనే వార్తల నేపథ్యంలో.. జ్యువెలర్స్ పసిడి ధరలను తగ్గిస్తున్నప్పటికీ కూడా కస్టమర్లు ఆభరణాల కొనుగోలుకు దూరంగా ఉంటున్నారని ట్రేడర్లు వాపోతున్నారు. కొనుగోళ్లు లేవు.. బంగారానికి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి కొనుగోళ్లు జరగడంలేదని ఎంఎన్సీ బులియన్ డెరైక్టర్ దమన్ ప్రకాశ్ రాథోడ్ తెలిపారు. ఈయన చెన్నైలో బంగారాన్ని హోల్‌సెల్ ధరకు విక్రయిస్తారు. పసిడి విక్రయాల పెరుగుదలకు, కస్టమర్లను ఆకర్షించడానికి డీలర్లు అధిక మొత్తం డిస్కౌంట్లు ఇస్తున్నా కూడా కొనుగోలుదారుల నుంచి స్పందన కరువైందని తెలిపారు. లండన్ బంగారం ధరలపై ప్రీమియంను చార్జ్ చేసే భారతీయ బంగారం విక్రయదారులు కూడా ప్రస్తుతం ఔన్స్‌కు(31.1గ్రాములు) 25 డాలర్లమేర డిస్కౌంట్‌ను అందిస్తున్నాయి. అంటే 10 గ్రాముల బంగారం ధరపై దాదాపు రూ.500 వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు. మంగళవారం రోజు ఏ చిన్న పుత్తడి ఆభరణాన్ని కూడా విక్రయించలేదని జవేరి బజార్‌లోని ఒక జ్యువెలర్ తెలిపారు. ఆఖరికి బంగారపు 9 ధరల పరిస్థితి ఎలా ఉందని కస్టమర్లు ఎలాంటి విచారణ కూడా చేయడం లేదని పేర్కొన్నారు. ఈ ఏడాది బంగారం ధరలు 13 శాతం పెరిగాయని, ఇది పసిడి డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపించిందని కొందరు రిటైల్ కొనుగోలుదారులు అభిప్రాయపడ్డారు. డిమాండ్ పెరగొచ్చు! పెళ్లిళ్ల సీజన్ వల్ల బంగారం డిమాండ్ వ్యూహాత్మకంగా పెరిగే అవకాశం ఉంది. అయినా కూడా చాలా మంది కస్టమర్లు వచ్చే కాలంలో ధరలు మరింత తగ్గొచ్చనే అంచనాల వల్ల పసిడి కొనుగోలుకు దూరంగా ఉండే పరిస్థితులు లేకపోలేదు. కాగా గత రెండు రోజులుగా అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు ఒక్కసారిగా ఔన్స్‌కు 1,200 డాలర్లకు పైగా పెరిగాయి. ఈ చర్య పుత్తడి డిమాండ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపొచ్చు. బంగారం దిగుమతి సుంకం తగ్గేనా? కేంద్ర ప్రభుత్వం ఈ నెల చివరిలో (ఫిబ్రవరి 29) 2016-17 సంవత్సరానికి గానూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నది. ప్రభుత్వం ఈ బడ్జెట్లో పుత్తడిపై దిగుమతి సుంకాన్ని 10 శాతంమేర తగ్గిస్తుందని జ్యువెలరీ పరిశ్రమ అంచనా వేస్తోంది. ఇదే జరిగితే సరఫరా పెరిగి బంగారం ధరలు తగ్గే అవకాశముంది. గతేడాది బడ్జెట్ ముందు కూడా పసిడి ధరలు తగ్గాయి.