చీరలాగి, సెల్‌ఫోన్ లాక్కున్న ఆ పార్టీ నాయకులు
పుట్టపర్తి అర్బన్: శ్రీసత్యసాయి జిల్లా ఓడీ చెరువు మండలం నారసింపల్లి తండాకు చెందిన మినీ అంగన్‌వాడీ కార్యకర్త , ఎస్టీ కులానికి చెందిన సుహాసినిపై టీడీపీ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అనుచరుడు ఆంజనేయులు బలాత్కారానికి యత్నించాడు.
వివరాల్లోకి వెళితే సుహాసిని కుమార్తె కదిరిలో చదువుతోంది. ఆదివారం సెలవు కావడంతో ఇంటికి కుమార్తెను ఇంటికి తీసుకొస్తుండగా.. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో నాయనాకోట తండాలో కాపుకాసిన పల్లె అనుచరుడు ఆంజనేయులు, అతని కుటుంబ సభ్యులు సుహాసిని చీర లాగి బలాత్కారం చేయబోయారు. ఆమె వద్ద ఉన్న సెల్‌ఫోన్ లాక్కున్నారు. అడ్డొచ్చిన ఆమె తల్లిపై దాడిచేసి చేయి విరగ్గొట్టారు. కులం పేరుతో దూషించారు.
తోటి కార్యకర్తను కాపాడిందని..
ఓడీచెరువు మండలం వీరప్పగారిపల్లి అంగన్‌వాడీ కార్యకర్త పోస్టును తన కుటుంబ సభ్యులకు ఇప్పించుకోవాలని ఆంజనేయులు ప్రయతి్నస్తున్నాడు. ఈ క్రమంలోనే స్థానిక అంగన్‌వాడీ కార్యకర్త నాగమణిని వేధింపులకు గురి చేశారు. దీంతో ఆమె మనస్తాపానికి గురై ఈ నెల 27న ఆత్మహత్యకు ప్రయతి్నంచింది. అంగన్‌వాడీ కేంద్రంలోనే సెల్ఫీ వీడియో తీసి ఆంజనేయులు ఆగడాలను వివరిస్తూ పురుగుమందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది.
పక్క గ్రామమైన నారసింపల్లి తండాకు చెందిన మినీ అంగన్‌వాడీ కార్యకర్త సుహాసినికి విషయం తెలియడంతో వెంటనే సదరు కేంద్రానికి వెళ్లి తోటివారితో కలిసి నాగమణిని 108 వాహనంలో కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నాగమణి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. కాగా.. నాగమణిని రక్షించిందనే కోపంతో సుహాసినిపై పల్లె అనుచరుడు ఆంజనేయులు దాషీ్టకానికి ఒడిగట్టాడు. బాధితురాలు జాయింట్ కలెక్టర్ అభిõÙక్‌కుమార్, ఎస్పీ కార్యాలయంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
కలెక్టరేట్ ఎదుట ధర్నా
అంగన్‌వాడీ కార్యకర్తపై దాడి చేసిన ఆంజనేయులు, అతని కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీదేవి, గౌరవాధ్యక్షుడు వెంకటే‹Ù, అధ్యక్షుడు మహబున్నీషా, కోశాధికారి శ్రీదేవి,కార్యదర్శి దిల్షాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment