స్పెయిన్‌లో మకాం | Mahesh Koneru Announces New Movie With Keerthy Suresh In The Lead | Sakshi
Sakshi News home page

స్పెయిన్‌లో మకాం

Published Wed, Jun 12 2019 4:34 AM | Last Updated on Wed, Jun 12 2019 4:34 AM

Mahesh Koneru Announces New Movie With Keerthy Suresh In The Lead - Sakshi

సూట్‌కేసు సర్దుకుని యూరప్‌లో ల్యాండ్‌ అవడానికి రెడీ అవుతున్నారు హీరోయిన్‌ కీర్తీసురేశ్‌. నరేంద్రనాథ్‌ దర్శకత్వంలో కీర్తీ సురేశ్‌ ప్రధానపాత్రలో ఓ ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌ రూపొందుతున్న సంగతి తెలిసిందే. మహేశ్‌ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ ఈ నెల 13న స్పెయిన్‌లో ప్రారంభం కానుంది. ‘‘దాదాపు యాభైమంది ఆరిస్టులు, టెక్నీషియన్స్‌తో పాటుగా వెయ్యికిలోల లగేజ్‌తో యూరప్‌ పయనమయ్యాం. ఫిల్మ్‌ ఎక్విప్‌మెంట్‌ అదనంగా ఉంది. కాస్త స్ట్రెస్‌ఫుల్‌గా ఉన్నప్పటికీ ఈ అనుభవం కొత్త లెర్నింగ్‌గా ఉంటుందని భావిస్తున్నాం. ఈ నెల 13న స్పెయిన్‌లో షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తున్నాం’’ అని మహేశ్‌ కోనేరు చెప్పారు.

ఈ షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్‌ 90శాతం పూర్తవుతుంది. త్వరలోనే టైటిల్‌ని అనౌన్స్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నారు చిత్రబృందం. ఈ చిత్రాన్ని దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ఇలా కొత్త షెడ్యూల్‌ కోసం యూరప్‌కు మకాం మార్చారు కీర్తీసురేశ్‌. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, సీనియర్‌ నరేశ్, నదియా, కమల్‌ కామరాజు, భానుశ్రీ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కాకుండా నగేశ్‌ కుకునూరు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న కీర్తీసురేశ్, నాగార్జున ‘మన్మథుడు 2’ లో అతిథి పాత్ర పోషించారు. బాలీవుడ్‌లో అజయ్‌ దేవగణ్‌ నటించనున్న ఓ స్పోర్ట్స్‌ బయోపిక్‌లో కీర్తీ సురేశ్‌ కథానాయికగా నటించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement