‘చిరు’ దోసెకు పేటెంట్
చిరంజీవి దోసె గురించి తెలుసా? అదేంటి చిరంజీవి సినిమాలు తెలుసు, అందులో డ్యాన్సులు, డైలాగులు తెలుసు గానీ ఈ దోసేమిటబ్బా అనుకుంటున్నారా! త్వరలో ఈ దోసెకు పేటెంట్ కూడా రానుంది. హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్, రజనీకాంత్, సచిన్ టెండూల్కర్ - ఇలా ఎంతో మంది ప్రముఖులు ఈ దోసె టేస్ట్‌కు ఫిదా అయిపోయారు. చిరంజీవి ఈ దోసెను మైసూరులో షూటింగ్ సమయంలో ఓ దాబాలో తిన్నారట. దాని టేస్ట్‌కు ఫిదా అయిపోయి, ఆ హోటల్‌వాడిని బతిమాలారు.
అతను ఆ వంట రహస్యం చెప్పక పోయినా, ప్రయోగాలు చేసి మరీ నేర్చుకున్నారు. అప్పటి నుంచి అది ‘చిరంజీవి దోసె’గా అతిథులందరికీ సుపరిచితమే. చిరంజీవి షష్టిపూర్తి సందర్భంగా ఆయన తనయుడు రామ్‌చరణ్ ఈ దోసెకు పేటెంట్ తీసుకోవాలని అనుకుంటున్నారు.