ఆస్పత్రిలో చేరిన హీరో కమల్ హాసన్ సోదరుడు | Kamal Haasan Brother Charuhasan Hospitalized | Sakshi
Sakshi News home page

Charu Haasan: ఆస్పత్రిలో తండ్రి.. పోస్ట్ పెట్టిన సుహాసిని

Published Fri, Nov 1 2024 9:39 AM | Last Updated on Fri, Nov 1 2024 9:52 AM

Kamal Haasan Brother Charuhasan Hospitalized

ప్రముఖ నటుడు, దర్శకుడు చారు హాసన్‌ని ఆస్పత్రిలో చేర్పించారు. ఈ విషయాన్ని ఈయన కుమార్తె, ఒకప్పటి హీరోయిన్ సుహాసిని చెప్పుకొచ్చింది. దీపావళి పండగ ముందు అంటే గురువారం రాత్రి చారు హాసన్.. అస్వస్థతకు గురికావడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: 'లక్కీ భాస్కర్' సినిమా రివ్యూ)

'దీపావళికి ముందే మా నాన్న అస్వస్థతకు గురయ్యారు. మా పండగ ఎమర్జెన్సీ వార్డులో గడిచిపోయింది. ప్రస్తుతం ఆయన సర్జరీకి సిద్ధమవుతున్నారు' అని సుహాసిని తన్ ఇన్ స్టాలో రాసుకొచ్చింది. ఈ క్రమంలోనే ఆయన త్వరగా కోలుకోవాలని నెటిజన్స్, కమల్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 15 సినిమాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement