చిరంజీవి దోశ.. ఉలవచారు | chiranjeevi dosa... ulavacharu | Sakshi
Sakshi News home page

చిరంజీవి దోశ.. ఉలవచారు

Published Wed, Jan 7 2015 8:00 AM | Last Updated on Sat, Sep 2 2017 7:19 PM

చిరంజీవి దోశ.. ఉలవచారు

చిరంజీవి దోశ.. ఉలవచారు

‘హైదరాబాద్ వస్తే చట్నీస్‌లో ‘చిరంజీవి దోశ’ను టేస్ట్ చేయకుండా వెళ్లను. ఈ హోటల్‌లో తయారయ్యే ఓ దోశను చిరంజీవి అమితంగా ఇష్టపడేవారు. దీంతో అది చిరంజీవి దోశగా మెనూలో టాప్ ప్లేస్ కొట్టేసింది’ అంటూ సిటీ గురించి తన స్వీట్‌మెమరీస్ కలబోసుకుంది నటీమణి సుహాసిని. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, కన్నడ వెండితెరలపై అందమైన హాసంతో చెరగని ముద్ర వేసిన ఆమె.. ఓ కార్యక్రమంలోపాల్గొనేందుకు సిటీకి వచ్చినప్పుడు ‘సాక్షి సిటీప్లస్’తో ఈ బ్యూటీఫుల్ సిటీ గురించి చేసిన స్వీటీ చిట్‌చాట్..  
 ..:: వాంకె శ్రీనివాస్
 
 మంచుపల్లకి సినిమా షూటింగ్ కోసం 1982లో తెల్లవారుజామున ఆరు గంటలకే చెన్నై నుంచి హైదరాబాద్‌కి ఫ్లయిట్‌లో వచ్చా. అదే ఫస్ట్ టైమ్. నగరం మంచు దుప్పట్లో ఉంది. నాకు అప్పటికి తెలుగు, హిందీ రావు. లక్డీకాపూల్‌లోని అశోక హోటల్‌లో దిగా. ఆ తర్వాత జర్నలిస్ట్ కాలనీలోని ఓ భవనంలో షూటింగ్.. చిరంజీవిని తొలిసారి చూడటం అదే. ఆ సమయంలో జర్నలిస్ట్ కాలనీవాసులు చూపిన ఆప్యాయత ఓ స్వీట్ మెమరీ. రోజూ సాయంత్రం డిన్నర్‌కు ఆహ్వానించే వాళ్లు. అప్పుడే సిటీలో మా పిన్నివాళ్లు ఉంటున్నారన్న విషయం తెలిసింది. నేను ఉంటున్న అశోక హోటల్‌కు సమీపంలోనే వాళ్ల ఇల్లు.. కాలినడకన అక్కడికి వెళ్లి కాలక్షేపం చేసేదాన్ని.
 
అప్పుడు ఫిల్మ్‌నగర్ లేదు. ఏఎన్నార్ ఆహ్వానం ఇక్కడకు వచ్చినప్పుడల్లా నిర్మాత హరికృష్ణ కుటుంబసభ్యులతో సరదాగా గడిపేదాన్ని. దివంగత హీరో నాగేశ్వరరావు జూబ్లీహిల్స్‌లోనే ఉండేవారు. నేకిక్కడకు వచ్చిన ప్రతిసారీ ఏఎన్నార్ తన ఇంటికి ఆహ్వానించే వారు. చాలా ఏళ్ల క్రితం పై మాటే.. ఏఎన్నార్ గారి ఇంటికి వెళ్లినపుడు నాగార్జున గురించి ప్రస్తావన వచ్చింది.

అమెరికాలో ఇంజనీరింగ్ చదువుతున్న నాగార్జునను సినిమాల్లోకి తేవడం ఇష్టం లేదని నాగేశ్వరరావు నాతో చెప్పారు. అయితే బంధువులు, స్నేహితులు హీరోను చేయాలని పట్టుబడుతున్నారని అన్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన నాగార్జునతోపరిచయమైంది.అంతా కాస్మొటిక్ కల్చర్ హైదరాబాద్ నెలకు రెండుసార్లు వస్తుంటాను. అప్పట్లో ఇక్కడ తెలుగు కల్చర్ కళ్లకు కట్టేది.

ఇప్పుడు కాస్త కాస్మొటిక్ కల్చర్ పెరిగినట్టుంది. అప్పట్లో ఎటు చూసినా పచ్చని చెట్లే.. ఇప్పుడా వాతావరణం లేదు. సిటీకి వచ్చిన ప్రతిసారి చట్నీస్ నుంచి చిరంజీవి దోశ తెప్పించుకొని టేస్ట్ చేస్తా. ఉలవచారు కనిపిస్తే లొట్టొలేస్తూ తాగేయాల్సిందే. గ్రీన్‌పార్క్ హోటల్‌లో ఆచారి వెజిటబుల్ (తెలుగులో ‘ఊరగాయ’ అంటారు) రుచి చూడనిదే ఈ సిటీ నుంచి తిరిగి వెళ్లను. చెన్నై తర్వాత నా ఫేవరెట్ సిటీ హైదరాబాదే. తెలుగుదనం ఉట్టిపడే, అందానికి వన్నెతెచ్చే కాటన్ చీరలను ఈ సిటీలోనే కొంటా. బంజారాహిల్స్‌లోని తూతూ తనేజా కాటన్ చీరలంటే చచ్చేంత
ప్రాణం నాకు.

బ్యూటీఫుల్ బిల్డింగ్స్..
ఈ సిటీలో భవనాలు అందంగా ఉంటాయి. నృత్య ప్రదర్శన నిమిత్తం వచ్చినపుడు ఫలక్‌నుమా ప్యాలెస్ చూశా. వాహ్.. నిర్మాణశైలి కట్టిపడేసింది. మొఘల్ తరహా నిర్మాణశైలి భవనాల సౌందర్యం చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. ముస్లింల సంప్రదాయ శైలి నిర్మాణాలు భలే కళాత్మకంగా ఉంటాయి. తొలినాళ్లలో ఇక్కడకు వచ్చిన ప్రతిసారీ బ్యాంగిల్స్ కోసం చార్మినార్‌కు పరుగెత్తేదాన్ని. సినిమాల్లో పేరొచ్చాక.. వెళ్లడం తగ్గించా.. అభిమానుల తాకిడి తట్టుకోలేక!. నేను హీరోయిన్‌గా చేసినపుడు తెలుగు వారు ఎలా అభిమానించారో ఇప్పటికీ అదే అభిమానం చూపుతున్నారు. ఫేస్‌బుక్‌లో ఫొటోలు అప్‌లోడ్ చేయాలని తరచూ అడుగుతుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement