Dr Rajasekhar
-
ఎన్నాళ్ల నుంచో ఇబ్బంది పడుతున్నాం.. హీరో రాజశేఖర్ ట్వీట్
రోజువారీ జీవితంలో అందరికీ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. సామాన్యుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం చూపిస్తుంటారేమో గానీ ప్రముఖుల విషయంలో మాత్రం కాస్త త్వరగానే పని పూర్తి చేస్తుంటారు. కానీ ఇప్పుడు తెలుగు హీరో, ప్రముఖ నటుడు రాజశేఖర్ మాత్రం తన అసహనాన్ని బయటపెడుతూ ట్వీట్ చేశారు. డ్రైనేజీ లీక్ సమస్య వల్ల ఎన్నాళ్ల నుంచో ఇబ్బంది పడుతున్నామని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: టాలీవుడ్ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి)హైదరాబాద్ ఫరిదిలోని జూబ్లీహిల్స్ రోడ్ నం.70లో అశ్విని హైట్స్ దగ్గర డ్రైనేజీ లీకేజీ సమస్య ఎన్నాళ్ల నుంచో తమని వేధిస్తోందని, జీహెచ్ఎంసీ అధికారులకు ఎప్పుడో ఫిర్యాదు చేసినప్పటికీ.. ఇప్పటికీ పరిష్కారం కాలేదని రాజశేఖర్ తన ట్వీట్లో రాసుకొచ్చారు. ఇప్పటికైనా ఈ సమస్య పరిష్కారించాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. లీకేజీ ఎలా ఉందో తెలియజేసే ఓ ఫొటోని కూడా పోస్ట్ చేశారు.చివరగా 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' అనే సినిమాలో నటించిన రాజశేఖర్.. కొత్త మూవీస్ ఏం చేయట్లేదు. ఈయన కుమార్తెలు శివాత్మిక, శివాని మాత్రం పలు సినిమాల్లో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో వీళ్లిద్దరి కెరీర్ ఓ మాదిరిగా సాగుతోంది.(ఇదీ చదవండి: మూడున్నర నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు సినిమా)There has been a drainage leak at Ashwini heights, Road no 70, Jubilee Hills, 500033 since ages. We have been speaking to @GHMCOnline to fix it, which hasn’t been done yet. Requesting @CommissionrGHMC @gadwalvijayainc @GHMCOnline to please, immediately look into it. pic.twitter.com/IXK8MrumZE— Dr.Rajasekhar (@ActorRajasekhar) July 29, 2024 -
మా కష్టానికి తగిన ఫలితం దక్కింది : 'శేఖర్' నిర్మాత
రాజశేఖర్ హీరోగా, శివానీ రాజశేఖర్, ఆత్మీయా రాజన్, ముస్కాన్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘శేఖర్’. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు. వంకాయల పాటి మురళీకృష్ణ సమర్పణలో బీరం సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న రిలీజైంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘నిర్మాత బొగ్గరం శ్రీనివాస్‌తో నాకు ఉన్న పరిచయం వల్ల ‘కార్తికేయ’ సినిమాకు తనతో ఇన్వెస్టర్‌గా చేరాను.ఆ తర్వాత ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమా నిర్మించాను. ఇక ‘శేఖర్’ విషయానికి వస్తే.. రాజశేఖర్‌గారు నా ఫేవరెట్ హీరో. అందుకే ఆయన చేసిన ‘గరుడవేగ’ సినిమాతో ట్రావెల్ చేశాను. మలయాళ ‘జోసెఫ్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేద్దామని జీవితగారు చెప్పడంతో నేనూ ‘జోసెఫ్’ చూశాను. నచ్చి ‘శేఖర్’ సినిమాకు నిర్మాతగా ఉన్నాను. రాజశేఖర్‌గారు అద్భుతంగా నటించారు. జీవితగారు బాగా తీశారు. దాదాపు 300 థియేటర్స్‌లో రిలీజ్ చేశాం. సినిమా బాగుందని, మంచి సందేశం ఇచ్చారని ప్రేక్షకులు అభినందిస్తుంటే మా కష్టానికి తగిన ఫలితం దక్కిందని హ్యాపీగా ఉంది’’ అన్నారు. -
ఇంట్రెస్టింగ్గా రాజ'శేఖర్' ట్రైలర్
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'శేఖర్' .ఇందులో ఆయన పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్ కీలక పాత్రలో నటించారు. జీవితా రాజశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్ ప్లే సమకూర్చారు. బీరం సుధాకర్ రెడ్డి, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజశేఖర్ నటించిన 91వ చిత్రమిది. ఈ సినిమాలో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, గ్లింప్స ఆకటుకుంటున్నాయి. మే20న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో అడివి శేష్ విడుదల చేశారు. మర్డర్ మిస్టరీని తన స్టైల్లో విచారణ జరపడం వంటివి ట్రైలర్లో చూపించారు. ఈ సినిమాలో ముస్కాన్ హీరోయిన్గా నటించింది. Very happy to launch the #ShekarTrailer My best wishes to@ActorRajasekhar garu on this new look film. Seems like an interesting #ShekarOnMay20 in Theaters. Kudos & luck to #JeevithaRajashekar garu, @Rshivani_1, @ShivathmikaR & team #Shekarhttps://t.co/m0Z304OyAT pic.twitter.com/1LrfXq94GX — Adivi Sesh (@AdiviSesh) May 5, 2022 -
సమ్మర్లోనే శేఖర్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
శేఖర్ సిల్వర్ స్క్రీన్‌కి రావడానికి రెడీ అవుతున్నాడు. సమ్మర్లోనే రిలీజ్ షురూ చేసుకున్నాడు. రాజశేఖర్ టైటిల్ రోల్లో జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శేఖర్’. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో బీరం సుధాకర్ రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమాను మే 20న విడుదల చేయాలనుకుంటున్నట్లు శనివారం చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో శివాని ఓ కీలక పాత్ర చేశారు. తండ్రి రాజశేఖర్‌తో కలిసి శివాని స్క్రీన్ షేర్ చేసుకున్న తొలి చిత్రం ఇది. ఈ చిత్రానికి కెమెరా: మల్లికార్జున్ నరగని, సంగీతం: అనూప్ రూబెన్స్. -
నా జీవితం అయిపోయింది అనుకున్నా: రాజశేఖర్ భావోద్వేగం
‘‘కరోనా నుంచి కోలుకున్నాక ‘శేఖర్’ చిత్రం చేశాను. 10 సినిమాల కష్టం ఒక్క ‘శేఖర్’కి పడ్డాను. యూనిట్ అంతా ప్రాణం పెట్టి చేశారు. ఈ సినిమా బాగా రావడానికి కారణం జీవిత’’ అని రాజశేఖర్ అన్నారు. రాజశేఖర్ పుట్టినరోజు (ఫిబ్రవరి 4) వేడుకలు హైదరాబాద్‌లో జరిగాయి. ఈ సందర్భంగా ‘శేఖర్’ చిత్రంలోని ‘కిన్నెర..’ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి జీవితా రాజశేఖర్ డైరెక్టర్. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో బీరం సుధాకర్ రెడ్డి, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘కోవిడ్ సమయంలో నా జీవితం అయిపోయింది.. నేను సినిమాలు చేస్తానా? లేదా? అనుకున్నాను. అయితే మీ అందరి ఆశీర్వాదాల వల్లే ఈరోజు మీ ముందు ఉన్నాను’’ అన్నారు. జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ–‘‘శేఖర్’ మాకు మరిచిపోలేని సినిమా అవుతుంది. ఈ సినిమాను ఎంతో కష్టపడి, ఇష్టంగా చేశాం. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. -
లైసెన్స్ రద్దు.. గోల!
