గతేడాదిలో సుమారు లక్ష పేటెంట్లను మంజూరు చేసినట్లు భారతీయ పేటెంట్ కార్యాలయం తెలిపింది. ప్రధానంగా జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) రిజిస్ట్రేషన్లలో చెప్పుకోదగ్గ పెరుగుదల ఉందని, గత ఏడాదితో పోలిస్తే మూడు రెట్లు పెరిగాయని పేర్కొంది. ఈమేరకు తాజాగా వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.
భారత్‌లో ప్రతి 6 నిమిషాలకు ఒక టెక్నాలజీ ఐపీ రైట్స్‌కోసం నమోదవుతున్నట్లు ప్రకటనలో పాలిపారు. 2022-23లో అత్యధికంగా 90,300 పేటెంట్ దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (15-మార్చి-2023 నుంచి 14-మార్చి 2024 వరకు) లక్షకు పైగా పేటెంట్‌లను మంజూరు చేశారు. ప్రతిరోజు 250 పేటెంట్లు మంజూరు చేసినట్లు తెలిసింది. 2013–14లో కేవలం 6 వేల పేటెంట్లు మాత్రమే ఇష్యూ అయినట్లు ప్రకటనలో తెలిపారు.
ఇదీ చదవండి: 2003-07 నాటి వృద్ధిరేటు దిశగా భారత జీడీపీ
ఈ సంఖ్య లక్షకు పెరగడం పట్ల వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ హర్షం వ్యక్తం చేసింది. విభిన్న అంశాలపై పరిశోధనలు చేస్తున్న ఆచార్యులు, సృజనాత్మకమైన ఆలోచనలతో కొత్త పరికరాలు, యంత్రాలను కనిపెడుతున్న వారు పేటెంట్ల కోసం దరఖాస్తు చేసుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment