తణుకు: పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని ఆంధ్రా షుగర్స్ సంస్థ జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. ఆంధ్రా షుగర్స్ సంస్థ హార్వెస్టింగ్ మెషీన్ పేరుతో చేసిన ఆవిష్కరణకు 20 సంవత్సరాల కాలవ్యవధికి గాను షుగర్ కేన్ పేటెంట్ వ చ్చింది. ఈ మేరకు భారత ప్రభుత్వ పేటెంట్ కార్యాలయం ఈ నెల 26న పేటెంట్ సరి్టఫికెట్ జారీ చేసింది.
సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ముళ్లపూడి నరేంద్రనా«థ్ మార్గదర్శకత్వంలో సంస్థకు చెందిన షుగర్ కేన్ హార్వెస్టర్ డెవలప్‌మెంట్ టీమ్ దీన్ని నిర్మించడానికి, ఉపయోగించడానికి పదేళ్లుగా అంకిత భావంతో కృషి చేస్తోంది. భారతీయ వ్యవసాయ పరిస్థితులకు అనువైన చెరకు హార్వెస్టర్ ఆవిష్కరణకు పేటెంట్ మంజూరు అయిన దేశంలోనే మొట్టమొదటి సంస్థ ఆంధ్రా షుగర్స్ కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment