![Four people died due to electric shock in Tadiparru village, east Godavari district](/styles/webp/s3/article_images/2024/11/4/electric%20shock.jpg.webp?itok=w0bmKQQz)
సాక్షి,తూర్పుగోదావరి: ఉండ్రాజవరం మండలం తాటిపర్రులో విషాదం చోటుచేసుకుంది. పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ సందర్భంగా ప్లెక్సీలు కడుతుండగా కరెంట్ షాకుతో నలుగురు యువకులు మృతి మృతిచెందారు. మరో యువకుడు కోమటి అనుమంతురావు అనే వ్యక్తికి తీవ్రగాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉంది. మృతులు గొల్ల వీర్రాజు, నాగేంద్ర, మణికంఠ, కృష్ణగా గుర్తించారు.
కాగా, తాటి పర్రు విషాదంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment