తారక్ క్షేమం.. పుకార్లను నమ్మొద్దు
హైదరాబాద్: 'ఐ వాన్నా ఫాలో ఫాలో' అంటూ అభిమానులను వెంటాడుతున్న జూనియర్ ఎన్టీఆర్ గాయపడినట్లు వచ్చిన వార్తలు తారక్ అభిమానులను కలవరపర్చాయి. ఉన్నట్టుండి జనతా గ్యారేజ్ ట్విట్టర్ పేజీలో ఈ షాకింగ్ న్యూస్ చూసి ఫ్యాన్స్ కంగారు పడ్డారు. ఈ విషయం దావానలంలా వ్యాపించడంతో నిజానిజాలు కనుక్కునే ప్రయత్నం చేసారు. సోషల్ మీడియాలో అనేక ప్రశ్నాలు, అనుమానాలు వెల్లువెత్తాయి. కొద్దిసేపటికే ఆ పేజీ బ్లాక్ అయింది. అయితే చిత్ర నిర్మాతల వివరణతో అది ఫేక్ ఖాతా అని తర్వాత తేలింది.
ఈ పుకార్లపై చిత్ర నిర్మాతలు వెంటనే వివరణ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ కు ఏమీ కాలేదని..అవన్నీ పుకార్లని తేల్చారు. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అటు యంగ్ టైగర్ గాయపడ్డాడన్న పుకార్లపై ఎన్టీఆర్ పిఆర్ మహేష్ ఎస్ కోనేరు కూడా స్పందించారు. 'జనతా గ్యారేజ్ సినిమాకు సంబంధించిన ఏ విషయం అయినా @MythriOfficial పేజీ ద్వారానే వస్తాయి. జనతా గ్యారేజ్ పేరుతో ఎటువంటి అఫీషియల్ పేజీ లేదనీ, వదంతులను నమ్మొద్దని కోరారు. తారక్ కు ఏమీ కాలేదని అని ఆయన ట్విట్టర్ లో తెలిపారు. మరో వైపు నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్ కూడా ట్విట్టర్ ద్వారానే వివరణ ఇచ్చింది. షూటింగ్ లోఎలాంటి ప్రమాదం జరగలేదని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
కాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో 'జనతా గ్యారేజ్' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైత్రీమూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ లో ఎన్టీర్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
This @MythriOfficial is the only official id for #JanathaGarage ..No other id's exist..don't believe rumours..Tarak is perfectly fine
— Mahesh S Koneru (@smkoneru) March 16, 2016