Twitter War Between Mahesh Babu and Thalapathy Vijay Fans - Sakshi
Sakshi News home page

Mahesh Babu-Vijay: ఆ స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌ మధ్య ట్విట్టర్‌ వార్‌, కారణమేటంటే..

Published Thu, Feb 10 2022 6:17 PM | Last Updated on Thu, Feb 10 2022 7:22 PM

Twitter War Between mahesh babu And Thalapathy Vijay Fans - Sakshi

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, కోలీవుడ్‌ స్టార్‌ హీరో దళపతి విజయ్‌ ఫ్యాన్స్‌ మధ్య ట్వీటర్‌ వార్‌ జరుగుతోంది. ఈ స్టార్‌ హీరోలకు దక్షిణాన మంచి క్రేజ్‌ ఉంది. మహేశ్‌కు తెలుగుతో పాటు తమిళంలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఆయన ఎన్నో సినిమాలు తమిళంలో డబ్‌ అయ్యాయి. అంతేకాదు మహేశ్ నటించిన పలు చిత్రాలను తమిళంలో రీమేక్ చేసి హిట్స్ కొట్టాడు విజయ్. ఇక ఈ ఇద్దరు హీరోల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. పరిశ్రమలో వీరద్దరూ మంచి సన్నిహితులు కూడా. కానీ ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య మాత్రం సయోధ్య కనిపించటం లేదు.

చదవండి: 10 ఏళ్లు పూర్తి: ఆ చేదు సంఘటనను గుర్తు చేసుకున్న హీరో సుధీర్‌ బాబు

తాజాగా ఈ హీరోల ఫ్యాన్స్ ట్వీట్టర్‌ వేదికగా వార్‌కు దిగారు. నిజానికి ఈ తరహా ఫ్యాన్స్‌ వార్ ఇదేం కొత్త కాదు. తరచుగా పలు స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో మాటల దాడి చేసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు మహేశ్, విజయ్ అభిమానుల వంతు వచ్చింది. అసలు విషయానికొస్తే.. మహేష్ బాబు నటించిన ‘సర్కార్ వారి పాట’ మొదటి సింగిల్ ఫిబ్రవరి 14 న రిలీజ్ కానుంది. ఇక అదే రోజు విజయ్ ‘బీస్ట్’ సింగిల్ కూడా విడుదల కాబోతోంది. తమ తమ హీరోల పాటలను హ్యాపీగా ఆస్వాదించటానికి రెడీ అవ్వాల్చిన అభిమానులు ట్విట్టర్‌లో ఫైట్‌కు చేసుకుంటున్నారు.

చదవండి: సమంత సరసన క్రికెటర్‌ శ్రీశాంత్‌!, ఏ మూవీలో తెలుసా?

యూట్యూబ్‌లో ‘బీస్ట్’ ట్రాక్ లైక్స్‌ను పెంచడానికి విజయ్ అభిమానులు బాట్స్‌ను ఉపయోగిస్తారని మహేశ్‌ ఫ్యాన్స్ ఆరోపించడమంతో ఈ వార్‌కు బీజం పడింది. అది చూసిన విజయ్ ఫ్యాన్స్.. మహేశ్‌ అభిమానులు ఫౌల్ క్రై చేస్తున్నారంటూ దండయాత్రకు చేశారు. ఇలా ఒకరిపై ఒకరూ వ్యాఖ్యలు చేసుకుంటూ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ మాటల యుద్దుం చేసుకుంటున్నారు. ఈ రెండు సినిమాల పాటలు విడుదల కాకముందే వీరి ఫ్యాన్ రచ్చ తారాస్థాయిని చేరింది. మరి మహేశ్, విజయ్ సినిమాల పాటలు రిలీజ్ అయిన తర్వాత ఈ వార్ ఇంకెంతటి స్థాయికి చేరుతుందో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement