సాక్షి, హైదరాబాద్: ఈ నెల మొదటి వారంతో పోలిస్తే స్వైన్‌ఫ్లూ ఉధృతి తగ్గిందని నిమ్స్ డెరైక్టర్ నరేంద్రనాథ్ స్పష్టం చేశారు. అయినా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. సచివాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. స్వైన్‌ఫ్లూతో ప్రతీ మూడు రోజులకు ఒకరు చనిపోయినట్లు తేలిందన్నారు. 2009 లో స్వైన్‌ఫ్లూ పాజిటివ్ వచ్చిన వారిలో 10 శాతం మంది చనిపోతే.. ఈ ఏడాది 3.64 శాతం మంది చనిపోయారన్నారు. మందుల కొరత లేదని, అవసరానికి మించి స్టాకు ఉందని చెప్పారు.