సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో ప్రత్యక్ష నియామకాల పద్ధతిలో 272 పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్ జారీ అయింది. మేనేజ్‌మెంట్ ట్రైనీ(మైనింగ్) పోస్టులు 139, మేనేజ్‌మెంట్ ట్రైనీ(ఎఫ్ అండ్ ఏ) పోస్టులు 22, మేనేజ్‌మెంట్ ట్రైనీ(పర్సనల్) పోస్టులు 22, మేనేజ్‌మెంట్ ట్రైనీ(ఐఈ) పోస్టులు 10, జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ పోస్టులు 10, మేనేజ్‌మెంట్ ట్రైనీ(హైడ్రో–జియాలజిస్ట్) పోస్టులు 2, మేనేజ్‌మెంట్ ట్రైనీ(సివిల్) పోస్టులు 18, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ పోస్టులు 3, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు 30, సబ్–ఓవర్సీస్ ట్రైనీ(సివిల్) పోస్టులు 16 ఇందులో ఉన్నా యి.
మార్చి 1 నుంచి 18 వరకు ఆన్‌లైన్‌లో దర ఖాస్తులను స్వీకరించనున్నారు. వైద్యాధికారి పోస్టు మినహా మిగిలిన పోస్టులకు గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లు. వైద్యాధికారి పోస్టుకు గరిష్ట వయోపరిమితి 45 ఏళ్లు. అన్ని పోస్టుల విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ల గరిష్ట వయోపరి మితి మినహాయింపు వర్తిస్తుంది. సింగరేణి ఉద్యోగులకు మాత్రం ఎలాంటి వయోపరిమితి లేదు. పూర్తి వివరాల కోసం మార్చి 1 నుంచి సింగరేణి సంస్థ వెబ్‌సైట్ (https://scclmin es.com) లోని ‘కెరీర్’విండోను సందర్శించాలని సంస్థ యాజమాన్యం సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment