mahesh koneru
-
మహేశ్ మరణవార్త విని షాకయ్యా, నమ్మలేకపోతున్నా: కల్యాణ్ రామ్
టాలీవుడ్ నిర్మాత, ఎన్టీఆర్ పీఆర్ఓ మహేశ్ కోనేరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం విశాఖపట్నంలోని ఆయన నివాసంలో మహేశ్‌కు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు స్లానిక ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మహేశ్ తుదిశ్వాస విడిచారు. ఆయన హఠాన్మరణంతో టాలీవుడ్ పరిశ్రమ షాక్ గురయ్యింది. మరీ ముఖ్యంగా నందమూరి హీరోలు జూనీయర్ ఎన్టీఆర్, కల్యాణ రామ్‌లు ఆయన మరణవార్తకు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. \ చదవండి: టాలీవుడ్లో విషాదం: జూ. ఎన్టీఆర్ మేనేజర్, నిర్మాత మృతి ఇప్పటికే మహేశ్ మృతిపై ఎన్టీఆర్ స్పందిస్తూ ట్వీట్ చేశారు. మహేశ్ మృతి జీర్ణించుకోలేకపోతున్నానని, మాటలు రావడం లేదు.. బరువెక్కిన గుండెతో ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నా అంటూ ఎన్టీఆర్ ఎమోషన్ ఆయ్యారు. తాజాగా ఆయన సోదరుడు, హీరో కల్యాణ్ రామ్ సైతం సోషల్ మీడియా వేదికగా భావోద్వేనికి గురయ్యారు. మహేశ్ మృతిపై ఆయన ట్వీట్.. అవును ఇది నమ్మలేకని వార్త. షాక్‌కు గురయ్యాను. మా స్నేహితులు, కుటుంబానికి అంత్యంత దగ్గరి వ్యక్తి, వెల్ విషర్ అయిన మహేశ్ కోనేరు ఇక లేరు. ప్రతి విషయంలో ఆయన మాకు వెన్ను దన్నుగా నిలిచారు. చదవండి: నా గుండె బరువెక్కింది, నమ్మలేకపోతున్నా: జూ. ఎన్టీఆర్ ఆయన మా కుటుంబానికి వెన్నుముకగా నిలిచారు. ఆయనను కొల్పోవడం వ్యక్తిగతంగా నాకు, సినీ పరిశ్రమకు పెద్ద నష్టం. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి, ఆయన సన్నిహితులు, స్నేహితులు శక్తిని ఇవ్వాలని ఆశిస్తున్నా’ అంటూ రాసుకొచ్చారు. కాగా గత కొంతకాలంగా మహేశ్ కోనేరు జూ. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లకు మేనేజర్‌గా వ్యవహరించడమే కాకుండా వారి వ్యక్తిగత విషయాల్లో కూడా చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నందమూరి ఫ్యామిలీకి అంత్యంత సన్నిహితులయ్యారు. Absolutely shook and in disbelief. A man who is a friend, family and well wisher is no more. Mahesh Koneru garu has been our backbone no matter what. Huge loss to me personally and the whole industry. Strength to his near and dear ones. pic.twitter.com/I8RbQNNRpH — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) October 12, 2021 -
నా గుండె బరువెక్కింది, నమ్మలేకపోతున్నా: జూ. ఎన్టీఆర్
Film Producer Mahesh S. Koneru: టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. యంగ్‌టైగర్ ఎన్టీఆర్ పీఆర్ఓ, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్ మహేశ్ కోనేరు గుండెపోటుతో మరణించారు. ఈ రోజు ఉదయం విశాఖపట్నంలోని ఆయన నివాసంలో మహేశ్‌కు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మహేశ్ తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన మృతికి టాలీవుడ్ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు ఆర్పిస్తున్నారు. చదవండి: టాలీవుడ్లో విషాదం: జూ. ఎన్టీఆర్ మేనేజర్, నిర్మాత మృతి అలాగే మహేశ్ మృతిపై జూ. ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ. ‘బరువెక్కిన గుండెతో నాకు మాటలు రావడం లేదు. నా స్నేహితుడు మహేశ్ కోనేరు ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్న. ఇప్పటికీ షాక్‌లోనే ఉన్నాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అంటూ ఎన్టీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. కాగా మహేశ్ ఎంతోకాలంగా జూ. ఎన్టీఆర్‌కు, కల్యాణ్ రామ్‌లకు పీఆర్ఓ వ్యవహరిస్తున్నారు. అలాగే పలు సినిమాలకు ఆయన డిస్ట్రిబ్యూటర్‌గా కూడా వ్యవహరించారు. ఆ తర్వాత ‘118, మిస్ ఇండియా, తిమ్మరుసు’ వంటి చిత్రాలను నిర్మించి నిర్మాత కూడా మారారు. మొదట ఒక సాధారణ జర్నలిస్ట్‌గా తన కెరీర్ మొదలు పెట్టిన మహేశ్ ఆ తర్వాత అంచలంచలుగా ఎదిగి సక్సెస్ ఫుల్ ఫిల్మ్ మేకర్‌గా ఎదిగారు. చదవండి: తన రాజీనామా లేఖలో నాగబాబు సంచలన వ్యాఖ్యలు With the heaviest of heart and in utter disbelief, I am letting you all know that my dearest friend @SMKoneru is no more. I am shell shocked and utterly speechless. My sincerest condolences to his family and his near and dear. pic.twitter.com/VhurazUPQk — Jr NTR (@tarak9999) October 12, 2021 -
టాలీవుడ్లో విషాదం: జూ. ఎన్టీఆర్ మేనేజర్, నిర్మాత మృతి
టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. యంగ్‌టైగర్ ఎన్టీఆర్ పీఆర్ఓ, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్ మహేశ్ కోనేరు గుండెపోటుతో మరణించారు. ఈ రోజు ఉదయం విశాఖపట్నంలోని ఆయన నివాసంలో మహేశ్‌కు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మహేశ్ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చదవండి: తన రాజీనామా లేఖలో నాగబాబు సంచలన వ్యాఖ్యలు దీంతో ఆయన మృతికి టాలీవుడ్ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు ఆర్పిస్తున్నారు. కాగా ఎంతోకాలంగా జూ. ఎన్టీఆర్‌కు మహేశ్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అలాగే పలు సినిమాలకు ఆయన డిస్ట్రిబ్యూటర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆ తర్వాత ఆయన ‘118, మిస్ ఇండియా, తిమ్మరుసు’ వంటి చిత్రాలను నిర్మించి నిర్మాతగా మారారు. Media Personality, Producer Mahesh Koneru passes away due to cardiac arrest today in Vizag. Om Shanthi pic.twitter.com/sxCmJxag13 — BA Raju's Team (@baraju_SuperHit) October 12, 2021 -
సాయి తేజ్‌కు ప్రమాదం ఎలా జరిగిందో వివరించిన ఎన్టీఆర్ పీఆర్ఓ
అపోలో ఆసుత్రిలో చికిత్స పొందుతున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మెల్లిమెల్లిగా కోలుకుంటున్నారు. శుక్రవారం(సెప్టెంబర్ 10)న ఆయనకు రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి మూడు రోజులు అవుతున్నా ఇప్పటికి ఈ విషయంపైన చర్చ జరుగుతోంది. అయితే ఈ ప్రమాదానికి కారణం తేజ్ అతివేగమే కారణమంటూ పలువురు కామెంట్స్ చేయగా, రోడ్డుపై ఉన్న ఇసుక వల్ల సాయి తేజ్ స్పోర్ట్స్ బైక్ స్కిడ్ అయినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ విషయమై చాలా మంది మిడి మిడి జ్ఞానంతో ఏవేవో కామెంట్స్ చేస్తున్నారంటూ ఎన్టీఆర్ పీఆర్ఓ మహేష్ కోనేరు సోషల్ మీడియాలో మండిపడ్డారు. తేజ్‌కు ప్రమాదం ఎలా జరిగి ఉండొచ్చో వివరిస్తూ దానికి సంబంధించిన యాక్సిడెంట్ వీడియోని మహేష్ ట్విటర్లో షేర్ చేశాడు. ‘పెద్ద వాహనాల గురించి తెలియని చాలామంది సాయిధరమ్ తేజ్‌కు జరిగిన ప్రమాదంపై మిడి మిడి జ్ఞానంతో కామెంట్స్ చేస్తున్నారు. అతను అతి వేగంగా, బాధ్యత రాహిత్యంతో డ్రైవింగ్ చేసే వ్యక్తి కాడు. రోడ్డుపై మట్టి, ఇసుక ఉండడం వల్ల ముందు వెళుతున్న వాహనాలు స్లో అయ్యాయి. సాయి నెమ్మదించి పక్కనుంచి వెళ్లాలనుకున్నాడు. అయితే అక్కడ ఇసుక ఉండడంతో జారి పడిపోయాడు. ఎంతో అనుభవం ఉన్న రేసర్‌కైనా సాధారణంగా ఇలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. రోడ్డు సరిగ్గా లేనందున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అంతేకానీ సాయి ఓవర్ స్పీడ్ వల్లకాదు. అతను ఎటువంటి నియమాలను అతిక్రమించలేదు, ఆ టైమ్‌లో సాయి తేజ్ హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు. యాక్సిడెంట్ అనేది ఎవరికైనా జరగొచ్చు. కాబట్టి అతడికి, అతడి కుటుంబ ప్రైవసీకి భంగం కలిగించకండి. అన్ని ప్రమాదాలు అతివేగం వల్ల మాత్రమే జరగవు’ అని మహేశ్ కోనేరు వీడియో పోస్టు క్యాప్షన్‌లో పేర్కొన్నాడు. If you see the video, auto and the bike slowed down considerably, probably due to the same stretch of sand/dirt. From what I could see, SDT also slowed down to avoid the bike and auto and swerved around them pic.twitter.com/YFBSfN6jcD — Mahesh Koneru (@smkoneru) September 12, 2021 -
తిరుపతి నుంచే ‘తిమ్మరుసు’ విజయోత్సవ యాత్ర
తిరుపతి కల్చరల్: తిమ్మరుసు చిత్రం విజయవంతం అయిన సందర్భంగా విజయోత్సవయాత్రలో భా గంగా ఆదివారం ఆ చిత్రం యూనిట్ తిరుపతిలో సందడి చేసింది. ఈ చిత్రం ప్రదర్శిస్తున్న పీజీఆర్ సినిమాస్‌కు విచ్చేసిన తిమ్మరుసు చిత్రం హీరో సత్యదేవ్, దర్శకుడు చరణ్ కొప్పిశెట్టి, నిర్మాత మహేష్ కోనేరు, సహనటుడు అకింత్‌కు పీజీఆర్ అధినేత అభిషేక్ పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు ప్రేక్షకులతో కలిసి చిత్ర ప్రదర్శనను తిలకించి, ప్రేక్షకుల నడుమ సందడి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో సత్యదేవ్ మాట్లాడుతూ.. కరోనా విపత్కర కష్టాల నేపథ్యంలో విడుదలైన తమ చిత్రాన్ని ఆదరిస్తూ విజయపథంలో నడిపిస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. తిరుమల వెంకన్న పాదాల చెంతనున్న తిరుపతి అంటే తనకెంతో ఇష్టమని, ఇక్కడి నుంచే తన విజయయాత్ర ప్రారంభించడం మహదానందమని చెప్పారు. ఈ చిత్రం తర్వాత ‘స్కైలాబ్’ చిత్రంలో నటిస్తున్నానని, భవిషత్తులో జనం మెచ్చే మంచి చిత్రాలతో ముందుకు సాగుతాయనని తెలిపారు. దర్శకుడు చరణ్ కొప్పిశెట్టి మాట్లాడుతూ చిత్రం యూనిట్ సమష్టి కృషితో ఒక మంచి చిత్రాన్ని అందించామని చెప్పారు. కరోనా రెండోదశ తర్వాత ఎంతో నమ్మకంతో చిత్రా న్ని విడుదల చేశామని, అదే నమ్మకంతో సినిమాకు విజయాన్ని చేకూర్చుతున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. అనంతరం హీరో సత్యదేవ్‌తో సెల్పీ దిగేందుకు అభిమానుల సందడిచేశారు. -
తిమ్మరుసు మూవీ రివ్యూ
టైటిల్ : తిమ్మరుసు జానర్ : క్రైమ్ థ్రిల్లర్ నటీనటులు : సత్యదేవ్, ప్రియాంక జవాల్కర్ నిర్మాణ సంస్థ : యూవీ క్రియేషన్స్ నిర్మాతలు : మహేశ్ కోనేరు, సృజన్ ఎరబోలు దర్శకత్వం : శరణ్ కొప్పిశెట్టి సంగీతం : శ్రీచరణ్ పాకాల సినిమాటోగ్రఫీ : అప్పు ప్రభాకర్ ఎడిటర్ : తమ్మి రాజు విడుదల తేది : జూలై 30, 2021 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య'తో నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు సత్యదేవ్. డిఫరెంట్ కాన్సెప్టులతో ప్రేక్షకులను అలరించిన ఈ హీరో ఇప్పుడు లాయర్ అవతారమెత్తాడు. కానీ కేసు పేరుతో డబ్బులు గుంజే లాయర్‌గా కాదు, కేసును గెలిపించడం కోసం జేబులోని డబ్బును కూడా నీళ్లలా ఖర్చుపెట్టే న్యాయవాదిగా! ఈ మధ్య వచ్చిన 'నాంది', 'వకీల్ సాబ్' వంటి కోర్టు రూమ్ డ్రామా చిత్రాలు బాగా ఆడటంతో తను నటించిన 'తిమ్మరుసు' సినిమా కూడా తప్పకుండా విజయం సాధిస్తుందని కొండంత ధీమా పెట్టుకున్నాడు సత్యదేవ్. మరి అతడి నమ్మకం నిజమైందా? అసలు తిమ్మరుసు అన్న టైటిల్ ఈ చిత్రానికి సెట్టయ్యిందా? అసలే బాలీవుడ్‌లోనూ కాలు మోపబోతున్న అతడికి ఈ సినిమా ప్లస్‌గా మారనుందా? మైనస్ అవనుందా? అనే విషయాలన్నీ కింది రివ్యూలో ఓ రౌండేద్దాం.. కథ శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలోని తిమ్మరుసు చాలా తెలివైన వ్యక్తి. అతడి పేరును టైటిల్‌గా పెట్టుకున్నారంటేనే తెలిసిపోతోంది హీరో చాలా తెలివైనవాడని. ఈ సినిమాలో సత్యదేవ్ ఇంటెలిజెంట్ లాయర్‌గా నటించాడు. అతడు ఎనిమిదేళ్ల క్రితం జరిగిన క్యాబ్ డ్రైవర్ మర్డర్ కేసును రీఓపెన్ చేస్తాడు. అతడి హత్య వెనకాల ఉన్న మిస్టరీని చేధించే పనిలో పడతాడు. ఈ క్రమంలో ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కుర్రాడికి ఆ హత్యకు ఎలాంటి సంబంధం లేదని తెలుసుకుంటాడు. మరి ఇందులో ఆ అబ్బాయిని ఎవరు? ఎందుకు ఇరికించారు? ఇందులో పోలీసుల ప్రమేయం ఎంతమేరకు ఉంది? అసలు ఆ క్యాబ్ డ్రైవర్‌ను ఎందుకు హత్య చేస్తారు? ఈ చిక్కుముడులను అన్నింటినీ ఒక్కొక్కటిగా విప్పుకుంటూ వెళ్లే రామచంద్ర చివరాఖరకు కేసు గెలుస్తాడా? అతడు ఇంతలా ఇన్వాల్వ్ కావడానికి ఆ కేసుతో ఇతడికేమైనా సంబంధం ఉందా? ఆ కేసు స్టడీ చేసే రామచంద్రకు పోలీసులు ఎందుకు సహకరించరు? అన్న వివరాలు తెలియాలంటే బాక్సాఫీస్‌కు వెళ్లి బొమ్మ చూడాల్సిందే! విశ్లేషణ 'బీర్బర్' సినిమాకు రీమేక్‌గా వచ్చిందే తిమ్మరుసు. ఈ సినిమా ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉన్నప్పటికీ సెకండాఫ్ మాత్రం బాగుంది. ప్రియాంక జవాల్కర్ తన అందంతో, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో యూత్‌ను బుట్టలో వేసుకోవడం ఖాయం. బ్రహ్మాజీ కామెడీ సినిమాకు ప్రధాన బలం. బీజీఎమ్ మరొక హైలైట్ అని చెప్పవచ్చు. మర్డర్ కేసును చేధించే పనిలో పడ్డ హీరో ఒక్కో క్లూను కనుక్కోవడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలు, ట్విస్టులు ప్రేక్షకుడిని సీటులో అతుక్కుపోయేలా చేస్తాయి. సినిమాటోగ్రఫీ మాత్రం అదిరిపోయింది. నిర్మాణ విలువలు బాగున్నప్పటికీ కథనం కొంత వీక్‌గా ఉన్నట్లు అనిపించక మానదు. ఫస్టాఫ్ మీద ఇంకాస్త దృష్టి పెట్టుంటే సినిమా ఇంకో రేంజ్లో ఉండేది! నటీనటులు యాక్టింగ్ అంటే పిచ్చి అని చెప్పుకునే సత్యదేవ్ ఈ సినిమాలో ఎలా నటించాడనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓవైపు సాఫ్ట్‌గా కనిపిస్తూనే మరోవైపు ఫైట్ సీన్లలోనూ ఇరగదీశాడు. లాయర్ పాత్రకు ఆయన పర్ఫెక్ట్గా సూటయ్యాడు. ఇక టాక్సీవాలా హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ బాగానే నటించింది. బ్రహ్మాజీ ఎప్పటిలాగే ప్రేక్షకులను వీలైనంత నవ్వించేందుకు ట్రై చేశాడు. మిగతా నటీనటులు కూడా సినిమాను సక్సెస్ దిశగా నడిపించేందుకు తెగ కష్టపడ్డట్లు తెలుస్తోంది. ప్లస్ సత్యదేవ్ నటన ట్విస్టులు ఇంటర్వెల్, క్లైమాక్స్ మైనస్ ఫస్టాఫ్ వీక్‌గా ఉండటం -
సరికొత్త తిమ్మరుసు
‘బ్లఫ్ మాస్టర్’, ’ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి విలక్షణమైన చిత్రాలు, పాత్రలతో ప్రేక్షకుల ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న సత్యదేవ్ హీరోగా ‘తిమ్మరుసు’ సినిమా రూపొందుతోంది. ‘అసైన్మెంట్ వాలి’ అనేది ట్యాగ్‌లైన్ . శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్ కోనేరుతో పాటు ఎస్ ఒరిజినల్స్ బ్యానర్‌పై సృజన్ ఎరబోలు నిర్మిస్తున్న ఈ సినిమా ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సినిమాటోగ్రాఫర్ అప్పూ ప్రభాకర్ క్లాప్ ఇవ్వగా, రాజా, వేదవ్యాస్ స్క్రిప్ట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ –‘‘డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ఇది. సత్యదేవ్‌ను సరికొత్త కోణంలో ఆవిష్కరించే సినిమా అవుతుంది. ఈ నెల 21న రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తాం. నిరవధికంగా జరిగే లాంగ్ షెడ్యూల్లో సినిమా చిత్రీకరణ పూర్తి చేసేలా ప్లాన్ చేశాం’’ అన్నారు. ప్రియాంకా జవాల్కర్, బ్రహ్మాజీ, అజయ్, ప్రవీణ్, ఆదర్శ్ బాలకృష్ణ, ఝాన్సీ, వైవా హర్ష, సంధ్యా జనక్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: అప్పూ ప్రభాకర్. -
కీర్తీ... మిస్ ఇండియా
హెడ్డింగ్ చదవగానే కీర్తీ సురేశ్ ‘మిస్ ఇండియా’ పోటీల్లో పాల్గొన్నారేమో అనుకుంటున్నారా? అదేం లేదు. అసలు సంగతి ఏంటంటే... కీర్తీ సురేశ్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రానికి ‘మిస్ ఇండియా’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. నరేంద్ర దర్శకత్వంలో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రనిర్మాత మహేశ్ కోనేరు మాట్లాడుతూ– ‘‘మా చిత్రంలో కథానాయిక ఎదుర్కొన్న సంఘటనను ప్రతి అమ్మాయి తన జీవితంలో ఎక్కడో ఒక చోట ఎదుర్కొనే ఉంటుంది. మహిళలు సహా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే చిత్రమిది. ఇటీవల యూరప్‌లో భారీ షెడ్యూల్ పూర్తి చేశాం. మిగిలిన చిత్రీకరణను త్వరగా పూర్తి చేసి, అక్టోబర్ లేదా నవంబర్‌లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. కీర్తి నుంచి ప్రేక్షకులు ఎలాంటి సినిమా రావాలని కోరుకుంటారో అలాంటి సినిమానే ‘మిస్ ఇండియా’’ అన్నారు. ‘‘అన్ని భావోద్వేగాలు కలగలిపిన చిత్రమిది. ఈ కథకు కీర్తీ సురేశ్‌గారు మాత్రమే న్యాయం చేయగలరని నేను, మహేశ్‌గారు భావించి ఆమెను కలిశాం. కథ చాలా బాగా నచ్చి ఆమె ఒప్పుకున్నారు. కీర్తి సహకారంతో సినిమాను అనుకున్న ప్లానింగ్‌లో పూర్తి చేస్తున్నాం’’ అన్నారు నరేంద్ర. -
విశ్రాంతి లేదు
కీర్తీ సురేశ్ అండ్ టీమ్ యూరప్ నుంచి ఇండియాకి రిటర్న్ అయ్యారు. అక్కడి షెడ్యూల్ ముగించుకుని వచ్చారు కదా! కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటారేమో? అంటే నో రెస్ట్ అట. మరో వారం నుంచి మళ్లీ పనిలో పడిపోతారట. కీర్తీ సురేశ్ ముఖ్య పాత్రలో నూతన దర్శకుడు నరేంద్రనాథ్ ఓ లేడీ ఓరియంటెడ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మహేశ్ కోనేరు నిర్మాత. ఈ చిత్రానికి ‘సఖి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇటీవలే స్పెయిన్‌లో నెలరోజులు చిత్రీకరణ జరిపారు యూనిట్. వారం రోజుల్లో హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించనున్నారు. రాజేంద్రప్రసాద్, నదియా, నరేశ్, కమల్ కామరాజు కీలక పాత్రలో నటించనున్న ఈ చిత్రాన్ని దసరాకు రిలీజ్ చేయనుంది చిత్ర యూనిట్. -
అతిథి పాత్రలో ఎన్టీఆర్!
ఈ జనరేషన్ హీరోలు మల్టీస్టారర్ సినిమాలకు, అతిథి పాత్రలకు వెంటనే ఓకె చెప్పేస్తున్నారు. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం ఇంతవరకు అలాంటి సినిమాలు చేయలేదు. మహానటి లాంటి సినిమాలో తాత పాత్రలో నటించే అవకాశం వచ్చినా.. సున్నితంగా తిరస్కరించాడు. అయితే తాజాగా జూనియర్ ఓ సినిమాలో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చేందుకు ఓకె చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగేంద్ర దర్శకుడిగా తెరకెక్కుతున్న సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్లో నటించేందుకు ఓకె చెప్పారట. ఎన్టీఆర్ సన్నిహితుడు పీఆర్ మహేష్ కోనేరు నిర్మిస్తున్న సినిమా కావటంతో ఎన్టీఆర్ అంగీకరించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఇంతవరకు స్పందించలేదు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
స్పెయిన్‌లో మకాం
సూట్‌కేసు సర్దుకుని యూరప్‌లో ల్యాండ్ అవడానికి రెడీ అవుతున్నారు హీరోయిన్ కీర్తీసురేశ్. నరేంద్రనాథ్ దర్శకత్వంలో కీర్తీ సురేశ్ ప్రధానపాత్రలో ఓ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. మహేశ్ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల 13న స్పెయిన్‌లో ప్రారంభం కానుంది. ‘‘దాదాపు యాభైమంది ఆరిస్టులు, టెక్నీషియన్స్‌తో పాటుగా వెయ్యికిలోల లగేజ్‌తో యూరప్ పయనమయ్యాం. ఫిల్మ్ ఎక్విప్మెంట్ అదనంగా ఉంది. కాస్త స్ట్రెస్‌ఫుల్‌గా ఉన్నప్పటికీ ఈ అనుభవం కొత్త లెర్నింగ్‌గా ఉంటుందని భావిస్తున్నాం. ఈ నెల 13న స్పెయిన్‌లో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం’’ అని మహేశ్ కోనేరు చెప్పారు. ఈ షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్ 90శాతం పూర్తవుతుంది. త్వరలోనే టైటిల్‌ని అనౌన్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు చిత్రబృందం. ఈ చిత్రాన్ని దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ఇలా కొత్త షెడ్యూల్ కోసం యూరప్‌కు మకాం మార్చారు కీర్తీసురేశ్. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, సీనియర్ నరేశ్, నదియా, కమల్ కామరాజు, భానుశ్రీ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కాకుండా నగేశ్ కుకునూరు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న కీర్తీసురేశ్, నాగార్జున ‘మన్మథుడు 2’ లో అతిథి పాత్ర పోషించారు. బాలీవుడ్లో అజయ్ దేవగణ్ నటించనున్న ఓ స్పోర్ట్స్ బయోపిక్‌లో కీర్తీ సురేశ్ కథానాయికగా నటించనున్నారు. -
రెండింతలు వచ్చింది
‘‘ఇండస్ట్రీలోకి పాత్రికేయుడిగా వచ్చాను. సినిమాలకు రివ్యూస్ రాశాను. రివ్యూవర్స్ అభిప్రాయాలను గౌరవిస్తాను. సినిమా బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. ఒక నిర్మాతగా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు బాధగానే ఉంటుంది. ఇల్లు కట్టి చూడు..పెళ్లి చేసి చూడు.. అనే సామెతలా... సినిమా చేసి చూడు అని అనుకోవచ్చు’’ అన్నారు నిర్మాత మహేశ్ కోనేరు. కల్యాణ్‌రామ్ హీరోగా కేవీ గుహన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘118’. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్ కోనేరు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 1న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందని ఆనందం వ్యక్తం చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా మహేశ్ కోనేరు చెప్పిన విశేషాలు. ∙కల్యాణ్ రామ్‌గారి ‘నా నువ్వే’ సినిమా ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యాను. కానీ పూర్తిస్థాయి సోలో నిర్మాతగా ‘118’ నాకు తొలి సినిమా. ‘నా నువ్వే’ చిత్రాన్ని నమ్మి బాగా చేశాం. ఆశించిన ఫలితం రాలేదు. సినిమా వైఫల్యం చెందినప్పుడు బాధ కలిగింది. ఆ బాధ నుంచి తేరుకోవడానికి కాస్త టైమ్ పట్టింది. ∙‘నా నువ్వే’కు సరైన స్పందన రాకపోవడంతో ‘118’ చిత్రానికి కసిగా పని చేశాం. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. రిలీజ్ డే మార్నింగ్ కాస్త డివైడ్ టాక్ వినిపించినప్పటికీ మ్యాట్నీ నుంచి మంచి స్పందన వచ్చింది. మంచి బుకింగ్స్ లభించాయి. ముఖ్యంగా మల్టీప్లెక్స్ స్క్రీన్‌లో బుకింగ్స్ బాగా జరిగాయి. ∙కథ విని ఈ సినిమాను ఎన్టీఆర్ఆర్ట్స్ బ్యానర్లో చేద్దామని కల్యాణ్‌రామ్‌గారు అనుకున్నారు. కథ నచ్చి నేను నిర్మించాను. యూనిక్ పాయింట్. ఈ సినిమాతో కల్యాణ్‌రామ్‌గారికి నటన పరంగా మంచి పేరు వచ్చింది. గుహన్‌గారు సినిమాను మంచి థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించారు. కథ విన్నప్పుడే ఇందులోని ఆద్య పాత్రకు నివేథా ధామస్నే ఊహించుకున్నాం. స్క్రిప్ట్ విన్న తర్వాత ఆమె వెంటనే అంగీకరించారు. షాలినీ పాండే బాగా నటించారు. ఈ సినిమాకు ఒక రూపాయి ఖర్చు పెడితే రెండు రూపాయలు వచ్చాయి. ∙ఈ సినిమాను ఎడిటింగ్ రూమ్‌లో ఎన్టీఆర్‌గారు చూసి, బాగుందని మెచ్చుకున్నారు. మాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఆ తర్వాత ఈ సినిమాను ‘దిల్’ రాజు, శిరిష్‌లు చూశారు. ‘దిల్’ రాజుగారికి నచ్చడంతో సినిమాపై మాకున్న నమ్మకం రెట్టింపు అయింది. ∙ప్రస్తుతం కీర్తీ సురేశ్ కథానాయికగా ఓ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ నిర్మిస్తున్నాం. ఈ ఏడాది సెకండాఫ్‌లో రిలీజ్ ప్లాన్ చేశాం. దర్శకుడు హరీష్ శంకర్‌తో కలిసి సినిమాలను నిర్మించే ఆలోచన ఉంది. కొత్తవారిని ప్రోత్సహించడమే మా ఉద్దేశం. హరీష్ శంకర్ దర్శకత్వంలో మా బ్యానర్లో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాం. ఈ ఏడాది చివర్లో ఓ పెద్దహీరోతో సినిమా చేయబోతున్నాం. ఎన్టీఆర్‌గారితో సినిమాలు చేసే అవకాశం వస్తే అదృష్టంగా భావిస్తాను. -
ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే కథ
నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటించిన చిత్రం ‘118’. నివేదా థామస్, షాలినీ పాండే కథానాయికలుగా నటించారు. మహేశ్ కోనేరు నిర్మించారు. సినిమాటోగ్రాఫర్ కె.వి. గుహన్ ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ– ‘‘ఈ కథ ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. కానీ మనం పట్టించుకోం.. వదిలేస్తాం. ట్రైలర్‌ను లోతుగా గమనిస్తే సినిమా ఏంటో అర్థమైపోతుంది. నివేదా థామస్ పాత్ర ఆధారంగానే సినిమా అంతా సాగుతుంది. ఆమె బాగా నటించారు. గుహన్‌గారి సినిమాటోగ్రఫీ గురించి చెప్పేంత పెద్దవాడిని కాదు నేను. కానీ పక్కాగా ప్లాన్ చేసి ఈ సినిమాను బాగా తెరకెక్కించారు. నిర్మాత మహేశ్ నాకు కుటుంబ సభ్యుడితో సమానం. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో చేద్దామనేంత బాగా నచ్చింది ఈ సినిమా స్క్రిప్ట్. అయితే పూర్తి కథ విని మహేశ్ నిర్మించడానికి రెడీ అయ్యారు. తమ్మిరాజుగారి సపోర్ట్ మర్చిపోలేనిది. మార్చి 1న సినిమాను రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘మంచి కథతో మిళితమైన థ్రిల్లర్ చిత్రమిది. సినిమాటోగ్రాఫర్ నుంచి దర్శకునిగా మారిన తర్వాత ఒక సినిమా కోసం టీమ్ ఎంత కష్టపడతారో అర్థం అయింది. కల్యాణ్‌రామ్‌గారి యాక్టింగ్ సూపర్. ఒక వ్యక్తిగా ఆయన ఎంతగానో సపోర్ట్ చేశారు. నివేదా థామస్ ఓ బాధ్యతాయుతమైన పాత్రలో నటించారు. షాలినీ పాండే నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నిర్మాత మహేశ్‌గారికి థ్యాంక్స్. శేఖర్‌చంద్ర మంచి మ్యూజిక్ ఇచ్చారు’’ అన్నారు కె.వి. గుహన్. ‘‘కల్యాణ్‌రామ్‌గారి నటన, గుహన్‌గారి టేకింగ్, నివేదా, షాలినీల పెర్ఫార్మెన్స్... ఇలా అన్నీ బాగా కుదిరాయి. ఇది నాకు స్పెషల్ మూవీ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది’’ అన్నారు మహేశ్ కోనేరు. ‘‘118 అంటే ఏంటి? అనేది తెలుసుకోవాలంటే సినిమా మొత్తం చూడాల్సిందే. తక్కువ టైమ్‌లో చాలా ఎక్కువగా వర్క్ చేసిన చిత్రమిది. చాలెంజింగ్‌గా అనిపించింది’’ అన్నారు నివేధా థామస్. -
ప్రతి అమ్మాయి కనెక్ట్ అయ్యే కథతో...
‘మహానటి’ తర్వాత తెలుగు ప్రేక్షకుల్లో కీర్తీ సురేశ్‌పై అభిమానం అమాంతం పెరిగింది. ఇప్పుడు ఓ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలో నటించనున్నారామె. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నరేంద్ర దర్శకత్వంలో మహేశ్ కోనేరు నిర్మించనున్నారు. ఈ సినిమా ముహూర్తం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత బీవీయస్‌యన్ ప్రసాద్, దర్శకుడు వెంకీ అట్లూరి కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో కల్యాణ్ రామ్ క్లాప్ ఇచ్చారు. ఫస్ట్ షాట్‌కి దర్శకుడు హరీష్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా కీర్తీ సురేశ్ మాట్లాడుతూ – ‘‘తెలుగులో ‘మహానటి’ తర్వాత నటిస్తోన్న సినిమా ఇది. ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రంలో నటించడం సంతోషంగా ఉంది. ప్రతి అమ్మాయి కనెక్ట్ అయ్యే చిత్రమిది. సినిమా షూటింగ్ ఎక్కువ శాతం అమెరికాలో జరగనుంది. దర్శకుడు నరేంద్ర మంచి కథ సిద్ధం చేశారు. తెలుగు ప్రేక్షకులకు ఇంకా దగ్గరవుతాననే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘2016 నుంచి ఈ కథను తయారు చేస్తున్నాను. అన్ని ఎమోషన్స్ ఇందులో ఉంటాయి. ఈ పాత్రకు కీర్తీగారు తప్ప ఇంకెవరూ సూట్‌కారు. 75శాతం షూటింగ్ అమెరికాలో జరుగుతుంది. ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ చేస్తాం’’ అన్నారు దర్శకుడు నరేంద్ర. ‘‘మహానటి’తో కీర్తి తెలుగు ప్రేక్షకులకు ఎంతలా కనెక్ట్ అయ్యారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతి అమ్మాయి ఏదో సందర్భంలో ఎదుర్కొన్న సంఘటన ఆధారంగా ఈ సినిమా కథ ఉంటుంది. మిగతా నటీనటులను త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాత మహేశ్ కోనేరు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు కల్యాణ్ కోడూరి పాల్గొన్నారు. -
మరో లేడీ ఓరియెంటెడ్ మూవీలో కీర్తి!
‘మహానటి’తో నటిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు కీర్తి సురేష్. ఈ మూవీ తరువాత ఇప్పటివరకు మరే తెలుగు ప్రాజెక్ట్‌ను కీర్తి సురేష్ ప్రకంటించలేదు. తమిళ్ డబ్బింగ్ సినిమాలైన సామి, పందెంకోడి2, సర్కార్ సినిమాలతోనే టాలీవుడ్‌ను పలకరించింది. అయితే తాజాగా ఓ లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్‌ను తెలుగులో చేయనున్నట్లు ప్రకటించారు. మహేష్ కోనేరు నిర్మాతగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనుండగా.. కళ్యాణీ మాలిక్ సంగీతాన్ని సమకూర్చనున్నారు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్‌పై తెరకెక్కనున్న ఈ చిత్రంతో నరేంద్ర అనే కొత్త దర్శకుడు పరిచయం కానున్నాడు. -
ఎన్టీఆర్‌పై ఆ వార్త ఫేక్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్‌కు సంబంధించి ఓ వార్త గతరాత్రి నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి పండంటి ఆడబిడ్డకు జన్మినిచ్చిందంటూ కొన్ని వెబ్సైట్లు హల్ చల్ చేశాయి. కానీ, చివరకు ఆ వార్త ఫేక్ అని తేలింది. తారక్ పీఆర్ మహేష్ కోనేరు కూడా గత రాత్రి తన ట్విటర్లో ఆ వార్త నిజం కాదని తేల్చారు. అయితే ఈ విషయంలో గందరగోళంలో ఉన్న కొందరు అభిమానులు మాత్రం ఎన్టీఆర్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతూ సందేశాలు పెడుతుండటం విశేషం. ఇదిలావుంటే ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో అరవింద సమేత చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా మూడో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. Fake news sir — Mahesh S Koneru (@smkoneru) 3 June 2018 -
ఎన్టీఆర్ బాగున్నాడు.. అవన్నీ రూమర్స్
సోషల్ మీడియాతో పాటు కొన్ని వెబ్ సైట్స్ చూపిస్తున్న అత్యుత్సాహం సినీ సెలబ్రిటీలకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. కొందరు ఆకతాయిలు కావాలని క్రియేట్ చేస్తున్న రూమర్స్ కూడా సెలబ్రిటీలకు తలనొప్పిగా మారుతున్నాయి. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ రూమర్స్ బారిన పడ్డాడు. రాజమౌళి సినిమా కోసం అమెరికా వెళ్లిన జూనియర్‌కు అక్కడ ప్రమాదం జరిగినట్టుగా రెండు రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై ఎన్టీఆర్ పీఆర్, నిర్మాత మహేష్ కోనేరు స్పందించారు. ఓ అభిమాను ఎన్టీఆర్ కు ప్రమాదం జరిగినట్టుగా ఓ వెబ్సైట్ ఉన్న వార్తపై క్లారిటీ కోరగా.. అవన్నీ రూమర్స్, ఎన్టీఆర్ బాగున్నారు.. షూటింగ్ కోసం రెడీ అవుతున్నారు అంటూ స్పందించారు. త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్న ఎన్టీఆర్. ఆ తరువాత రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్ తో కలిసి మల్టీ స్టారర్ సినిమాలో నటించనున్నాడు. Pure bull shit ‘news’ .. Tarak is absolutely fine and back in Hyd and is working out as strongly as ever towards his rock solid physique :) — Mahesh S Koneru (@smkoneru) 12 March 2018 -
తారక్ క్షేమం.. పుకార్లను నమ్మొద్దు
హైదరాబాద్: 'ఐ వాన్నా ఫాలో ఫాలో' అంటూ అభిమానులను వెంటాడుతున్న జూనియర్ ఎన్టీఆర్ గాయపడినట్లు వచ్చిన వార్తలు తారక్ అభిమానులను కలవరపర్చాయి. ఉన్నట్టుండి జనతా గ్యారేజ్ ట్విట్టర్ పేజీలో ఈ షాకింగ్ న్యూస్ చూసి ఫ్యాన్స్ కంగారు పడ్డారు. ఈ విషయం దావానలంలా వ్యాపించడంతో నిజానిజాలు కనుక్కునే ప్రయత్నం చేసారు. సోషల్ మీడియాలో అనేక ప్రశ్నాలు, అనుమానాలు వెల్లువెత్తాయి. కొద్దిసేపటికే ఆ పేజీ బ్లాక్ అయింది. అయితే చిత్ర నిర్మాతల వివరణతో అది ఫేక్ ఖాతా అని తర్వాత తేలింది. ఈ పుకార్లపై చిత్ర నిర్మాతలు వెంటనే వివరణ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ కు ఏమీ కాలేదని..అవన్నీ పుకార్లని తేల్చారు. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అటు యంగ్ టైగర్ గాయపడ్డాడన్న పుకార్లపై ఎన్టీఆర్ పిఆర్ మహేష్ ఎస్ కోనేరు కూడా స్పందించారు. 'జనతా గ్యారేజ్ సినిమాకు సంబంధించిన ఏ విషయం అయినా @MythriOfficial పేజీ ద్వారానే వస్తాయి. జనతా గ్యారేజ్ పేరుతో ఎటువంటి అఫీషియల్ పేజీ లేదనీ, వదంతులను నమ్మొద్దని కోరారు. తారక్ కు ఏమీ కాలేదని అని ఆయన ట్విట్టర్ లో తెలిపారు. మరో వైపు నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్ కూడా ట్విట్టర్ ద్వారానే వివరణ ఇచ్చింది. షూటింగ్ లోఎలాంటి ప్రమాదం జరగలేదని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో 'జనతా గ్యారేజ్' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైత్రీమూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ లో ఎన్టీర్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. This @MythriOfficial is the only official id for #JanathaGarage ..No other id's exist..don't believe rumours..Tarak is perfectly fine — Mahesh S Koneru (@smkoneru) March 16, 2016