సాక్షి, హైదరాబాద్: పెనాల్టీ పాయింట్ల విధానం అమలు, డ్రైవింగ్ లెసెన్స్ రద్దు విషయంలో పోలీసు, రవాణా శాఖలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ విషయంలో ఇటీవల సినీనటు డు రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆర్టీఏ రద్దు చేసిన విషయం తెలిసిందే. బాగా తీవ్రమైన కేసుల్లో మినహా ఇతర సంద ర్భాల్లో డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలన్న ఆలోచన ఇరు శాఖల్లో కొరవడిందన్న విమర్శలు వస్తున్నాయి. గతేడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి ఇప్పటివరకు రద్దు చేసిన డ్రైవింగ్ లైసెన్స్‌ల సంఖ్య చాలా స్వల్పంగా ఉండటమే ఇందుకు నిదర్శనం. తనిఖీలు అంతంతే... ఉభయ శాఖల నిర్లక్ష్యం, సమన్వయ లో పం ట్రాఫిక్ ఉల్లంఘన లకు పాల్పడేవారికి బా గా కలసివస్తోంది. ఎ లాంటి ఉల్లంఘనలకు పాల్పడ్డా.. చలాన్లు కట్టే సి ఎంచక్కా వెళ్లిపోతున్నారు. అదే డ్రైవింగ్ లైసెన్సు రద్దయితే.. కాస్తోకూస్తో క్రమశిక్షణ గా ఉండేవారు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు వరుసగా అసెంబ్లీ, స్థానిక సంస్థలు, పార్లమెంటు ఎన్నికల నేప థ్యంలో అదనపు విధుల కారణం గా 12 పెనాల్టీ పాయింట్ల నమోదు ప్రక్రియను పోలీసులు పెద్దగా పట్టించుకో లేదు. కొంతకాలంగా సాధారణ వాహన తనిఖీలు కూడా సరిగా జర గడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెమ్మదించిన 12 పాయింట్ల విధానం.. నిర్లక్ష్యపు డ్రైవింగ్, యథేచ్ఛగా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు తెలంగాణ ప్రభుత్వం 12 పాయింట్ల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో సీటు బెల్టు పెట్టుకోకపోవడం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్, మద్యం తాగి వాహనాలు నడపడం, సిగ్నల్ జంప్ తదితర ఉల్లంఘనలకు పాల్పడిన వ్యక్తి పట్టుబడితే అతడి డ్రైవింగ్ లైసెన్స్ నంబర్‌కు పెనాల్టీ పాయింట్లు జత చేస్తారు. ఉల్లంఘనల తీవ్రత ఆధారంగా పెనాల్టీ పాయింట్లు నిర్ణయిస్తారు. వీటిని రవాణా శాఖ ఎం–వ్యాలెట్‌లోనూ పొందుపరుస్తారు. కానీ కొంతకాలంగా పోలీసులు కేవలం చలాన్లాకే పరిమితమవుతున్నారని, 12 పెనాల్టీ పాయింట్లకు సంబంధించి నమోదు సరిగా జరగడం లేదన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. మరోవైపు పోలీసులు పంపిన సిఫారసులను ఆర్టీఏ కూడా అంతే తేలిగ్గా తీసుకుంటుందని పోలీసు శాఖ వారు ఆరోపిస్తున్నారు. -
‘మా’కు రాజశేఖర్ రూ.10 లక్షల విరాళం
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) నూతన కార్యవర్గం ఏర్పడి ఆరు నెలలు గడించింది. ఎన్నికల సందర్భంగా 'మా' సభ్యులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి నూతన కార్యవర్గం ప్రయత్నాలు చేస్తోంది. అయితే హామీల అమలు కోసం మూలధనంను తీసి ఖర్చుచేయడం సమంజసం కాదని భావించిన డాక్టర్ రాజశేఖర్... తన వంతుగా రూ. 10 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. ఇంతవరకూ 'మా' అసోసియేషన్ అదనపు నిధులను సేకరించే సంక్షేమ కార్యక్రమాలు జరుపుతోందని, ఈసారి కూడా అదే తరహాలో నిధులను సేకరించాలని నిర్ణయించుకున్నామని 'మా' ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డా.