ఆస్పత్రి పాలైన హీరో కమల్ హాసన్ సోదరుడు.. ఏమైందంటే? | Charu Haasan Hospitalized And Daughter Suhasini Post | Sakshi
Sakshi News home page

Charu Haasan: తండ్రికి అస్వస్థత.. నటి సుహాసిని ఇంట్రెస్టింగ్ పోస్ట్

Published Tue, Jul 30 2024 6:29 PM | Last Updated on Tue, Jul 30 2024 6:53 PM

Charu Haasan Hospitalized And Daughter Suhasini Post

ప్రముఖ హీరో కమల్ హాసన్ సోదరుడు చారు హాసన్ ఆస్పత్రి పాలయ్యారు. ప్రస్తుతం ఈయన వయసు 93 ఏళ్లు. ఈ వయసులో వచ్చే అనారోగ్య సమస్యల కారణంగా తాజాగా అస్వస్థతకు గురయ్యారు. ఈ మేరకు హాస్పిటల్‌లో చేర్చారు. ఈ క్రమంలోనే ఈయన కూతురు, ప్రముఖ నటి సుహాసిని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. తండ్రి పరిస్థితి గురించి ఆసక్తికరంగా రాసుకొచ్చింది.

(ఇదీ చదవండి: ఎన్నాళ్ల నుంచో ఇబ్బంది పడుతున్నాం.. హీరో రాజశేఖర్ ట్వీట్)

కమల్ హాసన్‌కి చారు హాసన్ అన్నయ్య. వీళ్లిద్దరి మధ్య 15 ఏళ్ల గ్యాప్ ఉంది. ఇకపోతే చారు హాసన్ కి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సుహాసిని ఇందులో ఒకరు. తెలుగు, తమిళ సినిమాల్లో అప్పట్లో హీరోయిన్ గా చాలాగుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తల్లి పాత్రలు పోషిస్తోంది.

ఇదిలా ఉండగా నటుడు, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న చారు హాసన్.. 1979 నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. 93 ఏళ్ల వయసులోనూ 'హర' అనే సినిమాలో నటించారు. తాజాగా ఆరోగ్య రీత్యా వచ్చే సమస్యల కారణంగా ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం తన తండ్రికి ఏం పర్లేదని, కోలుకుంటున్నారని సుహాసిని చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: టాలీవుడ్‌ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement