Narendranath
-
ఆంధ్రా షుగర్స్‌కు షుగర్ కేన్ హార్వెస్టింగ్ మెషీన్ పేటెంట్
తణుకు: పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని ఆంధ్రా షుగర్స్ సంస్థ జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. ఆంధ్రా షుగర్స్ సంస్థ హార్వెస్టింగ్ మెషీన్ పేరుతో చేసిన ఆవిష్కరణకు 20 సంవత్సరాల కాలవ్యవధికి గాను షుగర్ కేన్ పేటెంట్ వ చ్చింది. ఈ మేరకు భారత ప్రభుత్వ పేటెంట్ కార్యాలయం ఈ నెల 26న పేటెంట్ సరి్టఫికెట్ జారీ చేసింది. సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ముళ్లపూడి నరేంద్రనా«థ్ మార్గదర్శకత్వంలో సంస్థకు చెందిన షుగర్ కేన్ హార్వెస్టర్ డెవలప్మెంట్ టీమ్ దీన్ని నిర్మించడానికి, ఉపయోగించడానికి పదేళ్లుగా అంకిత భావంతో కృషి చేస్తోంది. భారతీయ వ్యవసాయ పరిస్థితులకు అనువైన చెరకు హార్వెస్టర్ ఆవిష్కరణకు పేటెంట్ మంజూరు అయిన దేశంలోనే మొట్టమొదటి సంస్థ ఆంధ్రా షుగర్స్ కావడం విశేషం. -
విశ్రాంతి లేదు
కీర్తీ సురేశ్ అండ్ టీమ్ యూరప్ నుంచి ఇండియాకి రిటర్న్ అయ్యారు. అక్కడి షెడ్యూల్ ముగించుకుని వచ్చారు కదా! కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటారేమో? అంటే నో రెస్ట్ అట. మరో వారం నుంచి మళ్లీ పనిలో పడిపోతారట. కీర్తీ సురేశ్ ముఖ్య పాత్రలో నూతన దర్శకుడు నరేంద్రనాథ్ ఓ లేడీ ఓరియంటెడ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మహేశ్ కోనేరు నిర్మాత. ఈ చిత్రానికి ‘సఖి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇటీవలే స్పెయిన్‌లో నెలరోజులు చిత్రీకరణ జరిపారు యూనిట్. వారం రోజుల్లో హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించనున్నారు. రాజేంద్రప్రసాద్, నదియా, నరేశ్, కమల్ కామరాజు కీలక పాత్రలో నటించనున్న ఈ చిత్రాన్ని దసరాకు రిలీజ్ చేయనుంది చిత్ర యూనిట్. -
స్పెయిన్‌లో మకాం
సూట్‌కేసు సర్దుకుని యూరప్‌లో ల్యాండ్ అవడానికి రెడీ అవుతున్నారు హీరోయిన్ కీర్తీసురేశ్. నరేంద్రనాథ్ దర్శకత్వంలో కీర్తీ సురేశ్ ప్రధానపాత్రలో ఓ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. మహేశ్ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల 13న స్పెయిన్‌లో ప్రారంభం కానుంది. ‘‘దాదాపు యాభైమంది ఆరిస్టులు, టెక్నీషియన్స్‌తో పాటుగా వెయ్యికిలోల లగేజ్‌తో యూరప్ పయనమయ్యాం. ఫిల్మ్ ఎక్విప్మెంట్ అదనంగా ఉంది. కాస్త స్ట్రెస్‌ఫుల్‌గా ఉన్నప్పటికీ ఈ అనుభవం కొత్త లెర్నింగ్‌గా ఉంటుందని భావిస్తున్నాం. ఈ నెల 13న స్పెయిన్‌లో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం’’ అని మహేశ్ కోనేరు చెప్పారు. ఈ షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్ 90శాతం పూర్తవుతుంది. త్వరలోనే టైటిల్‌ని అనౌన్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు చిత్రబృందం. ఈ చిత్రాన్ని దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ఇలా కొత్త షెడ్యూల్ కోసం యూరప్‌కు మకాం మార్చారు కీర్తీసురేశ్. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, సీనియర్ నరేశ్, నదియా, కమల్ కామరాజు, భానుశ్రీ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కాకుండా నగేశ్ కుకునూరు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న కీర్తీసురేశ్, నాగార్జున ‘మన్మథుడు 2’ లో అతిథి పాత్ర పోషించారు. బాలీవుడ్లో అజయ్ దేవగణ్ నటించనున్న ఓ స్పోర్ట్స్ బయోపిక్‌లో కీర్తీ సురేశ్ కథానాయికగా నటించనున్నారు. -
స్వైన్‌ఫ్లూ తగ్గింది: నిమ్స్ డైరెక్టర్ నరేంద్రనాథ్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల మొదటి వారంతో పోలిస్తే స్వైన్‌ఫ్లూ ఉధృతి తగ్గిందని నిమ్స్ డెరైక్టర్ నరేంద్రనాథ్ స్పష్టం చేశారు. అయినా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. సచివాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. స్వైన్‌ఫ్లూతో ప్రతీ మూడు రోజులకు ఒకరు చనిపోయినట్లు తేలిందన్నారు. 2009 లో స్వైన్‌ఫ్లూ పాజిటివ్ వచ్చిన వారిలో 10 శాతం మంది చనిపోతే.. ఈ ఏడాది 3.64 శాతం మంది చనిపోయారన్నారు. మందుల కొరత లేదని, అవసరానికి మించి స్టాకు ఉందని చెప్పారు. -
త్వరలో మైక్రో హోమ్ లోన్స్
డీసీబీ బ్యాంక్ (గతంలో డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్) ప్రధానంగా గ్రామీణ మార్కెట్‌పై దృష్టిసారిస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా రైతులు, చిన్నవ్యాపారుల అవసరాలకు అనుగుణంగా కొత్త రుణ పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో శాఖలు ఏర్పాటుచేస్తున్నామని, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విస్తరణ కార్యక్రమాలు చేపట్టామంటున్న డీసీబీ బ్యాంక్ అగ్రి, ఇంక్లూజివ్ బ్యాంకింగ్ హెడ్ నరేంద్రనాథ్ తో సాక్షి’ ఇంటర్వ్యూ వివరాలు ఇవీ... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తీవ్ర వర్షాభావ పరిస్థితిని ఎదుర్కొంటుడడంతో వ్యవసాయ మార్కెట్‌పై ఏమైనా ప్రభావం పడిందా? మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు బాగా తక్కువ కురవడంతో వ్యవసాయ రుణాలపై కొంత ప్రభావం ఉన్న మాట వాస్తవమే. కానీ రానున్న వారాల్లో వర్షాలు కొంత మెరుగుపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి సమాచారం వస్తుండటంతో పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నాం. గ్రామీణ ప్రాంత ప్రజల కోసం ఎటువంటి ప్రత్యేకమైన పథకాలను డీసీబీ బ్యాంక్ అందిస్తోంది? గ్రామీణ ప్రాంత ప్రజల అవసరాలు, వారి ఆదాయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైన పథకాలను అందిస్తున్నాము. ఉదాహరణకు రైతులకు ఉద్యోగస్తుల వలే ప్రతి నెలా స్థిరమైన ఆదాయం ఉండదు. కొన్ని కాలాల్లో అధికాదాయం ఉంటే మరికొన్ని కాలాల్లో ఉండదు. దీనికి అనుగుణంగానే రైతులు నగదు లభ్యతను బట్టి ఈఎంఐలు చెల్లించే విధంగా ట్రాక్టర్ రుణాలను అందిస్తున్నాము. అలాగే వారి అవసరాలకు అనుగుణంగా ఇంటి వద్దనే బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నాం. రైతులకు అవసరమైన కిసాన్ క్రెడిట్ కార్డులు, బంగారు ఆభరణాలపై రుణాలు, ట్రాక్టర్లు, ఇంకా వ్యవసాయానికి సంబంధించిన వాణిజ్య వాహనాలకు రుణాలను ఇస్తున్నాం. కేవలం ఒక ఎకరం భూమి ఉన్న రైతుకు కూడా ట్రాక్టర్లకు రుణాలను ఇస్తున్నాం. అర్హత కలిగిన రైతులకు మూడు రోజుల్లోనే రుణాలను మంజూరు చేస్తున్నాం. రైతులకు, గ్రామీణ మహిళలకు కొత్తగా ఏమైనా పథకాలను ప్రవేశపెట్టే ఆలోచన ఉందా? కూలీల దగ్గర నుంచి జీతం ఆదాయంగా ఉన్న వారి వరకు అందరికీ ఇచ్చేలా మైక్రో గృహ రుణ పథకాన్ని త్వరలో ప్రవేశపెట్టనున్నాం. ఈ పథకం కింద కనిష్టంగా రూ. లక్ష నుంచి గరిష్టంగా రూ. 5 లక్షల వరకు రుణాన్ని ఇస్తాము. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో వ్యాపార విస్తరణ కార్యక్రమాల గురించి వివరిస్తారా? రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో వ్యాపార అవకాశాలు పెరిగాయి. అందుకే ఈ రెండు రాష్ట్రాల విస్తరణపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నాము. మొన్నటి వరకు హైదరాబాద్, వరంగల్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తూ వచ్చిన డీసీబీ ఈ మధ్యే ఆకివీడు, అనపర్తి, గుంటూరు సమీపంలోని నల్లపాడు, కరీంనగర్‌కు దగ్గర్లోని రేకుర్తి, విజయవాడలో కొత్తగా శాఖలను ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలోనే నిజామాబాద్‌లోని బోర్గాన్, కైకలూరు, మిర్యాలగూడ, మహబూబాబాద్ సమీపంలోని పెద్దతండాల్లో శాఖలను ఏర్పాటు చేయనున్నాం. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 133 శాఖలను కలిగి ఉన్నాం. ప్రధానంగా వ్యవసాయం, మైక్రో ఎస్ఎంఈ లు, ఎస్ఎంఈలు, మిడ్ కార్పొరేట్స్, రిటైల్ వ్యాపారాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నాం. రూ. 100లతో రికరింగ్ డిపాజిట్, మైక్రో బిజినెస్, డీసీబీ ఎలైట్ అకౌంట్ పేరుతో విభిన్న పథకాలను అందిస్తున్నాం. ఈ రెండు రాష్ర్ట ప్రభుత్వాలు ప్రకటించిన రుణ మాఫీ పథకం మీ వ్యవసాయ పోర్ట్‌ఫోలియోపై ఏమైనా ప్రభావం చూపిందా? రిటైల్ అగ్రి వ్యాపారంలోకి ఈ మధ్యనే ప్రవేశించాం. అందులో ఈ రెండు రాష్ట్రాల్లో అగ్రి బ్రాంచ్‌లను కొత్తగా ప్రారంభించడంతో ఈ రుణ మాఫీ పథక ప్రభావంపై అప్పుడే చెప్పలేం. ప్రధాన మంత్రి ప్రవేశపెట్టిన ‘జన ధన యోజన’ పథకంలో డీసీబీ కూడా పాలుపంచుకుంటోందా? ఇతర వాణిజ్య బ్యాంకుల్లాగానే ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నాం. -
రంజీ మాజీ క్రికెటర్ నరేంద్రనాథ్ మృతి
గుంటూరు: రంజీ మాజీ క్రికెటర్, ఆంధ్ర క్రికెట్ సంఘం ఉపాధ్యక్షుడు జాగర్లమూడి నరేంద్రనాథ్ మరణించారు. కేన్సర్ బారినపడ్డ 65 బాధపడుతున్న నరేంద్రనాథ్ ఆదివారం మరణించారు. ఆయన రెండేళ్లుగా కేన్సర్‌తో బాధపడుతున్నారని, శనివారం కోమాలోకి వెళ్లారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆంధ్ర క్రికెట్ సంఘం సభ్యుడిగా ఈ ప్రాంతంలో క్రికెట్ అభివృద్ధికి నరేంద్రనాథ్ కృషిచేశారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.