రాజశేఖర్ చెప్పారు. చిత్రసీమలోని అందరి సహకారంతో త్వరలోనే కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేసి, నిధులను సమీకరిస్తామని తెలిపారు. డా. రాజశేఖర్ 'మా'కు పది లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం పట్ల కార్యవర్గ సభ్యులు పలువురు హర్షం వ్యక్తం చేశారు. మా అధ్యక్షుడు నరేష్‌పై మా సభ్యులు అసంతృప్తితో ఉన్నారనే వార్తలు బయటకు రావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే వెంటనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) స్పందించి.. తమలో భేదాభిప్రాయాలు వచ్చాయని, అధ్యక్షుడు నరేష్‌కి, రాజశేఖర్ కార్యవర్గం నోటీసులు ఇవ్వబోతుందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించింది. -
థ్రిల్లర్‌కి సై
‘పీఎస్వీ గరుడవేగతో హిట్ ట్రాక్ ఎక్కిన రాజశేఖర్ ప్రస్తుతం ఓ ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నారు. క్రియేటివ్ ఎంటర్టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అధినేత డా. జి. ధనుంజయన్ నిర్మించనున్నారు. ఉత్తమ విమర్శకుడిగా, ఉత్తమ పుస్తక రచయితగా రెండు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న ధనుంజయన్ సమంత నటించిన ‘యుటర్న్’ సినిమాతో పాటు విజయ్ ఆంటోని ‘కొలైకారన్’ వంటి చిత్రాలను తమిళంలో విడుదల చేశారు. ఇంకా ‘మిస్టర్ చంద్రమౌళి’, జ్యోతిక, లక్ష్మీ మంచుల ‘కాట్రిన్ మొళి’ చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం విజయ్ ఆంటోనితో రెండు చిత్రాలు నిర్మిస్తున్నారు ధనుంజయన్. తెలుగు హిట్ ‘క్షణం’ను ‘సత్య’గా తమిళంలో రీమేక్ చేయడంతో పాటు ‘బేతాళుడు’ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రదీప్ కృష్ణమూర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ‘‘త్వరలో షూటింగ్ ఆరంభిస్తాం. సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేసి, వచ్చే ఏడాది మార్చిలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. సింగిల్ సిట్టింగ్‌లో కథను ఓకే చేసిన రాజశేఖర్‌కు కృతజ్ఞతలు’’ అని ధనుంజయన్ అన్నారు. సత్యరాజ్, నాజర్, బ్రహ్మానందం తదితరులు నటించనున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: యస్.పి. శివప్రసాద్, సంగీతం: సైమన్.కె. కింగ్. -
ఈ ఏడాదిలో...ఆరు సినిమాలు
‘‘ఈ ఏడాది ఆరు సినిమాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఇకపై నా మనసుకు నచ్చిన విభిన్న పాత్రలే చేస్తాను’’ అని డాక్టర్ రాజశేఖర్ వెల్లడించారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో పత్రికల వారితో ముచ్చటిస్తూ -‘‘నేను నటించిన ‘గడ్డం గ్యాంగ్’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో చేసిన ‘పట్టపగలు’ కూడా త్వరలోనే విడుదలవుతుంది. ‘అర్జున్’ సినిమా కూడా సిద్ధంగా ఉంది. నేను కార్పొరేషన్ స్కూలు టీచర్‌గా నటిస్తున్న ‘వందకు వంద’ సినిమా ఇప్పటికి ఎనభై శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇవి కాకుండా మరో రెండు సినిమాలు చేయాలనుకుంటున్నా’’ అని తెలిపారు. ‘గడ్డం గ్యాంగ్’ గురించి రాజశేఖర్ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ -‘‘ ‘ఎవడైతే నాకేంటి’, ‘గోరింటాకు’ తర్వాత ఆ స్థాయి హిట్ సినిమాలు నా నుంచి రాలేదు. అందుకే రొటీన్‌గా కాకుండా విభిన్నంగా ఈ సినిమా చేశా. ఈ సినిమాకు అసలు హీరో స్క్రిప్టే. అచ్చు అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణ. జీవిత నిద్రాహారాలు పట్టించుకోకుండా ఈ చిత్రం కోసం చాలా కష్టపడింది. ఇందులో నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పాలని ప్రయత్నించా. కానీ ఎప్పటిలానే నా పాత్రకు సాయికుమార్ డబ్బింగ్ చెప్పారు’’ అన్నారు.