సరికొత్త తిమ్మరుసు | Satyadev Next Movie is Timmarusu | Sakshi
Sakshi News home page

సరికొత్త తిమ్మరుసు

Published Mon, Oct 19 2020 12:12 AM | Last Updated on Mon, Oct 19 2020 12:12 AM

Satyadev Next Movie is Timmarusu - Sakshi

శరణ్‌ కొప్పిశెట్టి, సత్యదేవ్‌

‘బ్లఫ్‌ మాస్టర్‌’, ’ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి  విలక్షణమైన చిత్రాలు, పాత్రలతో ప్రేక్షకుల ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న సత్యదేవ్‌ హీరోగా ‘తిమ్మరుసు’ సినిమా రూపొందుతోంది. ‘అసైన్‌మెంట్‌ వాలి’ అనేది ట్యాగ్‌లైన్‌ . శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ అధినేత మహేశ్‌ కోనేరుతో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై సృజన్‌ ఎరబోలు నిర్మిస్తున్న ఈ సినిమా ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సినిమాటోగ్రాఫర్‌ అప్పూ ప్రభాకర్‌ క్లాప్‌ ఇవ్వగా, రాజా, వేదవ్యాస్‌ స్క్రిప్ట్‌ను అందజేశారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ –‘‘డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ మూవీ ఇది. సత్యదేవ్‌ను సరికొత్త కోణంలో ఆవిష్కరించే సినిమా అవుతుంది. ఈ నెల 21న రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభిస్తాం. నిరవధికంగా జరిగే లాంగ్‌ షెడ్యూల్‌లో సినిమా చిత్రీకరణ పూర్తి చేసేలా ప్లాన్‌  చేశాం’’ అన్నారు. ప్రియాంకా జవాల్కర్, బ్రహ్మాజీ, అజయ్, ప్రవీణ్, ఆదర్శ్‌ బాలకృష్ణ, ఝాన్సీ, వైవా హర్ష, సంధ్యా జనక్‌ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: శేఖర్‌ చంద్ర, కెమెరా: అప్పూ ప్రభాకర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement