Papanna Goud
-
తీవ్ర విషాదం.. కరెంట్ షాక్‌తో నలుగురు యువకులు మృతి
సాక్షి,తూర్పుగోదావరి: ఉండ్రాజవరం మండలం తాటిపర్రులో విషాదం చోటుచేసుకుంది. పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ సందర్భంగా ప్లెక్సీలు కడుతుండగా కరెంట్ షాకుతో నలుగురు యువకులు మృతి మృతిచెందారు. మరో యువకుడు కోమటి అనుమంతురావు అనే వ్యక్తికి తీవ్రగాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉంది. మృతులు గొల్ల వీర్రాజు, నాగేంద్ర, మణికంఠ, కృష్ణగా గుర్తించారు. కాగా, తాటి పర్రు విషాదంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
ట్యాంక్‌బండ్‌పై పాపన్న విగ్రహ ఏర్పాటుకు కృషి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్ లేదా కూడలిలో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని తాజా మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గౌడ ఐక్య సాధన సమితి అధ్యక్షుడు అంబాల నారాయణగౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కాం గ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలో గీత కార్మిక వృత్తి నిరాధరణకు గురైందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక గీత వృత్తికి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేశామని తెలిపారు. గీత కార్మికుల పన్నుల రద్దు, హైదరాబాద్‌లో మూసివేసిన కల్లు కాంపౌండ్లను తిరిగి ప్రారంభించడం, రాష్ట్రవ్యాప్తంగా తాటి, ఈత చెట్ల పెంపకానికి కృషి చేశామని వివరించారు. టీఆర్ఎస్ వస్తే పాపన్న జయంతి, వర్ధంతిలను అధికారికంగా నిర్వహించడం, గీత కార్మికుల డిమాండ్ల పరి ష్కారానికి కృషి చేస్తానని హామీఇచ్చారు. -
కొత్త జిల్లాకు పాపన్న పేరు పెట్టాలి
రఘునాథపల్లి : చత్రపతి శివాజీ సమకాలికుడు,బహుజన రాజ్య స్థాపనకు పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న పేరు కొత్తగా ఏర్పడే ఒక జిల్లాకు పెట్టాలని గౌడ జేఏసీ రాష్ట్ర చైర్మన్ అయిలి వెంకన్నగౌడ్ ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు. పాపన్న జ యంతిని ప్రభుత్వం అధికారి కంగా నిర్వహించాలనే డిమాం డ్తో గౌడ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని గోల్కొండ కోట నుంచి మండలంలోని ఖిలాషాపూర్ పాపన్న కోట వరకు బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఖిలాషాపూర్ బస్టాండ్ వద్ద పాపన్న విగ్రహానికి వెంకన్నగౌడ్ పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడు తూ.. బలహీనవర్గాల పక్షానపోరాడిన వీరుడు పాపన్న చరిత్రను బావి తరాలకు అందించాలన్నారు. కర్ణాటకలోని బసవేశ్వరుడికి రూ. 40 లక్షలు ఇచ్చిన రాష్ట్ర సర్కార్ ఇక్కడి పాపన్నను మరువడం విస్మయం కలిగిస్తోందన్నారు. హైదరాబాద్‌లో ఐదెకరాల విస్తీర్ణంలో పాప న్న భవన నిర్మాణం, ట్యాంక్ బండ్‌పై పాపన్న విగ్రహం, గీత కార్పొరేషన్‌కు 1000 కోట్లు కెటాయించడంతో పాటు నూతన కల్లు గీత సమగ్ర చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 18న పాపన్న జయంతిని గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర గౌడ జేఏసీ కన్వీనర్ అంబాల నారాయణగౌడ్, దుర్గయ్యగౌడ్, మాజీ ఎంపీపీ కుమార్‌గౌడ్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు బొనగాని యాదగిరిగౌడ్, వైస్ ఎంపీపీ మల్కపురం లక్ష్మయ్యగౌడ్, నామాల బుచ్చయ్య, వంగ శ్రీను, దుబ్బాన నాగేష్, మనోహర్‌గౌడ్, సురేష్‌గౌడ్, బాలకృష్ణగౌడ్, ముకేష్‌గౌడ్, రంజిత్‌గౌడ్, బత్తుల లత పాల్గొన్నారు. -
పాపన్న నడయాడిన కొండలు
పీడిత జనం విముక్తి కోసం పోరు చేస్తూనే... మొగల్ సామ్రాజ్యవాదులపై తిరుగుబావుటా ఎగురవేసిన వీరయోధుడు సర్ధార్ సర్వాయిపాపన్నగౌడ్. సామాన్య గీతకార్మికుడిగా ఓ పశువుల కాపరిగా జీవించిన ఆయన ఆనాటి బానిస సంకెళ్లను తెంచడం కోసం వీరోచిత పోరాటాలు చేసిన పరాక్రమవంతుడు. వరంగల్ జిల్లాలో పుట్టిన ఆయన అనేక కోటలు జయించి వీరుడుగా నిలిచాడు. క్రీ.శ1675 ప్రాంతంలో కరీంనగర్ జిల్లా వెన్కెపల్లి-సైదాపూర్ మండలంలోని సర్వాయిపేటలో తొలిసారిగా కోటలు నిర్మించాడు. ఇక్కడే 2వేల మందికి సైనిక శిక్షణ ఇచ్చాడు. పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సర్వాయిపేట కోటతో పాటు కోటగిరి గుట్టల్లో ఉన్న కొత్త ఖిల్లా, పాతఖిల్లాలపై పాపన్న చరిత్రను తెలిపే అనేక ఆనవాళ్లు ఉన్నాయి. వందల ఎకరాలలో విస్తరించిన కొండల అందాలు అరకులోయలను తలపించే ప్రకృతి సోయగం ఈ ప్రాంతం సొంతం. చూడాలనిపించే కట్టడాలు బలిష్టమైన రాతి కట్టడాలు, 20 అడుగుల ఎత్తులో ఉన్న కోట ముఖ ద్వారం, 50 అడుగుల ఎత్తులో ఉన్న బురుజులు, కోట ద్వారానికి కుడివైపు రాతితో నిర్మించిన కోనేరు, కొత్త కిలపై కోనేరు, పాపన్న ఆరాధ్య దైవం బయ్యన్న విగ్రహం (ఎతై ్తన బండకు చెక్కిన శిలా విగ్రహం), పాపన్న ప్రియురాలు బుచ్చమ్మ అర్ర, కోట చుట్టూ రక్షణగా కందకాలు, కోట నుంచి గుట్టలకు రహస్య సొరంగాలు, గుట్టల చుట్టూ బలమైన రాతి గోడలు, లోనికి ప్రవేశించే ద్వారాలు, గుట్టలపై పాపన్న ఆడిన పచ్చీసలు, తహశీల్ బండ, పచ్చీసల బండ, దనంబండ, హన్మాన్ విగ్రహం, పోచమ్మగుడి, శివాలయం, సాకలి మడుగు, చేదబావి, నీటి కొలనులు, విశాలమైన మఠంగా పిలువబడే మైదానం, పాపన్న నాటిన చింతచెట్లు, పూజల కోసం నాటిన దేవగన్నేరు వక్షం... ఇలా ఒక్కటేమిటి ఆనాటి అనేక ఆనవాళ్లు ఇక్కడ ఉన్నాయి. కోటగిరి గట్లు సైదాపూర్, హుస్నాబాద్, బీమదేవరపల్లి, చిగురుమిడి మండలాలను ఆనుకుని ఎతై ్తన గుట్టలు వందల ఎకరాల విస్తీర్ణంలో కోటగిరిగట్లు ఉన్నాయి. పాపన్న ఈ గుట్టలపై కోటలు కట్టడంవల్ల కోటగిరిగట్లుగా పేరుకువచ్చాయి. గుట్టల చుట్టూ బలమైన బండరాళ్ల రక్షణ గోడలు నిర్మించాడు. జారుడు బండల్లా ఉన్న గుట్టలపై ఎతై ్తన రాళ్లు ఎలాంటి మట్టి, సిమెంట్, డంగు సున్నంను ఉపయోగించకుండా నిర్మించడం నైపుణ్యతను చూపుతోంది. సింహద్వారాలు తప్పితే మరెక్కడి నుంచి ఎవ్వరూ లోనికి ప్రవేశించకుండా ఉండేలా ఈ గోడలు ఉన్నాయి. చూసినికొద్దీ తనివితీరాలనిపించే ఈ చారిత్రక కట్టడాలు ఉన్న ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చేయాల్సిన అవసరముంది. - కనుకుంట్ల కృష్ణహరి వ్యాసకర్త, పాపన్న ఆస్తుల పరిరక్షణా కార్యకర్త