ట్యాంక్‌బండ్‌పై పాపన్న విగ్రహ ఏర్పాటుకు కృషి | Work for papanna Statue set up on tank bund | Sakshi
Sakshi News home page

ట్యాంక్‌బండ్‌పై పాపన్న విగ్రహ ఏర్పాటుకు కృషి

Published Fri, Oct 12 2018 1:30 AM | Last Updated on Fri, Oct 12 2018 1:30 AM

Work for papanna Statue set up on tank bund - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడితే సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌ లేదా కూడలిలో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని తాజా మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గౌడ ఐక్య సాధన సమితి అధ్యక్షుడు అంబాల నారాయణగౌడ్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కాం గ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలో గీత కార్మిక వృత్తి నిరాధరణకు గురైందన్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక గీత వృత్తికి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేశామని తెలిపారు. గీత కార్మికుల పన్నుల రద్దు, హైదరాబాద్‌లో మూసివేసిన కల్లు కాంపౌండ్లను తిరిగి ప్రారంభించడం, రాష్ట్రవ్యాప్తంగా తాటి, ఈత చెట్ల పెంపకానికి కృషి చేశామని వివరించారు. టీఆర్‌ఎస్‌ వస్తే పాపన్న జయంతి, వర్ధంతిలను అధికారికంగా నిర్వహించడం, గీత కార్మికుల డిమాండ్ల పరి ష్కారానికి కృషి చేస్తానని హామీఇచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement