Nandamuri Kalyan Ram Tweet About Film Producer Mahesh S. Koneru Death - Sakshi
Sakshi News home page

Mahesh S. Koneru: మహేశ్‌ మృతి నాకే కాదు పరిశ్రమకు సైతం పెద్ద నష్టం

Oct 12 2021 1:16 PM | Updated on Oct 12 2021 3:18 PM

Kalyan Ram Tweet On Mahesh Koneru Death Says Huge Loss to Me Personally - Sakshi

టాలీవుడ్‌ నిర్మాత, ఎన్టీఆర్‌ పీఆర్‌ఓ మహేశ్‌ కోనేరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం విశాఖపట్నంలోని ఆయన నివాసంలో మహేశ్‌కు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు స్లానిక ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మహేశ్‌ తుదిశ్వాస విడిచారు. ఆయన హఠాన్మరణంతో టాలీవుడ్‌ పరిశ్రమ షాక్‌ గురయ్యింది. మరీ ముఖ్యంగా నందమూరి హీరోలు జూనీయర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ రామ్‌లు ఆయన మరణవార్తకు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. \

చదవండి: టాలీవుడ్‌లో విషాదం: జూ. ఎన్టీఆర్‌ మేనేజర్‌, నిర్మాత మృతి

ఇప్పటికే మహేశ్‌ మృతిపై ఎన్టీఆర్‌ స్పందిస్తూ ట్వీట్‌ చేశారు. మహేశ్‌ మృతి జీర్ణించుకోలేకపోతున్నానని, మాటలు రావడం లేదు.. బరువెక్కిన గుండెతో ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నా అంటూ ఎన్టీఆర్‌ ఎమోషన్‌ ఆయ్యారు. తాజాగా ఆయన సోదరుడు, హీరో కల్యాణ్‌ రామ్‌ సైతం సోషల్‌ మీడియా వేదికగా భావోద్వేనికి గురయ్యారు. మహేశ్‌ మృతిపై ఆయన ట్వీట్‌.. అవును ఇది నమ్మలేకని వార్త. షాక్‌కు గురయ్యాను. మా స్నేహితులు, కుటుంబానికి అంత్యంత దగ్గరి వ్యక్తి, వెల్‌ విషర్‌ అయిన మహేశ్‌ కోనేరు ఇక లేరు. ప్రతి విషయంలో ఆయన మాకు వెన్ను దన్నుగా నిలిచారు.

చదవండి: నా గుండె బరువెక్కింది, నమ్మలేకపోతున్నా: జూ. ఎన్టీఆర్‌

ఆయన మా కుటుంబానికి వెన్నుముకగా నిలిచారు. ఆయనను కొల్పోవడం వ్యక్తిగతంగా నాకు, సినీ పరిశ్రమకు పెద్ద నష్టం. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి, ఆయన సన్నిహితులు, స్నేహితులు శక్తిని ఇవ్వాలని ఆశిస్తున్నా’ అంటూ రాసుకొచ్చారు. కాగా గత కొంతకాలంగా మహేశ్‌ కోనేరు జూ. ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌లకు మేనేజర్‌గా వ్యవహరించడమే కాకుండా వారి వ్యక్తిగత విషయాల్లో కూడా చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నందమూరి ఫ్యామిలీకి అంత్యంత సన్నిహితులయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement