సాక్షి, ఏలూరు : కేంద్ర మాజీమంత్రి, తణుకు ఆంధ్రా షుగర్స్ ఎండీ బోళ్ల బుల్లిరామయ్య (91) మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుధవారం ఉదయం బోళ్ల బుల్లిరామయ్య మరణించారు. 1926 జులై 9న తూర్పుగోదావరి జిల్లా తాటిపాకలో జన్మించిన ఆయన 1984, 1991, 1996, 1999లో ఏలూరు నుంచి ఎంపీగా పనిచేశారు. 1996-98 మధ్య బుల్లిరామయ్య కేంద్ర వాణిజ్య శాఖ సహాయమంత్రిగా పనిచేశారు.
ఆయన మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సంతాపం తెలిపారు. తెలుగుదేశం పార్టీకి, ప్రజలకు బుల్లిరామయ్య చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే ఏపీ రాష్ట్ర మంత్రులు పితాని సత్యనారాయణ, పైడికొండల మాణిక్యాలరావు, కెఎస్ జవహర్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. రేపు మధ్యాహ్నం పెదపట్నం అగ్రహారంలో బోళ్ల బుల్లిరామయ్య అంత్యక్రియలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment