
ఈ జనరేషన్ హీరోలు మల్టీస్టారర్ సినిమాలకు, అతిథి పాత్రలకు వెంటనే ఓకె చెప్పేస్తున్నారు. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం ఇంతవరకు అలాంటి సినిమాలు చేయలేదు. మహానటి లాంటి సినిమాలో తాత పాత్రలో నటించే అవకాశం వచ్చినా.. సున్నితంగా తిరస్కరించాడు. అయితే తాజాగా జూనియర్ ఓ సినిమాలో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చేందుకు ఓకె చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది.
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగేంద్ర దర్శకుడిగా తెరకెక్కుతున్న సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్‌లో నటించేందుకు ఓకె చెప్పారట. ఎన్టీఆర్ సన్నిహితుడు పీఆర్ మహేష్ కోనేరు నిర్మిస్తున్న సినిమా కావటంతో ఎన్టీఆర్ అంగీకరించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఇంతవరకు స్పందించలేదు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment