![Vijay Birthday: Fans Gifted Gold Rings to Newborn - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/23/vel-murugan.jpg.webp?itok=5vTbocTy)
చిన్నారులకు ఉంగరాలు బహూకరిస్తున్న అధ్యక్షుడు వేల్‌మురుగన్
హీరో విజయ్ జన్మదిన వేడుకలను వేలూరులో అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. విజయ్ అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు వేల్‌మురుగన్ అధ్యక్షతన అభిమానులు వేలూరు శిశు భవన్‌లోని అనాథ పిల్లల మధ్య కేక్ కట్ చేసి పంచి పెట్టారు. అన్నదానం చేశారు. వేలూరు పెట్‌లాండ్ ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం జన్మించిన చిన్నారులకు బంగారు ఉంగరాలు బహూకరించారు.
వేల్‌మురుగన్ మాట్లాడుతూ సూపర్ స్టార్ విజయ్ జన్మదినోత్సవాన్ని శిశు భవనంలో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. తమ నాయకుడు త్వరలో రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజయ్ అభిమానుల సంఘం కార్పొరేషన్ అధ్యక్షుడు శంకరన్, కార్యదర్శి సురేష్, భరత్, డివిజన్ కార్యదర్శి రాజేష్, జాయింట్ కార్యదర్శి వివేక్, విజయ్ మండ్ర అధ్యక్షుడు శరవణన్, రేణు పాల్గొన్నారు. అదే విధంగా వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లోనూ విజయ్ అభిమానులు కేక్ కట్ చేసి, టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.
చదవండి: కోలీవుడ్‌లో సూపర్ స్టార్ ఎవరు?
Comments
Please login to add a commentAdd a comment