Andhra Sugars
-
ఆంధ్రా షుగర్స్‌కు షుగర్ కేన్ హార్వెస్టింగ్ మెషీన్ పేటెంట్
తణుకు: పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని ఆంధ్రా షుగర్స్ సంస్థ జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. ఆంధ్రా షుగర్స్ సంస్థ హార్వెస్టింగ్ మెషీన్ పేరుతో చేసిన ఆవిష్కరణకు 20 సంవత్సరాల కాలవ్యవధికి గాను షుగర్ కేన్ పేటెంట్ వ చ్చింది. ఈ మేరకు భారత ప్రభుత్వ పేటెంట్ కార్యాలయం ఈ నెల 26న పేటెంట్ సరి్టఫికెట్ జారీ చేసింది. సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ముళ్లపూడి నరేంద్రనా«థ్ మార్గదర్శకత్వంలో సంస్థకు చెందిన షుగర్ కేన్ హార్వెస్టర్ డెవలప్మెంట్ టీమ్ దీన్ని నిర్మించడానికి, ఉపయోగించడానికి పదేళ్లుగా అంకిత భావంతో కృషి చేస్తోంది. భారతీయ వ్యవసాయ పరిస్థితులకు అనువైన చెరకు హార్వెస్టర్ ఆవిష్కరణకు పేటెంట్ మంజూరు అయిన దేశంలోనే మొట్టమొదటి సంస్థ ఆంధ్రా షుగర్స్ కావడం విశేషం. -
రాకెట్ ఇంధనం తణుకు నుంచే...
తణుకు: ప్రపంచ పటంలో తణుకు పట్టణానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. తణుకులోని ఆంధ్రాషుగర్స్ వల్ల ఆ గుర్తింపు లభించింది అంటే అతిశయోక్తి కాదు. అయితే భారతీయ అంతరిక్ష పశోధన సంస్థ (ఇస్రో) చేస్తున్న రాకెట్ ప్రయోగాల్లో ఆంధ్రాషుగర్స్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ప్రయోగాలకు కావాల్సిన ద్రవరూప ఇంధనాన్ని రూపొందించడంలో ఆంధ్రాషుగర్స్ విజయం సాధించింది. చదవండి: త్వరలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు రిజిస్ట్రేషన్లు ఇస్రో-ఆంధ్రాషుగర్స్ సహకారం 1984లో ప్రారంభం కాగా 1985 మార్చిలో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభానికి పైలెట్ ప్రాజెక్టు స్థాపనకు ఇస్రో ఆంధ్రాషుగర్స్ మధ్య ఒప్పందం ఖరారు అయ్యింది. 1988 జులై 24న ప్లాంటును జాతికి అంకితం చేశారు. అతి కీలకమైన అంతరిక్ష పరిశోధన రంగంలో స్వయం సమృద్ధి దిశగా భారతదేశం సాగిస్తున్న జైత్రయాత్రలో ఇస్రో-ఆంధ్రాసుగర్స్ మధ్య ఏర్పడిన సహకారం ఫలప్రదమైన పాత్ర నిర్వహిస్తోంది. రాకెట్ ఇంధనం తయారీ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన చిత్రపటంలో భారతదేశానికి సముచిత స్థానం కల్పించడంలో ఆంధ్రాషుగర్స్ ముఖ్య పాత్ర పోషించింది. తణుకు ప్లాంట్‌లో ఉత్పత్తి చేసిన ద్రవరూప ఇంధనం భారత మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞనంతో నిర్మించిన బహుళ ప్రయోజన ఉపగ్రహాలు INSAT-IIA, PSLV- D2, PSLV-D3 లలో వినియోగించారు. ప్రస్తుతం తణుకు పరిశ్రమలో చక్కెర ఉత్పత్తి నిలిచిపోయినప్పటికీ రాకెట్ ఇంధన తయారీతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. చదవండి: Andhra Pradesh: ‘డిజిటల్ హెల్త్’కు నాంది -
కేంద్ర మాజీమంత్రి బోళ్ల బుల్లిరామయ్య మృతి
సాక్షి, ఏలూరు : కేంద్ర మాజీమంత్రి, తణుకు ఆంధ్రా షుగర్స్ ఎండీ బోళ్ల బుల్లిరామయ్య (91) మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుధవారం ఉదయం బోళ్ల బుల్లిరామయ్య మరణించారు. 1926 జులై 9న తూర్పుగోదావరి జిల్లా తాటిపాకలో జన్మించిన ఆయన 1984, 1991, 1996, 1999లో ఏలూరు నుంచి ఎంపీగా పనిచేశారు. 1996-98 మధ్య బుల్లిరామయ్య కేంద్ర వాణిజ్య శాఖ సహాయమంత్రిగా పనిచేశారు. ఆయన మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సంతాపం తెలిపారు. తెలుగుదేశం పార్టీకి, ప్రజలకు బుల్లిరామయ్య చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే ఏపీ రాష్ట్ర మంత్రులు పితాని సత్యనారాయణ, పైడికొండల మాణిక్యాలరావు, కెఎస్ జవహర్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. రేపు మధ్యాహ్నం పెదపట్నం అగ్రహారంలో బోళ్ల బుల్లిరామయ్య అంత్యక్రియలు జరగనున్నాయి.