శేఖర్ సిల్వర్ స్క్రీన్‌కి రావడానికి రెడీ అవుతున్నాడు. సమ్మర్‌లోనే రిలీజ్ షురూ చేసుకున్నాడు. రాజశేఖర్ టైటిల్ రోల్‌లో జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శేఖర్’. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో బీరం సుధాకర్ రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించిన చిత్రం ఇది.
ఈ సినిమాను మే 20న విడుదల చేయాలనుకుంటున్నట్లు శనివారం చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో శివాని ఓ కీలక పాత్ర చేశారు. తండ్రి రాజశేఖర్‌తో కలిసి శివాని స్క్రీన్ షేర్ చేసుకున్న తొలి చిత్రం ఇది. ఈ చిత్రానికి కెమెరా: మల్లికార్జున్ నరగని, సంగీతం: అనూప్ రూబెన్స్.
Comments
Please login to add a commentAdd a comment