
హీరో మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువలా వచ్చాయి. ‘‘ప్రతి సంవత్సరం నా పుట్టినరోజుకి మీరందరూ నా మీద చూపించే ఈ ప్రేమ నేనెంత అదృష్టవంతుడినో నాకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఎంతో అభిమానంగా మీరు (కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు) పంపిన అభినందనలకు, దీవెనలకు హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు మహేశ్‌బాబు.
వరల్డ్ రికార్డ్... మహేశ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఫ్యాన్స్ ట్విట్టర్‌లో ‘హ్యాపీ బర్త్‌డే మహేశ్ బాబు’ అనే హాష్ ట్యాగ్‌తో ట్వీట్స్ చేశారు. 24 గంటల్లో 60.2 (6 కోట్లు) మిలియన్ ట్వీట్స్‌తో ప్రపంచంలోనే అత్యధికంగా ట్వీట్ చేయబడిన హాష్ ట్యాగ్‌గా రికార్డ్ సృష్టించింది. ట్విట్టర్‌లో తమ అభిమాన హీరో సాధించిన ఈ వరల్డ్ రికార్డ్‌తో అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment