ఎన్నాళ్ల నుంచో ఇబ్బంది పడుతున్నాం.. హీరో రాజశేఖర్ ట్వీట్ | Telugu Actor Rajasekhar Posted Tweet On Drainage Leak Issue Is Hyderabad Jubilee Hills, Tweet Inside | Sakshi
Sakshi News home page

Rajasekhar: సెలబ్రిటీలకే తప్పట్లేదు.. సామాన్యుడి పరిస్థితేంటి?

Published Tue, Jul 30 2024 1:59 PM | Last Updated on Tue, Jul 30 2024 4:01 PM

Telugu Actor Rajasekhar Tweet On Drainage Leak Issue Hyd

రోజువారీ జీవితంలో అందరికీ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. సామాన్యుల విషయంలో అధికారులు నిర్లక్ష‍్యం చూపిస్తుంటారేమో గానీ ప్రముఖుల విషయంలో మాత్రం కాస్త త్వరగానే పని పూర్తి చేస్తుంటారు. కానీ ఇప్పుడు తెలుగు హీరో, ప్రముఖ నటుడు రాజశేఖర్ మాత్రం తన అసహనాన్ని బయటపెడుతూ ట్వీట్ చేశారు. డ్రైనేజీ లీక్ సమస్య వల్ల ఎన్నాళ్ల నుంచో ఇబ్బంది పడుతున్నామని చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: టాలీవుడ్‌ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి)

హైదరాబాద్ ఫరిదిలోని జూబ్లీహిల్స్ రోడ్ నం.70లో అశ్విని హైట్స్ దగ్గర డ్రైనేజీ లీకేజీ సమస్య ఎన్నాళ్ల నుంచో తమని వేధిస‍్తోందని, జీహెచ్ఎంసీ అధికారులకు ఎప్పుడో ఫిర్యాదు చేసినప్పటికీ.. ఇప్పటికీ పరిష్కారం కాలేదని రాజశేఖర్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఇప్పటికైనా ఈ సమస్య పరిష్కారించాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. లీకేజీ ఎలా ఉందో తెలియజేసే ఓ ఫొటోని కూడా పోస్ట్ చేశారు.

చివరగా 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' అనే సినిమాలో నటించిన రాజశేఖర్.. కొత్త మూవీస్ ఏం చేయట్లేదు. ఈయన కుమార్తెలు శివాత్మిక, శివాని మాత్రం పలు సినిమాల్లో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో వీళ్లిద్దరి కెరీర్ ఓ మాదిరిగా సాగుతోంది.

(ఇదీ చదవండి: మూడున్నర నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు సినిమా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement