chiranjeevi dosa
-
తారల పేర్లతో తినే పదార్థాలు
సాక్షి, న్యూఢిల్లీ : ‘వేడి వేడి దీపికా పదుకోన్ దోశ, పసందైన దోశ!’ అని వినబడగానే ఒక్క ఆమె అభిమానులకే కాకుండా ఎవరికైనా నోట్లో నీళ్లూరుతాయేమో! అమెరికాలోని ఆస్టిన్‌లో ‘దోశ లాబ్స్’ హోటల్లో పశ్చిమిరపకాయలు, ఆలు కుర్మాతో కూడిన ‘దీపికా పదుకోన్ దోశ’ను విక్రయిస్తున్నారంటూ వార్త ఒకటి జనవరి ఒకటవ తేదీన వైరల్ అయింది. దాంతో భారత్‌లోని పుణెలో ఆమె పేరుతో ‘పరంతా తాళి’ అంటూ భోజనాన్ని విక్రమిస్తున్నారంటూ ట్వీట్లు వెలువడ్డాయి. ఆ మాటకొస్తే ఆమె ఒక్కదాని పేరు మీదనే కాకుండా పలువురు సినీ తారల పేర్ల మీద భారత్‌లోని పలు ప్రాంతాల్లో పలు హోటళ్లు తిను బండారాలు విక్రయిస్తున్నారు. కొందరైతే సినీ తారలు సినిమాల్లో నటించిన పాత్రల పేరిట కూడా తినుబంఢారాలను విక్రయిస్తున్నారు. ముంబైలోని నూర్ మొహమ్మది హోటల్లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పేరు మీద ‘చికెన్ సంజూ బాబా’ను విక్రయిస్తున్నారు. 95 ఏళ్ల పురాతనమైన ఆ హోటల్ యజమాని ఖలీద్ హకీమ్, సంజయ్‌తో తనకున్న అనుబంధానికి గుర్తుగా ఆ పేరు పెట్టుకున్నారు. ఆ హోటల్లో 1986లో కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్యామిలీ సెక్షన్‌ను సంజయ్ దత్ రిబ్బన్ కట్‌చేసి ప్రారంభించారు. అప్పడు సంజయ్‌కి హోటల్ యజమాని ఓ చికెన్ డిషన్‌ను సర్వ్ చేశారు. అప్పటి నుంచి ఆ డిష్‌కు ఆయన పేరే పెట్టారు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారన్న కేసులో మూడేళ్ల జైలు నిర్బంధం అనంతరం 2016, పిబ్రవరిలో సంజయ్ విడుదలైనప్పుడు ఈ హోటల్ యజమాని 12 గంటలపాటు చికెన్ సంజు బాబా డిష్‌ను ఉచితంగా ప్రజలకు పంచి పెట్టారు. ముంబైలోని ‘అర్బన్ తడ్కా’ హోటల్లో బాలివుడ్ నటుడు ఓం పురి పేరిట ‘మటన్ సాగ్‌వాలా’ను కొన్నేళ్లుగా విక్రయిస్తున్నారు. పాలకూరతో చేసిన ఆ మటన్‌ను తినేందుకు ఓం పురి తరచుగా ఆ హోటల్‌కు వచ్చేవారట. అందుకు ఆ పేరు పెట్టారట. బాండ్రాలోని శాంటే హోటల్లో బాబీ డియోల్ పేరుతూ ‘బాబీ కేక్‌ను విక్రయిస్తున్నారు. బాబీ డియోల్, ఆయన కుటుంబం ఆ హోటల్‌కు తరచూ వచ్చి ఆ కే క్లు తినేవారట. అలా ఆయన పేరూ అలా స్థిర పడింది. 2013లో వచ్చిన ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై దుబారా!’ అక్షయ్ కుమార్ నటించిన పాత్ర పేరు ‘షోయబ్దిని’ ఓమన్ రిసార్ట్‌లోని ఓ కాక్టెయిల్కు పెట్టారు. చిరు దోశ కూడా! తెలుగు సినీ నటుడు చిరంజీవి పేరిట తెలగునాట నూనే లేకుండా ఆవిరి మీద ఉడికించే ‘చిరు దోశ’ కూడా చెలామణì లో ఉంది. ఆన్లైన్లో ఎక్కువగా కనిపించే ఈ దోశ హైదరాబాద్‌లోని చిరంజీవి ఇంటి నుంచే పాకిందట. 2015లో ఈ దోశపై పేటెంట్ హక్కులు పొందేందుకు ఆయన కుమారుడు రామ్ చరణ్ ప్రయత్నించారట. మైసూర్‌లోని ఓ చిన్న ఫుడ్ కార్నర్లో ఈ దోశను చిరంజీవి కనిపెట్టారట. హైదరాబాద్‌లోని ‘చట్నీస్’ కూడా కొంతకాలం ‘చిరంజీవి దోశ’ అంటూ స్టీమ్డ్ దోశను చెలామణి చేసింది. -
‘చిరు’ దోసెకు పేటెంట్
చిరంజీవి దోసె గురించి తెలుసా? అదేంటి చిరంజీవి సినిమాలు తెలుసు, అందులో డ్యాన్సులు, డైలాగులు తెలుసు గానీ ఈ దోసేమిటబ్బా అనుకుంటున్నారా! త్వరలో ఈ దోసెకు పేటెంట్ కూడా రానుంది. హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్, రజనీకాంత్, సచిన్ టెండూల్కర్ - ఇలా ఎంతో మంది ప్రముఖులు ఈ దోసె టేస్ట్‌కు ఫిదా అయిపోయారు. చిరంజీవి ఈ దోసెను మైసూరులో షూటింగ్ సమయంలో ఓ దాబాలో తిన్నారట. దాని టేస్ట్‌కు ఫిదా అయిపోయి, ఆ హోటల్వాడిని బతిమాలారు. అతను ఆ వంట రహస్యం చెప్పక పోయినా, ప్రయోగాలు చేసి మరీ నేర్చుకున్నారు. అప్పటి నుంచి అది ‘చిరంజీవి దోసె’గా అతిథులందరికీ సుపరిచితమే. చిరంజీవి షష్టిపూర్తి సందర్భంగా ఆయన తనయుడు రామ్‌చరణ్ ఈ దోసెకు పేటెంట్ తీసుకోవాలని అనుకుంటున్నారు. -
చిరంజీవి దోశ.. ఉలవచారు
‘హైదరాబాద్ వస్తే చట్నీస్‌లో ‘చిరంజీవి దోశ’ను టేస్ట్ చేయకుండా వెళ్లను. ఈ హోటల్లో తయారయ్యే ఓ దోశను చిరంజీవి అమితంగా ఇష్టపడేవారు. దీంతో అది చిరంజీవి దోశగా మెనూలో టాప్ ప్లేస్ కొట్టేసింది’ అంటూ సిటీ గురించి తన స్వీట్‌మెమరీస్ కలబోసుకుంది నటీమణి సుహాసిని. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, కన్నడ వెండితెరలపై అందమైన హాసంతో చెరగని ముద్ర వేసిన ఆమె.. ఓ కార్యక్రమంలోపాల్గొనేందుకు సిటీకి వచ్చినప్పుడు ‘సాక్షి సిటీప్లస్’తో ఈ బ్యూటీఫుల్ సిటీ గురించి చేసిన స్వీటీ చిట్‌చాట్.. ..:: వాంకె శ్రీనివాస్ మంచుపల్లకి సినిమా షూటింగ్ కోసం 1982లో తెల్లవారుజామున ఆరు గంటలకే చెన్నై నుంచి హైదరాబాద్‌కి ఫ్లయిట్లో వచ్చా. అదే ఫస్ట్ టైమ్. నగరం మంచు దుప్పట్లో ఉంది. నాకు అప్పటికి తెలుగు, హిందీ రావు. లక్డీకాపూల్‌లోని అశోక హోటల్లో దిగా. ఆ తర్వాత జర్నలిస్ట్ కాలనీలోని ఓ భవనంలో షూటింగ్.. చిరంజీవిని తొలిసారి చూడటం అదే. ఆ సమయంలో జర్నలిస్ట్ కాలనీవాసులు చూపిన ఆప్యాయత ఓ స్వీట్ మెమరీ. రోజూ సాయంత్రం డిన్నర్‌కు ఆహ్వానించే వాళ్లు. అప్పుడే సిటీలో మా పిన్నివాళ్లు ఉంటున్నారన్న విషయం తెలిసింది. నేను ఉంటున్న అశోక హోటల్‌కు సమీపంలోనే వాళ్ల ఇల్లు.. కాలినడకన అక్కడికి వెళ్లి కాలక్షేపం చేసేదాన్ని. అప్పుడు ఫిల్మ్‌నగర్ లేదు. ఏఎన్నార్ ఆహ్వానం ఇక్కడకు వచ్చినప్పుడల్లా నిర్మాత హరికృష్ణ కుటుంబసభ్యులతో సరదాగా గడిపేదాన్ని. దివంగత హీరో నాగేశ్వరరావు జూబ్లీహిల్స్లోనే ఉండేవారు. నేకిక్కడకు వచ్చిన ప్రతిసారీ ఏఎన్నార్ తన ఇంటికి ఆహ్వానించే వారు. చాలా ఏళ్ల క్రితం పై మాటే.. ఏఎన్నార్ గారి ఇంటికి వెళ్లినపుడు నాగార్జున గురించి ప్రస్తావన వచ్చింది. అమెరికాలో ఇంజనీరింగ్ చదువుతున్న నాగార్జునను సినిమాల్లోకి తేవడం ఇష్టం లేదని నాగేశ్వరరావు నాతో చెప్పారు. అయితే బంధువులు, స్నేహితులు హీరోను చేయాలని పట్టుబడుతున్నారని అన్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన నాగార్జునతోపరిచయమైంది.అంతా కాస్మొటిక్ కల్చర్ హైదరాబాద్ నెలకు రెండుసార్లు వస్తుంటాను. అప్పట్లో ఇక్కడ తెలుగు కల్చర్ కళ్లకు కట్టేది. ఇప్పుడు కాస్త కాస్మొటిక్ కల్చర్ పెరిగినట్టుంది. అప్పట్లో ఎటు చూసినా పచ్చని చెట్లే.. ఇప్పుడా వాతావరణం లేదు. సిటీకి వచ్చిన ప్రతిసారి చట్నీస్ నుంచి చిరంజీవి దోశ తెప్పించుకొని టేస్ట్ చేస్తా. ఉలవచారు కనిపిస్తే లొట్టొలేస్తూ తాగేయాల్సిందే. గ్రీన్‌పార్క్ హోటల్లో ఆచారి వెజిటబుల్ (తెలుగులో ‘ఊరగాయ’ అంటారు) రుచి చూడనిదే ఈ సిటీ నుంచి తిరిగి వెళ్లను. చెన్నై తర్వాత నా ఫేవరెట్ సిటీ హైదరాబాదే. తెలుగుదనం ఉట్టిపడే, అందానికి వన్నెతెచ్చే కాటన్ చీరలను ఈ సిటీలోనే కొంటా. బంజారాహిల్స్‌లోని తూతూ తనేజా కాటన్ చీరలంటే చచ్చేంత ప్రాణం నాకు. బ్యూటీఫుల్ బిల్డింగ్స్.. ఈ సిటీలో భవనాలు అందంగా ఉంటాయి. నృత్య ప్రదర్శన నిమిత్తం వచ్చినపుడు ఫలక్‌నుమా ప్యాలెస్ చూశా. వాహ్.. నిర్మాణశైలి కట్టిపడేసింది. మొఘల్ తరహా నిర్మాణశైలి భవనాల సౌందర్యం చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. ముస్లింల సంప్రదాయ శైలి నిర్మాణాలు భలే కళాత్మకంగా ఉంటాయి. తొలినాళ్లలో ఇక్కడకు వచ్చిన ప్రతిసారీ బ్యాంగిల్స్ కోసం చార్మినార్‌కు పరుగెత్తేదాన్ని. సినిమాల్లో పేరొచ్చాక.. వెళ్లడం తగ్గించా.. అభిమానుల తాకిడి తట్టుకోలేక!. నేను హీరోయిన్గా చేసినపుడు తెలుగు వారు ఎలా అభిమానించారో ఇప్పటికీ అదే అభిమానం చూపుతున్నారు. ఫేస్బుక్లో ఫొటోలు అప్లోడ్ చేయాలని తరచూ అడుగుతుంటారు.